Labels

దేశమంతా ఒకే గుర్తింపు కార్డు: అమిత్‌షా

23-09-2019
న్యూఢిల్లీ: 'ఒకేదేశం...ఒకే గుర్తింపు కార్డు' తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. అన్ని అవసరాలకూ ఉపయోగపడేలా దేశమంతా ఒకే గుర్తింపు కార్డు తీసుకురావాలనుకుంటున్నట్టు సూత్రప్రాయంగా ఆయన తెలిపారు. ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ కార్డు, బ్యాంక్ ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా...ఈ అవసరాలన్నింటికీ ఒకే బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు ఉంచుకోవచ్చని, అది ఆచరణ సాధ్యమని అన్నారు. ఇందువల్ల వేర్వేరు డాక్యుమెంటేషన్ల అవసరం ఉండదన్నారు.


 

సోమవారంనాడిక్కడ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సస్ కమిషనర్ నూతన ప్రధాన కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2021 జనాభా లెక్కింపులో మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తామని, జాతీయ జనాభా రిజిస్టర్‌ను కూడా తయారు చేస్తామని అన్నారు. ఒక వ్యక్తి చనిపోతే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యే వ్యవస్థను తీసుకురావాలనుకుంటున్నట్టు చెప్పారు. 'ఎన్నికల జాబితా అప్‌డేషన్‌లో వ్యక్తి జనన, మరణ రిజిస్టేషన్‌‌ను ఎందుకు అనుసంధానం చేయకూడదు? 18 ఏళ్లు వచ్చేసరికి సదరు వ్యక్తులను ఎన్నికల జాబితాల్లో చేర్చడం లేదా? అదేవిధంగా, మరణాన్ని సదరు కుటుంబం రిజిస్టర్ చేసినప్పుడు, ఓటర్ల జాబితా నుంచి మృతిచెందిన ఓటరును ఆటోమేటిక్‌గా తొలగించడం ఎందుకు సాధ్యం కాదు?' అని అమిత్‌షా ప్రశ్నించారు.

డాలర్‌ సిరి.. హెచ్‌ 1బీ వీసా ఉంది మరి


22 Sep, 2019 02:01 IST|Sakshi

అమెరికా వీసా విధానంతో భారత్‌కు కాసుల పంట

భారీగా సొమ్ము పంపుతున్న టెకీలు

2017లో అత్యధికంగా రూ. 4.42 లక్షల కోట్లు

దేశ రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధిలోనూ డాలర్‌ పాత్ర

గ్రీన్‌కార్డు కోసం నిరీక్షిస్తున్న భారతీయుల్లో 26 శాతానికిపైగా మిలియనీర్లే

మిన్నెసోట వర్సిటీ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు 

మారుతున్న ట్రెండ్‌.. 
స్వదేశంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి బదులుగా అమెరికాలో విలాసవంతమైన జీవనం గడపాలనుకునే భారతీయుల సంఖ్య నాలుగైదేళ్లుగా పెరుగుతోంది. ఎటూ కొన్నాళ్లకు గ్రీన్‌కార్డు వస్తుంది కదా... ఇల్లు కొను క్కుంటే బాగుంటుందని అను కుంటున్న వాళ్ల సంఖ్య పెరుగు తోంది. అదీ అత్యంత విలాస వంతమైన గృహాల కొనుగోలుకు ఎక్కువ మంది భారతీయులు ఇష్టపడుతున్నారని యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోట సోషియాలజీ ప్రొఫెసర్‌ ఎలిజబెత్‌ హెగర్‌ బోయ్లే ఓ నివేదికలో ప్రస్తావించారు. ఆయన బృందం భారతీయులు ఎక్కువగా నివసించే శాన్‌జోస్, డాలస్, హ్యూస్టన్, న్యూజెర్సీ, షికాగో, బోస్టన్, అట్లాంటా వంటి నగరాల్లో సర్వే నిర్వహించింది. 

సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘పొద్దుంటే మాపుండదు, మాపుంటే రేపుండదు.. బతుకులేమో ఎండిపాయే, మొండిమాను బతుకులాయే’ ఓ సినిమాలో ఈ పాట చరణం కర్ణాటక రాష్ట్రంలోని షిమోగలో ఒక నిరుపేద కుటుంబానికి అక్షరాలా వర్తిస్తుంది. కూలీ పనులు చేస్తూ ఓ పూట తిని ఓ పూట ఉపవాసం ఉంటూ చదివించిన కొడుకు అమెరికా వెళ్లి ఉద్యోగంలో స్థిరపడి ఐదేళ్ల తరు వాత (1990 దశకంలో ఆఖరులో) సొంతూ రుకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌ అద్దెకు తీసుకుని వెళ్లిన ఘటనను జాతీయ పత్రికలు పతాక శీర్షికల్లో ప్రచురించాయి. విదేశీ సాంకేతిక నిపుణులను ఆకర్షించడానికి అమెరికా తీసుకు వచ్చిన హెచ్‌1బీ వీసా అతని కలను సాకారం చేసింది. అంతేకాదు లక్షలాది మంది భారతీయ కుటుంబాల్లో సిరులు నింపింది. 2017లో భార తీయ ఐటీ ఉద్యోగులు ఇక్కడకు బదిలీ చేసిన మొత్తం రూ.4.42 లక్షల కోట్లు (65 బిలియన్‌ డాలర్లు). ఈ మొత్తం ఆ ఏడాది దేశంలోని 16 రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక బడ్జెట్‌ కంటే ఎక్కువ. భారతీయులు అమెరికా వెళ్లడం 1970 దశకంలో మొదలైనా అత్యంత ధనవంతులైన పెట్టుబడిదారులు, వైద్యులకు మాత్రమే అవకాశం ఉండేది. సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులను గమనించి ఐటీ నిపుణులను ఆకర్షించడానికి 1990 దశకం మధ్యలో అమెరికా తీసుకువచ్చిన హెచ్‌1బీ వీసా విధానం తెలుగు రాష్ట్రాల్లో వేలాది దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటునిచ్చింది.

హెచ్‌1బీ వీసా విధానానికి పూర్వం (1995కి ముందు) అమెరికా నుంచి భారత్‌కు బదిలీ అయిన మొత్తం 5 బిలియన్‌ డాలర్లుకాగా ఈ వీసాతో ఉద్యోగాలు ఇవ్వడం ప్రారంభమైన తరువాత మొదటి ఏడాది భారత్‌కు తరలివచ్చిన నగదు 6 బిలియన్‌ డాలర్లు. ఆ పరంపర 24 సంవత్సరాలుగా కొనసాగుతూ అమెరికా నుంచి వస్తున్న డబ్బు ఏటేటా పెరుగుతోందే తప్ప తగ్గిన దాఖలా కనిపించలేదు. 1998లో 10 బిలియన్‌ డాలర్లను తాకిన విదేశీ సంపద... 2014కు వచ్చేసరికి గరిష్టంగా 70 బిలియన్‌ డాలర్లు (రూ. 3.22 లక్షల కోట్లు) దాటింది. ఆ తరువాత అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో కొంత మార్పు వచ్చి అక్కడే ఇల్లు, ఇతర ఆస్తులు కొనుగోలు చేయడం ప్రారంభించడంతో 2017కు వచ్చేసరికి 5 బిలియన్లు తగ్గి 65 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. గత 2–3 ఏళ్లలో భారతీయ అమెరికన్లలో బాగా మార్పు కనిపించిందని, పుట్టిన పిల్లలను అమెరికాలోనే చదివించడం, విలాసవంతమైన ఇళ్లు, కార్లు కొనుగోలు చేయడం వంటి చర్యల ఫలితంగా భారత్‌కు పంపుతున్న మొత్తం తగ్గుతూ వస్తోందని యూనివర్సిటీ అఫ్‌ మిన్నెసోట అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు... వేలాది మంది భారతీయ అమెరికన్లు మిలియనీర్లు అయ్యారని ఆ అధ్యయనం విశ్లేషించింది. గ్రీన్‌కార్డు (శాశ్వత నివాసం) కలిగి ఉన్న వాళ్లే కాదు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వారిలోనూ మిలియన్‌ డాలర్లు, అంతకంటే ఎక్కువ నికర విలువగలవారు 26 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు.

13 ఏళ్ల క్రితమే 40 బిలియన్‌ డాలర్లు...
సమాచార సాంకేతిక రంగంలో పనిచేసే నిపుణులు భారత్‌ నుంచి ఏటా వేల సంఖ్యలో అమెరికాకు తరలివెళ్లడంతో 2000 దశకం రెండో భాగం నుంచి భారీగా డాలర్లు వచ్చిపడ్డాయి. 2005కు ముందు 20 బిలియన్‌ డాలర్లు మాత్రమే బదిలీకాగా ఆ తరువాత మూడేళ్లకు (2008) అది 50 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. దాదాపు ఆరేడు సంవత్సరాలపాటు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులు సంపాదించిన మొత్తంలో 65 శాతానికిపైగా స్వదేశానికి పంపారు. ఏటేటా ఇక్కడి నుంచి వెళ్లే సాంకేతిక నిపుణుల సంఖ్య పెరగడంతో 2014కు వచ్చేసరికి 70 బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. ఆ తరువాత మూడేళ్లపాటు కొంత మేర తగ్గడానికి భారతీయులు అమెరికాలో పెట్టుబడులు పెట్టడమే ప్రధాన కారణం. దానికితోడు ఎప్పుడు వస్తుందో తెలియని వలస ఆధారిత ప్రతిభ గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూడటం కంటే ఈబీ–5 (అర మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెడితే వచ్చే గ్రీన్‌కార్డు) పథకానికి ఎక్కువ మంది మొగ్గు చూపారు. గడచిన మూడేళ్లలో హెచ్‌1బీపై ఉద్యోగం చేస్తున్న లేదా వారి భాగస్వాములు 38 వేల మంది ఈబీ–5 సథకానికి దరఖాస్తు చేశారు. మామూలుగా 8–10 ఏళ్లు గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూడటం కంటే 5 లక్షల డాలర్లు అమెరికా మౌలిక సదుపాయాల సంస్థల్లో పెట్టుబడి పెడితే ఏడాదిలో గ్రీన్‌కార్డు తెచ్చుకోవచ్చన్న ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టారు. 

ఇండియా తరువాత ఛైనా...
అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ స్వదేశానికి డబ్బు పంపుతున్న దేశాల జాబితాలో భారత్‌దే అగ్రస్థానం. 2014, 2015లలో అమెరికా నుంచి భారత్‌కు 70 బిలియన్‌ డాలర్లు వస్తే 2016లో 68 బిలియన్‌ డాలర్లు, 2017లో 65 బిలియన్‌ డాలర్లు వచ్చిపడింది. భారత్‌ తరువాత స్థానం చైనాదే. 2012కు ముందు అగ్రస్థానంలో ఉన్న చైనా 2013 నుంచి భారత్‌ కంటే వెనుకబడింది. చైనీయులు అమెరికాలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టడం వల్లే భారత్‌ మొదటి స్థానంలోకి వచ్చిందని, సంపాదనలో భారత్‌ కంటే వారిదే పైచేయి అని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం 2017లో భారత్‌ తరువాత స్థానంలో చైనా, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఫ్రాన్స్, నైజీరియా, పాకిస్తాన్, ఈజిప్ట్, జర్మనీ, వియత్నాం ఉన్నాయి. స్టాన్‌ఫర్డ్‌ నివేదిక ప్రకారం భారత్‌ నుంచి అమెరికా వచ్చిన వారిలో 89 శాతం మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారే. సహజంగా ఆ రుణం తీర్చడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. రెండో ప్రాధాన్యతగా స్వదేశంలో ఆస్తులు కూడబెట్టుకునేందుకు డబ్బు పంపారు.

‘రియల్‌’కు ఊతమిచ్చిన అమెరికా డాలర్‌...
అమెరికాలో హెచ్‌1బీపై ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల సంఖ్య ఏటేటా పెరుగుతుండటంతో వారు స్వదేశానికి డబ్బు బదిలీ చేయడం కూడా అంతే స్థాయిలో పెరిగింది. హైదరాబాద్, పుణే, విశాఖపట్నం, భువనేశ్వర్, నోయిడా, జైపూర్, నాగ్‌పూర్‌ వంటి పట్టణాలు, నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధికి అమెరికా డాలర్‌ పాత్ర గణనీయమైనదని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ మానవాభివృద్ది విభాగం అసొసియేట్‌ ప్రొఫెసర్‌ ఆంటోని లైజింగ్‌ అంటోనియో పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో ఓ బృందం భారత్, చైనాలకు చెందిన 1,100 మంది హెచ్‌1బీ, 550 మంది గ్రీన్‌కార్డు కలిగిన వారిని ఆదాయానికి సంబంధించి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టింది. వాటి ప్రకారం చూస్తే భారత్‌కు డబ్బు పంపిన వారిలో 74 శాతం మంది రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టామని చెప్పారు. మరో 16 శాతం మంది తమ కుటుంబాల ఉన్నతికి ఖర్చు చేశామని పేర్కొనగా 8 శాతం మంది డాలర్‌ రేటు పెరిగినప్పుడల్లా రూపాయల్లో ఎక్కువ సొమ్ము వస్తుందన్న ఉద్దేశంతో బదిలీ చేశామన్నారు. రెండు శాతం మంది తాము అమెరికాలోనే ఇల్లు, కార్లు కొనుగోలు చేయడానికి ఖర్చు చేశామని వివరించారు.

ఊరికి ఇద్దరు లేదా ముగ్గురు...
డాలర్‌ డ్రీమ్‌ తెలుగు రాష్ట్రాలను గత పదేళ్లుగా ఊపేస్తోంది. ఒకరిని చూసి మరొకరు అప్పు చేసైనా సరే అమెరికా వెళ్లాలనే పట్టుదల పెరిగింది. ఊరికి ఇద్దరు లేదా ముగ్గురు అమెరికాలో ఉన్నారు. వెళ్లాలనుకునేవారు ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరంలో ఉండగానే జీఆర్‌ఈ, టోఫెల్‌ శిక్షణకు వెళ్తున్నారు. ఈ కారణంగానే హైదరాబాద్‌లో ఈ శిక్షణా సంస్థలు విపరీతంగా వెలిశాయి. అప్పులు ఇస్తామంటూ బ్యాంకులు ఉదారంగా ముందుకు వస్తున్నాయి. 2010కి ముందు ఏటా రూ. 1,500–2,000 కోట్ల మధ్య విద్యా రుణాలు ఇచ్చిన భారతీయ బ్యాంకులు... 2012 తరువాత రుణాలను 12 వేల కోట్లకు పెంచాయి. 

మోదీ అమెరికా పర్యటనలో అరుదైన దృశ్యం

హ్యూస్టన్: భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. వారం రోజులపాటు ఆయన అమెరికాలోనే పర్యటించనున్నారు. పర్యటనలో మొదటిరోజు ప్రధాని మోదీని కశ్మీరి పండిట్లు కలిశారు. ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు కశ్మీరి పండిట్లు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఓ కశ్మీరి పండిట్ మోదీకి లేఖ అందజేసి ప్రేమతో మోదీ చేతిని ముద్దాడారు. 

ప్రధాని మోదీకి హ్యూస్టన్‌లో ఘన స్వాగతం లభించింది. హ్యూస్టన్ ఎయిర్‌పోర్టులో మోదీకి స్వాగతం పలుకుతూ అమెరికా అధికారి అందించిన ఫ్లవర్ బొకేలోని ఓ పుష్పం కింద పడిపోయింది. దీన్ని గమనించిన మోదీ వెంటనే కిందకు వంగి ఆ పుష్పాన్ని తానే స్వయంగా తీసి సెక్యూరిటీ అధికారులకు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. కాగా,  ఆదివారం హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ ఫుట్‌బాల్ స్టేడియంలో జరగబోయే ‘హౌడీ మోడీ’ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. ఆయనతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ వేదికను పంచుకోనున్నారు. ఈ కార్యక్రమంలో 50 వేలకు పైగా ఎన్నారైలు హాజరుకానున్నారు.

హౌడీ-మోదీ సభలో స్టాండింగ్ ఒవేషన్

23-09-2019

హ్యూస్టన్‌: అమెరికా హ్యూస్టన్‌ హౌడీ-మోదీ సభలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్న ట్రంప్ ఉక్కు సంకల్పానికి మద్దతుగా సభకు హాజరైనవారంతా ఒక్కసారిగా నిలబడి చప్పట్లు కొట్టారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు సభకు హాజరైన ప్రవాస భారతీయులంతా నిలబడి ట్రంప్‌కు మద్దతుగా చప్పట్లు కొట్టారు.

భారత్‌ను అస్థిరం చేసేందుకు పొరుగుదేశం కుట్రలు పన్నుతోందని మోదీ పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. అమెరికాపై జరిగిన సెప్టంబర్ 11 దాడులు, ముంబైపై జరిగిన నవంబర్ 26 దాడులకు సూత్రధారులు పొరుగుదేశంలో ఉన్నారని మోదీ చెప్పారు.

అంతా బాగుందంటూ హ్యూస్టన్ సభలో తెలుగులో మాట్లాడిన మోదీ

22-09-2019

హ్యూస్టన్‌: అమెరికా హ్యూస్టన్‌ ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో హౌడీ-మోదీ సభకు ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభలో ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు. అంతా బాగుందని చెప్పారు. తెలుగుతో పాటు భారత్‌లోని అనేక భాషల్లో అంతా బాగుందన్నారు. తనకు అపూర్వ స్వాగతం లభించిందంటూ ఆయన హ్యూస్టన్‌ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్‌ పేరు తెలియని వారు ప్రపంచంలో ఎవరూ లేరంటూ ప్రతి 10 మంది సంభాషణలో ట్రంప్‌ ఉంటారని, వ్యాపారం నుంచి రాజకీయాల వరకు అన్నింట్లో ట్రంప్‌ చిరపరిచితులే అని మోదీ చెప్పారు. మరోసారి ట్రంప్‌ అధికారంలోకి రావాలని మోదీ ఆకాంక్షించారు.

ఆ తర్వాత మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామన్నారు. హౌడీ-మోదీ కార్యక్రమానికి వచ్చిన ట్రంప్‌‌కు ప్రధాని మోదీ, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. సభలో భారత్‌, అమెరికా దేశాల జాతీయ గీతాలు ఆలపించారు.

హౌడీ మోడీ : అమెరికా వేదికగా పాక్ ను టార్గెట్ చేసిన మోడీ

22, Sep 2019

హౌడీ మోడీ భారీగా సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ సమక్షంలో పేరెత్తకుండా పాకిస్తాన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

హౌడీ మోడీ అంటూ హ్యూస్టన్ అంతా మార్మోగుతోంది. ఇప్పటికే డోనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ద్వారా హ్యూస్టన్ చేరుకున్నాడు. భారత, అమెరికా సాంప్రదాయ నృత్య, కళా రూపాల ప్రదర్శనలతో, సమ్ప్రదాయ వాయిద్యాలతో వాయిస్తున్న సంగీతంతో హ్యూస్టన్ లోని ఎన్ ఆర్ జి స్టేడియం మార్మోగుతోంది.. కీర్తనతో ప్రారంభమైన హౌడీ మోడీ. 

ట్రంప్ ను భరత్ కు ఆహ్వానిస్తూ, థాంక్యూ అమెరికా, ఠంక్ యు హ్యూస్టన్ అంటూ ప్రసంగాన్ని ముగించాడు.  ఆ తర్వాత మోడీ, ట్రంప్ సంయుక్తంగా ప్రేక్షకులకు అభివాదం చేశారు.

అమెరికన్ పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరిచిన మోడీ. తగ్గించిన కార్పొరేట్ టాక్స్ వల్ల మరిన్ని కంపెనీలు పెట్టుబడులుపెట్టేందుకు ముందుకొస్తున్నాయని తెలిపారు. 

పాకిస్తాన్ పేరెత్తకుండా తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు. 

తీవ్రవాదంపై యుద్ధం ప్రకటించిన మోడీ. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ట్రంప్ చాల కృషి చేస్తున్నారంటూ కితాబిచ్చి స్టాండింగ్ ఓవషన్ ఇచ్చారు. 

అన్ని వర్గాలకు చెందిన ప్రజలను కలుపుకుపోతుంది సబ్ కే సాథ్ సబ్ కా విశ్వాస్- మోడీ 

ప్రజాస్వామ్యం, విభిన్నత భారతీయతకు చిహ్నాలు-మోడీ 

హౌడీ మోడీ కి సమాధానమిస్తూ.. భారత్ లో అందరూ బాగున్నారు అనితెలుగుతో సహా  వివిధ భాషల్లో చెప్పిన ప్రధాని మోడీ 

ప్రారంభమైన మోడీ ప్రసంగం. హిందీలో ప్రసంగం ఆరంభించిన మోడీ. 

అక్రమ వలసదారులకు మాత్రమే తాను వ్యతిరేకమని, లీగల్ గా వచ్చిన భారతీయులకు  పూర్తి సహకారం, వారి భద్రత, రక్షణ అన్ని అమెరికా బాధ్యత- ట్రంప్. 

త్రివిధ దళాల ఎక్సర్ సైజ్ ప్రారంభం. టైగర్ ట్రియంఫ్ గా నామకరణం. 

సౌదీ చమురుకేంద్రాలపై డ్రోన్ దాడులు: అమెరికా చమురును భూగర్భంలో ఎందుకు దాచిపెడుతోంది?

సౌదీ అరేబియాలోని కీలకమైన చమురు నిల్వలపై దాడుల నేపథ్యంలో, అమెరికా అధికారులు తమ దేశంలో నిల్వచేసిన అత్యవసర చమురు నిల్వల గురించి చర్చించుకుంటున్నారు.


చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ''మార్కెట్‌లో సరఫరాకు ఈ చమురును ఉపయోగించవచ్చు'' అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

టెక్సాస్, లూసియానా రాష్ట్రాలలోని ఉప్పు గుహలలో నిల్వ చేసిన 640 మిలియన్ బారెల్స్ కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న నిల్వల గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ ఈ ట్వీట్ చేశారు.

అయితే, అమెరికాకు ఈ ''వ్యూహాత్మక నిల్వలను'' కలిగి ఉండాలనే ఆలోచన 1970లలో వచ్చింది.

ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలోని సభ్య దేశాలు 90 రోజులకు సరిపడా అత్యవసర పెట్రోలియం దిగుమతులు నిల్వ ఉంచుకోవచ్చు. కానీ, అమెరికా ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో అత్యవసర నిల్వలు కలిగి ఉంది.


Image copyrightGETTY IMAGESచిత్రం శీర్షిక1973‌లో అరబ్ దేశాలు-ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో అమెరికా.. ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చింది. దీంతో పెట్రోలియం ఎగుమతి దేశాలు ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాలు అమెరికాకు చమురు ఎగుమతి చేయడానికి నిరాకరించాయి.

ఎందుకు ఈ నిల్వలు ఉంచారు?

1970లలో చమురు సరఫరాపై మధ్యప్రాచ్య దేశాలు ఆంక్షలు విధించాక ప్రపంచవ్యాప్తంగా ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో అమెరికా రాజకీయ నాయకులు చమురును నిల్వ చేయాలనే ఆలోచనకు వచ్చారు.

1973‌లో అరబ్ దేశాలు-ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చింది. దీంతో పెట్రోలియం ఎగుమతి దేశాలు ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాలు అమెరికాకు చమురు ఎగుమతి చేయడానికి నిరాకరించాయి.

యుద్ధం మూడు వారాలు మాత్రమే కొనసాగింది. కానీ, ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకున్న అరబ్ దేశాలు 1974 మార్చి వరకు ఈ ఆంక్షలు కొనసాగించాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ధరలు నాలుగు రెట్లు పెరిగి బ్యారెల్ దాదాపు 12 డాలర్లకు చేరింది.

ప్రభావిత దేశాలలో పెట్రోల్ పంపుల వద్ద బారులు తీరిన కార్లను చూస్తే సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

చమురు సరఫరా సమస్య వచ్చినప్పుడు వ్యూహాత్మకంగా పెట్రోలియం రిజర్వ్‌ను ఏర్పాటు చేసేలా అమెరికా కాంగ్రెస్ 1975లో ఎనర్జీ పాలసీ అండ్ కన్జర్వేషన్ యాక్ట్‌ను ఆమోదించింది.


నిల్వలు ఎక్కడున్నాయి?

ప్రస్తుతం, అమెరికాలో నాలుగు చోట్ల చమురు నిల్వ చేస్తున్నారు. అవి టెక్సాస్‌లోని ఫ్రీపోర్ట్, విన్నీ సమీపంలో, లూసియానాలోని చార్లెస్ సరస్సు, బాటన్ రూజ్ వెలుపల.

ప్రతి ప్రాంతంలో చమురు నిల్వ చేసేందుకు వీలుగా భూగర్భంలో ఒక కిలోమీటర్ (3,300 అడుగుల) వరకు అనేక మానవ నిర్మిత ఉప్పు గుహలు ఏర్పాటు చేశారు.

భూమిపై ట్యాంకులలో నిల్వ చేయడంకంటే ఇలా చేయడం వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది. సురక్షితంగా కూడా ఉంటుంది. ఉప్పు వల్ల భౌగోళిక పీడన ప్రభావంతో చమురు బయటకు రాకుండా నిరోధించవచ్చు.

ఫ్రీపోర్ట్ సమీపంలోని బ్రయాన్ మౌండ్ వద్ద అతిపెద్ద స్థలంలో 254 మిలియన్ బారెల్స్ చమురును నిల్వ చేసేందుకు వీలుంది.

ఈ గుహలలో సెప్టెంబర్ 13న 644.8 మిలియన్ బారెల్స్ చమురు ఉన్నట్లు రిజర్వ్ వెబ్‌సైట్ తెలిపింది. యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, అమెరికన్లు 2018లో సగటున రోజుకు 20.5 మిలియన్ బారెల్స్ పెట్రోలియంను వినియోగించారు. అంటే సుమారు 31 రోజుల పాటు దేశ అవసరాలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని అర్థం.


ఇది ఎలా పని చేస్తుంది?

జెరాల్డ్ ఫోర్డ్ సంతకం చేసిన 1975 చట్టం ప్రకారం, ''తీవ్రమైన ఇంధన సరఫరా అంతరాయం'' ఉంటే చమురు నిల్వలను విడుదల చేయడానికి అధ్యక్షుడికి అధికారం ఉంటుంది.

కానీ, ప్రతిరోజూ గుహల నుంచి కొద్ది మొత్తంలో చమురును మాత్రమే తరలించవచ్చు. చమురును విడుదల చేయడానికి అధ్యక్షుడికి అధికారం ఉన్నప్పటికీ మార్కెట్లలోకి చమురు రావడానికి దాదాపు రెండు వారాలు పడుతుంది.

అంతేకాక, ఇలా విడుదల చేసిన చమురు శుద్ధి చేసినదికాదు. కార్లు, ఓడలు, విమానాలకు ఉపయోగపడే ముందు ఈ చమురును ఇంధనంగా మార్చే ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది.

సౌదీ అరేబియాలో దాడుల నేపథ్యంలో తమ నిల్వల గురించి మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుందని అమెరికా ఇంధన కార్యదర్శి రిక్ పెర్రీ సెప్టెంబర్ 16న సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.


ఈ నిల్వలను ఉపయోగించారా?

2011లో చివరిసారిగా ఈ 'అత్యవసర నిల్వ చుమురు'ను అమ్మారు. అరబ్ విప్లవం నేపథ్యంలో చమురు సరఫరా దేశాల నుంచి ఇంధన సరఫరాకు అంతరాయం కలగడంతో అమెరికా తన దగ్గర ఉన్న 60 మిలియన్ బారెల్స్ చమురును విడుదల చేసింది.

అయితే, కొన్ని సందర్భాల్లో అమెరికా పెద్ద సంఖ్యలో చమురును విక్రయించింది. సీనియర్ బుష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1991 గల్ఫ్ యుద్ధం సమయంలో నిల్వ చేసిన చుమురును ఉపయోగించటానికి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత జూనియర్ బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కత్రినా తుపాన్ నేపథ్యంలో 11 మిలియన్ బారెల్స్ చమురును అమ్మేందుకు అనుమతించారు.

అయితే, అమెరికాలో ఇంధన ఉత్పత్తి పెరుగుతున్న సమయంలో ఇంత భారీ స్థాయిలో చమురును నిల్వ చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి.

అధ్యక్షుడు బిల్ క్లింటన్ హయాంలో ఆర్థిక లోటును తగ్గించే చర్యల్లో భాగంగా 1997లో 28 మిలియన్ బారెల్స్ చమురును అమ్మేశారు.

భారత్, అమెరికా ప్రజలను తీవ్రవాదుల నుంచి కాపాడుకుంటాం "

అమెరికాలోని హూస్టన్‌లో నిర్వహిస్తున్న 'హౌడీ మోదీ' కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్‌ఆర్‌జీ స్టేడియంకు చేరుకున్న భారత ప్రధాని మోదీకి నిర్వాహకులు, టెక్సస్ ప్రభుత్వ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.


కొద్దిసేపటి కిందట అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా సభా వేదిక వద్దకు చేరుకున్నారు.

సభనుద్దేశించిన మాట్లాడిన మోదీ ‘‘మిస్టర్ ట్రంప్ మీరు 2017లో మీ కుటుంబాన్ని నాకు పరిచయం చేశారు. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తున్నాను’’ అనగానే సభకు హాజరైనవారంతా పెద్ద పెట్టున చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

ఈ సభతో భారత్, అమెరికాల మైత్రి శిఖర స్థాయికి చేరిందని మోదీ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ గెలవడం ఖాయమని ఆయన అన్నారు.

రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలపడుతుందని, ట్రంప్‌ను కలిసిన ప్రతిసారీ తనకు స్నేహ హస్తాన్ని అందించారని మోదీ అన్నారు.

మోదీ పిలిస్తే ముంబయి వస్తాను: ట్రంప్

ట్రంప్ మాట్లాడుతూ తనను ఈ సభకు పిలిచినందుకు సంతోషంగా ఉందని, ఈ చరిత్రాత్మక సభకు రావడం తన అదృష్టమన్నారు.

మోదీ నాయకత్వంలో భారత్‌లో 30 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చారని.. అది అపూర్వమని ట్రంప్ అన్నారు.

‘‘అమెరికా, భారత్ స్నేహ బంధానికి ఈ సమావేశం నిదర్శనం, దీనికి 50 వేలమంది హాజరుకావడం స్ఫూర్తిదాయకం’’ అన్నారాయన.

వచ్చే నెలలో భారత్‌లోని ముంబయిలో మొట్టమొదటి ఎన్‌బీఏ బాస్కెట్ బాల్ మ్యాచ్ జరగబోతోందని.. మోదీ ఆహ్వానిస్తే తాను వచ్చే అవకాశముందన్నారు.

అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్ర కీలకమని ప్రస్తుతించారు. భారత్, అమెరికా పౌరులను ’ఉగ్రవాదం’ నుంచి కాపాడుకుంటామని ట్రంప్ చెప్పారు.

అంతకుముందు.. ఈ కార్యక్రమంలో మిత్రుడు మోదీతో పాటు వేదికను పంచుకోనున్నానని ట్రంప్ ట్వీట్ చేయగా.. మోదీ దానికి స్పందనగా, మీ రాక కోసం ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు

హౌడీ మోదీ ఈవెంట్'.. ఒకే వేదికపై ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్

23Sep 2019, 12:05 AM

టెక్సాస్‌లో 'హౌడీ మోదీ' కార్యక్రమంతో సందడి వాతావరణం. కార్యక్రమం జరుగుతున్న ఎన్‌ఆర్‌జీ ఫుట్‌బాల్‌ స్టేడియంలో కోలాహలం.. భారీగా తరలి వచ్చిన భారతీయులు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. వినూత్నంగా ఈసారి టెక్సాస్ రాష్ట్రంలో ‘హౌడీ మోదీ’ పేరుతో భారీ సభను నిర్వహిస్తున్నారు. హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ సభకు దాదాపు 50 వేల మంది హాజరయ్యారు. టెక్సాస్ ప్రజలు, అక్కడి భారతీయ అమెరికన్లు ప్రధాని మోదీని హౌ డూ యూ డూ మోదీ అని పలకరించారు. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తొలిసారి ఒకే వేదికపైకి వచ్చారు.


. మోదీ, ట్రంప్ తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. భారత్-అమెరికా స్నేహ బంధాన్ని చాటిచెప్పారు. రాబోయే రోజుల్లో కలిసి ముందుకు సాగుతామన్నారు. హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ ఫుట్‌బాల్‌ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్‌ఆర్‌ఐలు భారీగా తరలి వచ్చారు. అమెరికాలోని 50 రాష్ట్రాలకు చెందిన సెనేటర్లు, గవర్నర్లు, మేయర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
హౌడీ మోదీ కార్యక్రమంలో తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. గుడ్ మార్నింగ్ అంటూ ప్రసంగం మొదలు భారత ప్రధాని.. ‘మనతో ఓ గొప్ప వ్యక్తి ఉన్నారు.. ఆయనకు పరిచయం అక్కర్లేదు.. ఆయన పేరు ఈ ప్రపంచంలో ఉన్న అందరికి సుపరిచితమే.. హ్యూస్టన్‌లో నాకు అపూర్వ స్వాగతం లభించింది’ అన్నారు. ట్రంప్ ఎంత శక్తి వంతుడో ఈ ప్రపంచానికి తెలుసన్నారు. భారత్-అమెరికా ఆప్తులు.. ట్రంప్ అమెరికా ఎకానమీని పటిష్టం చేశారన్నారు. అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ నినాదాన్ని మోదీ వినిపించారు. ట్రంప్‌ను కలిసిన ప్రతిసారీ స్నేహ హస్తాన్ని అందించారని.. ట్రంప్‌ను మొదటి సారి కలిసినప్పుడే భారత్ నిజమైన స్నేహితుడు అని ట్రంప్ తనతో చెప్పారన్నారు.

రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలపేతం అవుతుందని.. ట్రంప్ అధ్యక్షుడు కావడం అమెరికా ప్రజల అష్టమన్నారు. అమెరికా భారత్ గొప్ప ప్రజాస్వామ్య దేశాలని.. ప్రజలకు కూడా అమెరికాతో బలమైన బంధం ఉందన్నారు. ‘హ్యూస్టన్ టు హైదరాబాద్.. బోస్టన్ టూ బెంగళూరు.. చికాగో టు సిమ్లా..లాస్ ఏంజెల్స్ టు లుథియానా.. న్యూ జెర్సీ టు న్యూ ఢిల్లీ.. ఇలా ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంది’ అన్నారు. ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ విజయం సాధిస్తారని.. దీపావళితో పాటూ గెలుపు సంబరాలు చేసుకోవాలని ఆకాంక్షించారు.

భారతీయుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగం

* అమెరికా, భారత్ ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని తరిమికొడతాం
* ఉగ్రవాదం అంతం మా పంతం
* ఉగ్రవాదం అంతానికి ట్రంప్ మద్దతు ఇవ్వడం సంతోషం
* ఉభయ సభల్లోనూ ఆర్టికల్ 370పై గంటల తరబడి చర్చ జరిగింది
* ఎగువ సభలో బలం లేకున్నా బిల్లుకు మద్దతు లభించింది
* ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ కల్పించాం
* రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ కాశ్మీర్ ప్రజలకు వర్తిస్తాయి
* ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావించిన ప్రధాని
* 60 ఏళ్ల తర్వాత భారత్‌లో బలమైన ప్రభుత్వం ఏర్పడింది
* ఐదేళ్ల పాలన తర్వాత మరింత శక్తివంతమైంది
* డేటా వినియోగంలో భారత్ ప్రపంచంలోనే ముందంజలో ఉంది