Labels

అంతా బాగుందంటూ హ్యూస్టన్ సభలో తెలుగులో మాట్లాడిన మోదీ

22-09-2019

హ్యూస్టన్‌: అమెరికా హ్యూస్టన్‌ ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో హౌడీ-మోదీ సభకు ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభలో ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు. అంతా బాగుందని చెప్పారు. తెలుగుతో పాటు భారత్‌లోని అనేక భాషల్లో అంతా బాగుందన్నారు. తనకు అపూర్వ స్వాగతం లభించిందంటూ ఆయన హ్యూస్టన్‌ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్‌ పేరు తెలియని వారు ప్రపంచంలో ఎవరూ లేరంటూ ప్రతి 10 మంది సంభాషణలో ట్రంప్‌ ఉంటారని, వ్యాపారం నుంచి రాజకీయాల వరకు అన్నింట్లో ట్రంప్‌ చిరపరిచితులే అని మోదీ చెప్పారు. మరోసారి ట్రంప్‌ అధికారంలోకి రావాలని మోదీ ఆకాంక్షించారు.

ఆ తర్వాత మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామన్నారు. హౌడీ-మోదీ కార్యక్రమానికి వచ్చిన ట్రంప్‌‌కు ప్రధాని మోదీ, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. సభలో భారత్‌, అమెరికా దేశాల జాతీయ గీతాలు ఆలపించారు.