Labels
‘తానా’ సభలకు 30 మంది రాజకీయ నేతలు
శాన్‌ఫ్రాన్సిస్కో: రాష్ట్ర రాజకీయ నాయకులకు రెడ్‌కార్పెట్ పరిచి సాదర స్వాగతం పలికేందుకు సిద్ధమైంది ‘తానా’ (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా).శాంతాక్లారాలో జులై 1 నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘తానా’ ద్వైవార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పలికింది. ఉభయ కమ్యునిస్టు పార్టీలకు చెందిన రాష్ట్ర కార్యదర్శులు బి.వి. రాఘవులు, కె. నారాయణ ఈ సదస్సుకి హాజరవుతున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు కోమటి జయరామ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే కేంద్ర మంత్రి పల్లంరాజు, రాష్ట్ర మంత్రులు గల్లా అరుణ, మోపిదేవి వెంకటరమణ, పితాని సత్యనారాయణ, తోట నరసింహం తదితర 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొంటారని తెలిపారు. వీరందరితో కలిసి ‘తానా’ రాజకీయ వేదిక నిర్వహిస్తామని వెల్లడించారు.
Labels:
22.06.11
No comments:
Post a Comment