23Sep 2019, 12:05 AM
టెక్సాస్‌లో 'హౌడీ మోదీ' కార్యక్రమంతో సందడి వాతావరణం. కార్యక్రమం జరుగుతున్న ఎన్‌ఆర్‌జీ ఫుట్‌బాల్ స్టేడియంలో కోలాహలం.. భారీగా తరలి వచ్చిన భారతీయులు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. వినూత్నంగా ఈసారి టెక్సాస్ రాష్ట్రంలో ‘హౌడీ మోదీ’ పేరుతో భారీ సభను నిర్వహిస్తున్నారు. హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ సభకు దాదాపు 50 వేల మంది హాజరయ్యారు. టెక్సాస్ ప్రజలు, అక్కడి భారతీయ అమెరికన్లు ప్రధాని మోదీని హౌ డూ యూ డూ మోదీ అని పలకరించారు. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలిసారి ఒకే వేదికపైకి వచ్చారు.
. మోదీ, ట్రంప్ తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. భారత్-అమెరికా స్నేహ బంధాన్ని చాటిచెప్పారు. రాబోయే రోజుల్లో కలిసి ముందుకు సాగుతామన్నారు. హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ ఫుట్‌బాల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్‌ఆర్‌ఐలు భారీగా తరలి వచ్చారు. అమెరికాలోని 50 రాష్ట్రాలకు చెందిన సెనేటర్లు, గవర్నర్లు, మేయర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
హౌడీ మోదీ కార్యక్రమంలో తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. గుడ్ మార్నింగ్ అంటూ ప్రసంగం మొదలు భారత ప్రధాని.. ‘మనతో ఓ గొప్ప వ్యక్తి ఉన్నారు.. ఆయనకు పరిచయం అక్కర్లేదు.. ఆయన పేరు ఈ ప్రపంచంలో ఉన్న అందరికి సుపరిచితమే.. హ్యూస్టన్‌లో నాకు అపూర్వ స్వాగతం లభించింది’ అన్నారు. ట్రంప్ ఎంత శక్తి వంతుడో ఈ ప్రపంచానికి తెలుసన్నారు. భారత్-అమెరికా ఆప్తులు.. ట్రంప్ అమెరికా ఎకానమీని పటిష్టం చేశారన్నారు. అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ నినాదాన్ని మోదీ వినిపించారు. ట్రంప్‌ను కలిసిన ప్రతిసారీ స్నేహ హస్తాన్ని అందించారని.. ట్రంప్‌ను మొదటి సారి కలిసినప్పుడే భారత్ నిజమైన స్నేహితుడు అని ట్రంప్ తనతో చెప్పారన్నారు.
రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలపేతం అవుతుందని.. ట్రంప్ అధ్యక్షుడు కావడం అమెరికా ప్రజల అష్టమన్నారు. అమెరికా భారత్ గొప్ప ప్రజాస్వామ్య దేశాలని.. ప్రజలకు కూడా అమెరికాతో బలమైన బంధం ఉందన్నారు. ‘హ్యూస్టన్ టు హైదరాబాద్.. బోస్టన్ టూ బెంగళూరు.. చికాగో టు సిమ్లా..లాస్ ఏంజెల్స్ టు లుథియానా.. న్యూ జెర్సీ టు న్యూ ఢిల్లీ.. ఇలా ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంది’ అన్నారు. ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ విజయం సాధిస్తారని.. దీపావళితో పాటూ గెలుపు సంబరాలు చేసుకోవాలని ఆకాంక్షించారు.
భారతీయుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగం
* అమెరికా, భారత్ ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని తరిమికొడతాం
* ఉగ్రవాదం అంతం మా పంతం
* ఉగ్రవాదం అంతానికి ట్రంప్ మద్దతు ఇవ్వడం సంతోషం
* ఉభయ సభల్లోనూ ఆర్టికల్ 370పై గంటల తరబడి చర్చ జరిగింది
* ఎగువ సభలో బలం లేకున్నా బిల్లుకు మద్దతు లభించింది
* ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ కల్పించాం
* రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ కాశ్మీర్ ప్రజలకు వర్తిస్తాయి
* ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావించిన ప్రధాని
* 60 ఏళ్ల తర్వాత భారత్‌లో బలమైన ప్రభుత్వం ఏర్పడింది
* ఐదేళ్ల పాలన తర్వాత మరింత శక్తివంతమైంది
* డేటా వినియోగంలో భారత్ ప్రపంచంలోనే ముందంజలో ఉంది