Labels

మోదీ అమెరికా పర్యటనలో అరుదైన దృశ్యం

హ్యూస్టన్: భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. వారం రోజులపాటు ఆయన అమెరికాలోనే పర్యటించనున్నారు. పర్యటనలో మొదటిరోజు ప్రధాని మోదీని కశ్మీరి పండిట్లు కలిశారు. ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు కశ్మీరి పండిట్లు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఓ కశ్మీరి పండిట్ మోదీకి లేఖ అందజేసి ప్రేమతో మోదీ చేతిని ముద్దాడారు. 

ప్రధాని మోదీకి హ్యూస్టన్‌లో ఘన స్వాగతం లభించింది. హ్యూస్టన్ ఎయిర్‌పోర్టులో మోదీకి స్వాగతం పలుకుతూ అమెరికా అధికారి అందించిన ఫ్లవర్ బొకేలోని ఓ పుష్పం కింద పడిపోయింది. దీన్ని గమనించిన మోదీ వెంటనే కిందకు వంగి ఆ పుష్పాన్ని తానే స్వయంగా తీసి సెక్యూరిటీ అధికారులకు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. కాగా,  ఆదివారం హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ ఫుట్‌బాల్ స్టేడియంలో జరగబోయే ‘హౌడీ మోడీ’ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. ఆయనతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ వేదికను పంచుకోనున్నారు. ఈ కార్యక్రమంలో 50 వేలకు పైగా ఎన్నారైలు హాజరుకానున్నారు.