Labels

నాట్స్ సంబరాలకు అందాల తారలు



న్యూజెర్సీ: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) సంబరాల్లో తారాలోకం తళుక్కున మెరవనుంది. అందాల తారలు ప్రియమణి, బిందుమాధవి, మధుశాలిని ఈ వేడుకల్లో వినోదం పంచేందుకు వేగిరమే విచ్చేస్తున్నారు. అమెరికా తెలుగు యువతను కనువిందు చేసేందుకు, ఆటపాటలకు అదనపు హంగులు తీర్చేందుకు తరలివస్తున్నారు. మరి వీరిని కలుసుకోవాలని ఉందా? వీరితో కరచాలనం చేసి, కులాసాగా కూర్చుని కాసిన్ని కబుర్లు చెప్పాలని ఉందా? అందాల తారలను ఏదైనా అడగాలని ఉందా? అయితే మీ కోసం ఓ అవకాశం ఎదురు చూస్తోంది. ప్రత్యేకించి ప్రయాసపడి పోటీల్లో పాల్గొనాల్సిన పనిలేదు. ‘నాట్స్’ సంబరాల్లో పాల్గొనేందుకు మీ పేరును నమోదు చేసుకుంటే చాలు!. జూన్ 25లోపు నమోదు చేసుకున్న వారిలో నుండి కొంతమందిని లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసి వారి కుటుంబం మొత్తాన్ని ఈ అందాల తారలతో విందారగించే అవకాశం కల్పిస్తారు. అదృష్టవంతుల వివరాలను నిర్వాహకులు తెలియజేస్తారు.న్యూజెర్సీలో జులై 1,2,3 తేదీల్లో ‘నాట్స్ సంబరాలు’ జరుగుతుండడం తెలిసిందే.

No comments:

Post a Comment