Labels

గల్ఫ్‌ వల.. యువత విలవిల

  29 Sep, 2019                   ఆశలపల్లకిలో కువైట్‌కు పంపుతున్న ఏజెంట్లు బానిసలుగా బతుకీడుస్తున్న నగరి, పుత్తూరు వాసులు  నానాతిప్పలు, జైలుశిక్షలు అనుభవిస్తున్న వైనం ఇండియన్‌ ఎంబసీ సాయంతో సొంత గ్రామాలకు గుర్తింపు లేని ఏజెంట్లపై చర్యలు చేపట్టని అధికారులు సాక్షి, నగరి: ఉపాధి కోసం కన్న ఊరిని వదలి వెళుతున్న యువత విదేశాల్లో నరకయాతన అనుభవిస్తోంది. అత్యధిక జీతం, ఉచిత వసతి, ఇతర ఆదాయం పేరిట ఏజెంట్ల వలలో చిక్కి అప్పుల ఊబిలో చిక్కుకుపోతోంది. స్థానికంగా రోజువారీ కూలి పనులు చేసుకుని సంతోషంగా జీవించే అవకాశం ఉన్నా.. ఆశలవలలో చిక్కుకుని అల్లాడుతోంది. రెండు మూడేళ్లు పనిచేస్తే రూ.లక్షలు సంపాదించవచ్చనే ఏజెంట్ల మాటలు నమ్మి అప్పు చేసి అరబ్‌ దేశాలకు వెళ్లి చిత్ర హింసలకు గురవుతోంది. జిల్లా యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులు తరచూ వెలుగులోకి వస్తున్నా అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవడం లేదు. నగరి, పుత్తూరు ఏజెంట్ల వలలో చిక్కి కువైట్, దుబాయ్‌కి వెళ్లి నానా తిప్పలుపడి, జైలు శిక్షలు అనుభవించి ఉత్త చేతులతో ఇటీవల స్వదేశానికి చేరుకుని పలువురు బోరున విలపిస్తున్నారు. తాజాగా  కలకడ మండలం తూర్పువడ్డిపల్లెకు చెందిన నాగేంద్ర కువైట్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన మృతదేహం బుధవారం రాత్రి స్వగ్రామానికి చేరుకుంది. ఇతను అక్కడ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఉద్యోగాల కోసం ఆరాటపడేవారు.. కుటుంబ పరిస్థితి దృష్ట్యా ఆదాయ మార్గాలు అన్వేషించే వారు.. పేదరికాన్ని జయించి అభివృద్ధి పథంలో నడవాలని ఆరాటపడేవారు కువైట్, దుబా య్‌లో ఉద్యోగాల పేరిట నగరి, పుత్తూరులోని ఏజెంట్లు విసిరే వలలో చిక్కుకుంటున్నారు. కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలిక ఊడిం దన్న చందాన కువైట్‌ ఉద్యోగాలకు వెళ్లేవారి పరిస్థితి మారింది. ఆదాయం ఎక్కువగా సంపాదించవచ్చని చేతిలో ఉన్న డబ్బుల్ని ఏజెంట్లకు అప్పజెప్పి కువైట్‌కు వెళ్లి నానా తిప్పలు పడి, జైలు శిక్షలు అనుభవించి ఉత్తచేతులతో స్వదేశాలకు చేరుకొని బోరున విలపిస్తున్నారు. తమలా ఎవ్వరూ మోసపోకూడదంటూ మొరపెట్టుకుంటున్నారు. ఏం చెయ్యాలో తెలియక పలువురు కువైట్‌లోనే ఇబ్బందిపడుతున్నారని, మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉందని వాపోయారు. నిరుద్యోగులకు ఆశచూపి మోసం చేసే నకిలీ ఏజెంట్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. మహిళలనైతే ఉచితంగానే తీసుకెళుతు న్నారు. వారికి ఏపనిలో తర్ఫీదులేకున్నా పంపిస్తున్నారు. బ్యూటీపార్లర్‌లో ఉద్యోగమని, జిమ్‌లో ఉద్యోగమని కువైట్‌కు తీసుకెళ్లి అక్కడ ఇంటి పనులకు వారిని వేలంలో విక్రయిస్తున్నారు. ఇంటిపనుల్లో వారికి యజమానులు నరకయాతన చూపుతున్నారు. కొందరు ధైర్యం చేసి బయటపడి మరో ప్రాంతంలో ఉద్యోగం వెతుక్కొని పోతుంటే, కొందరు తమ విధి అంటూ కష్టాలు అనుభవిస్తున్నారు. ఇటీవల కొందరు కువైట్‌ నుంచి ఎలాగో వచ్చేశారు. నరకం చూపెట్టారు నా పేరు వడివేలు. చింతలపట్టెడలో నివాసం. నాపై ఆధారపడి ఐదుగురు జీవిస్తున్నారు. కూలిపని చేసి కుటుంబాన్ని పోషించేవాడిని. పుత్తూరుకు చెందిన ఏజెంట్‌ తనకు తెలిసిన వారు కువైట్‌లో ఉన్నారని, అక్కడికి వెళితే నెలకు రూ.50 వేలు సంపాదించవచ్చని ఆశచూపాడు.  వీసా, మెడికల్‌ సర్టిఫికెట్‌కు రూ.2.5 లక్షలు అవుతుందన్నాడు. అన్నీ మేమే సిద్ధం చేస్తామని తెలిపాడు.  అప్పు చేసి డబ్బులు కట్టాను. పుత్తూరుఏజెంట్‌ నగరి ఏజెంట్‌ ద్వారా నన్ను చెన్నై ఎయిర్‌పోర్టుకు పంపాడు. అక్కడ నంచి కువైట్‌కు పంపారు. వీరికి సంబంధించిన కువైట్‌ ఏజెంట్‌ నన్ను పుత్తూరు ఏజెంట్‌ బంధువు నడిపే ఒక హోటల్‌లో పడేశాడు.  ఇక్కడే పనిచేయాలి అంటూ రెండు నెలలు పనిచేయించుకున్నారు. జీతం కోసం పోరు పెడితే రూ.20వేలు ఇచ్చారు. నెలకు యాభైవేలు ఇస్తామని చెప్పారుకదా అంటేæ నీ పాస్‌పోర్టు, వీసా మా దగ్గర ఉంది ఎక్కడికీ వెళ్లలేవుఅంటూ బెదిరించారు. పరిచయమైన తమిళనాడు వారి సహకారంతో తప్పించుకొన్నాను. ఇండియన్‌ ఎంబసీని సంప్రదించి, జైలులో కఠినమైన శిక్షలు అనుభవించి ఫైన్‌లు,ఫ్లైట్‌ చార్జీలు కట్టి భారతదేశానికి చేరుకున్నా.  నాలా ఎవ్వరూ బాధపడకూడదని నగరి, పుత్తూరు పోలీస్‌ స్టేషన్లతో పాటు  చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదుచేశా, స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు విన్నవించాను. 5 సంవత్సరాల్లో 150 మంది వెళ్లారు ఐదేళ్లలో నగరి, పుత్తూరు నుంచి కువైట్‌కు సుమారు 150 మంది వెళ్లారు. కొందరిని సూన్‌వీసాతో, మరికొందరిని ఖాదీ వీసాలతో పంపితే, పలువురిని విజిటింగ్‌ వీసాలతో పంపారు. వీరిలో పలువురు అక్కడ అవస్థలు పడుతున్నారు. ఎక్కువగా సంపాదించి కుటుంబానికి అన్ని సమకూర్చాలని కోరుకునే ఎందరో కుటుంబ యజమానులు ఇలా విష వలయంలో చిక్కుకుంటున్నారు. నీచమైన పదజాలం వాడుతూ పనిచేయిస్తున్నారు. భార్యాపిల్లలను చూస్తామన్నా నమ్మకం కూడా లేనివారు అక్కడ పరిచయమయ్యే భారతీయుల సలహాల మేరకు ఇండియన్‌ ఎంబసీని సంప్రదించి, శిక్షలు అనుభవించి అవుట్‌పాస్‌తో స్వదేశానికి చేరుకుంటున్నారు. తమలా ఎవ్వరూ మోసపోకూడదంటూ మొరపెట్టుకుంటున్నారు. ఏం చెయ్యాలో తెలియక పలువురు కువైట్‌లోనే ఇబ్బందిపడుతున్నారని, మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, నిరుద్యోగులకు ఆశచూపి మోసంచేసే నకిలీ ఏజెంట్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం అంటూ ఇంటి పనికి పెట్టారు  కుటుంబ పోషణకోసం బ్యూటీ పార్లర్‌ నడుపుతుండేదాన్ని. నగరికి చెందిన ఒక ఏజెంట్‌ కువైట్‌లో బ్యూటీ పార్లర్‌లో జీతం ఎక్కువగా వస్తుందని, ఇక్కడచేసే పనే అక్కడా  ఉం టుందన్నాడు. అక్కడి నుంచే వీసా పంపుతారు వెళ్లి రావచ్చని నమ్మబలికాడు. కుటుంబ కష్టాలు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగానికి వెళ్లాను. నాలా పలువురు అక్కడకు వచ్చి ఉన్నారు. కువైట్‌లో మమ్మల్ని రిసీవ్‌ చేసుకున్న ఏజెంట్‌ ఇంటి పనులకంటూ వేలంలో కాంట్రాక్టుపై నన్ను విక్రయించాడు. వారు నన్ను చిత్రహింసలు పెట్టారు. జ్వరంతో ఉన్నా పనిచేయాల్సిందే.. లేకుంటే కొట్టేవారు. నన్ను విడిచిపెట్టండి నేను వెళ్లిపోతాను అంటే చంపేస్తామని భయపెట్టేవారు. అక్కడ పరిచయమైన భారతీయుల ద్వారా పనిచేస్తున్న చోటి నుంచి ఎలాగోలా బయటపడి మరో ప్రాంతంలో పనిలో చేరాను. కుటుంబాన్ని కాపాడుతుందని తల్లిదండ్రులు ఆశ నెరవేర్చేందుకు కువైట్‌లోనే పనిచేస్తున్నాను. – బాధిత మహిళ, నగరి నిద్రపోతే కొట్టారు.. కువైట్‌లో ఇంటి పని ఉంది, జీతం ఎక్కువగా ఇస్తారంటూ నన్ను పంపించారు. అక్కడికి తీసుకెళ్లిన రెండేళ్లకు అగ్రిమెంట్‌ అంటూ ఒక ఇంటిలో పనికిపెట్టారు. వారు  చిత్రహింసలు పెట్టారు. జ్వరం వచ్చి నిద్రపోయినా కొయ్యతో కొట్టేవారు. అగ్రిమెంటు ముగిసేంతవరకు జీతం ఇవ్వలేదు. మళ్లీ కూడా సగం డబ్బులు మాత్రమే ఇచ్చారు. అవస్థలు పడి ఇండియాకు చేరుకున్నాను. ప్రస్తుతం తమిళనాడులో వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాను. – బాధిత మహిళ, నగరి కష్టాలకు కేరాఫ్‌ కువైట్‌ కష్టాలు తీరుతాయని కువైట్‌కు వెళితే.. అది కష్టాలకు కేరాఫ్‌గా ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళితే సంతలో పశువుల్లా వేలంలో వేసి అగ్రిమెంట్‌ రాయించుకుంటారు. ఆ ఇళ్లలో వారు మాట్లాడే భాష మనకు అర్థమై ఆ పనిచేసేలోపు కొడతారు. మహిళ అన్న గౌరవం ఏ కోశానా∙ఉండదు. మన ఆరోగ్యంపై వారికి శ్రద్ధ ఉండదు. ఏ పరిస్థితిలో ఉన్నా పనిచేసి తీరాల్సిందే. అమాయకులు నకిలీ ఏజెంట్ల కారణంగా మోసపోతున్నారు. అలాంటివారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – బాధిత మహిళ, నగరి

గడువు దాటిన సిలిండర్లతో పొంచి ఉన్న ముప్పు

29 Sep, 2019 నిడమర్రు: వంట గ్యాస్‌ (ఎల్‌పీజీ)తో వంట చేసుకోవడం ఎంత సులువో సరైన జాగ్రత్తలు పాటించకపోతే అంతే ప్రమాదం పొంచి ఉంటుంది. మీ డీలర్‌ çసరఫరా చేసిన వంటగ్యాస్‌ సిలిండర్‌కు ఎక్స్‌పయిరీ తేదీ ఉంటుంది. ఎక్స్‌పయిరీ తేదీ అంటే ఆ సిలిండర్‌ వినియోగించడానికి గడువు పూర్తయిందని సూచన.  గడువు దాటిన తర్వాత  మీ ఇంటికి చేరే సిలిండర్లలో లీకేజీలు ఏర్పడవచ్చు, ప్రమాదం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  వంట గ్యాస్‌ సిలిండర్‌ను ఫిల్లింగ్‌ చేసే మయంలో నిబంధనలు ఏమిటి..?, సిలిండర్‌ గడువు తీరిందని ఎలా గుర్తించాలి.. తదితర సమాచారం తెలుసుకుందాం.. సిలిండర్‌కు 10 ఏళ్ల గడువు చట్టప్రకారం  వంట గ్యాస్‌ (ఎల్పీజీ )సిలిండర్‌ అన్ని భద్రతా ప్రమాణాల  పరీక్షలు పూర్తి చేసుకున్న కొత్త సిలిండర్‌ గడువు 10 ఏళ్ల వరకూ ఉంటుంది. సిలిండర్‌ తయారీలో ప్రత్యేకమైన ఉక్కుతోనూ,  సిలిండర్‌ లోపల సురక్షితమైన కోటింగ్‌తో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాన్‌డర్డ్స్‌ (బీఐఎస్‌) ప్రమాణాల మేరకు తయారు చేస్తుంటారు. చీఫ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్స్‌ ప్లోజిన్స్, బీఐఎస్‌ అనుమతులు తప్పని సరిగా తీసుకున్నాకే సిలిండర్‌ అందుబాటులోకి వస్తుంది. ఒకసారి లోపాలు కనిపించిన వాటిని సరిచేసి బీఐఎస్‌ ధ్రువీకరణ తీసుకున్న సిలిండర్‌లో మరోసారి పరీక్షల సమయంలో లోపాలు కనిపిస్తే తక్షణం దాన్ని తుక్కు కింద పక్కన పెట్టాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ దానిలో గ్యాస్‌ నింపకూడదు. గడువు తేదీఎలా తెలుసుకోవాలి..? ఫలానా సంవత్సరం, ఫలానా నెలలో సిలిండర్‌ పరీక్షలకు వెళ్లాల్సి ఉందన్న సంకేతాన్ని సిలిండర్‌పై గుర్తించడం చాలా సులభం. సిలిండర్‌పై ఉన్న మెటల్‌ ప్లేట్లలో ఒకదానిపై లోపలివైపు ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు మీ ఇంట్లో సిలిండర్‌పై ఏ17 అని ఉందనుకోండి అదే ఎక్స్‌పయిరీ తేదీ అని గుర్తించాలి. 19 అంకె 2019 సంవత్సరాన్ని, అంగ్ల అక్షరం –ఎ మొదటి త్రైమాసికం అని అర్థం. అంటే 2019 మార్చిలోపు ఈ సిలిండర్‌ గడువు తేదీ ముగుస్తుంది. నెలను ఇలా గుర్తించాలి. ఎ– ( జనవరి నుంచి మార్చి) బి– (ఏప్రిల్‌ నుంచి జూన్‌) సి– (జులై నుంచి డిసెంబర్‌) మూడు నెలల గ్రేస్‌ పిరియడ్‌ ప్రతీ సిలిండర్‌పై ఉన్న గడువు తర్వాత మరో మూడు నెలలు గ్రేస్‌ పిరియడ్‌ ఉంటుంది. అంటే వినియోగదారుని దగ్గరకు వెళ్లిన సిలిండర్‌ తిరిగి  డీలర్‌ వద్దకు చేరి అక్కడి నుంచి గ్యాస్‌ రీఫిల్లింగ్‌ స్టేషన్‌కు చేరుకునేందుకు వీలుగా ఈ గ్రేస్‌ పీరియడ్‌. అంతేగానీ కస్టమర్‌ వాడుకునేందుకుకాదు. అంటే ఏ–2019 గడువుతో ఉన్న సిలిండర్‌ను మార్చి నెల తర్వాత గ్యాస్‌ డీలర్‌ మీకు పంపిస్తే ఎట్టి పరిస్థితిల్లోనూ దీన్ని తీసుకోవద్దు. మరో సిలిండర్‌ కోరే  హక్కు వినియోగదారుడికి ఉంది.  కొంత మంది డీలర్లు గడువు తేదీని పెయింట్‌తో మార్చుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. వాటిని గమనించాలి. వినియోగదారుడి హక్కులు ♦ గ్యాస్‌ కనెక్షన్‌ కలిగిన వినియోగదారుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యుల పేరిట ఆకనెక్షన్‌ను మార్చుకోవచ్చు. ♦ బుక్‌ చేసిన ఏడు పనిదినాల్లోపు సిలిండర్‌ను కస్టమర్‌కు అందివ్వాలి ♦ కొత్త కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే అదే రోజు కనెక్షన్‌ జారీ చేయాలి. ♦ కొత్తగా కనెక్షన్‌ తీసుకునే సమయంలో డీలర్‌ స్టవ్‌ను కూడా తీసుకోవమని అడుగుతుంటాడు. కానీ నిబంధనల ప్రకారం డీలర్‌ దగ్గరే స్టవ్‌ తీసుకోవాల్సిన అవసరంలేదు. ♦ వంటగ్యాస్‌ను వాహనాల కోసం వినియోగించడం చట్టరీత్యానేరం. దీనికి బదులు ఆటోగ్యాస్‌ కోనుగోలు చేసి వాడుకోవాలి.

తెలుగు ఇంజనీర్‌పై పాకిస్థాన్‌ కుట్ర.. అల్‌ కాయిదాకు నిధులిస్తున్నాడని ఆరోపణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అంతర్జాతీయ వేదికపై భారత్‌ను అప్రతిష్ఠ పాలు చేయడానికి పాక్‌ కుట్ర పన్నింది. కుల్‌భూషణ్‌ జాధవ్‌ తరహాలోనే మరో వ్యక్తిని ఉగ్రవాదిగా చిత్రించే ప్రయత్నం చేసింది. అఫ్గానిస్థాన్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న తెలుగు ఇంజనీర్‌ వేణుమాధవ్‌ అల్‌ కాయిదాకు నిధులు ఇస్తున్నాడని ఆరోపించింది. 2015లో పెషావర్‌ ఎయిర్‌‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో అతని ప్రమేయం ఉందని పేర్కొంది. దీనికోసం తప్పుడు సాక్ష్యాలు, ఫొటోలు సృష్టించింది.  కుల్‌భూషణ్‌ను ఇరాన్‌లో పట్టుకొన్నట్లుగానే.. వేణుమాధవ్‌ను అరెస్టు చేసి అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాదిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. వేణుమాధవ్‌ తారిక్‌ గిదార్‌ ఉగ్రసంస్థకు ఆయుధాలు సమకూర్చాడని మార్చి 11న అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. అంతర్జాతీయ భద్రతా మండలి 1267 ఆంక్షల కమిటీలో అతని పేరును చైనా సహాయంతో లిస్టింగ్‌ కూడా చేసింది.అయితే పాక్‌ కుట్రను భారత్‌ అధికారులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. భారత భద్ర తా దళాలు వేణుమాధవ్‌ను సెప్టెంబరు 7నే ఇండియాకు రప్పించాయి.

ఐఏసీసీ ఏపీ, తెలంగాణ చైర్మన్‌గా శ్రీకాంత్‌ బాడిగ ఏకగ్రీవం

  హైదరాబాద్‌: ఇండో అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(ఐఏసీసీ), ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ చాప్టర్‌ (ఐఏసీసీ ఏపీ, టీఎస్‌) చైర్మన్‌గా ఫోనిక్స్‌ గ్రూప్‌ అధిపతి శ్రీకాంత్‌ బాడిగ ఎన్నికయ్యారు. వరుసగా ఆయన ఈ పదవికి ఎన్నిక కావడం ఇది మూడోసారి. 2019-20కి ఏకగ్రీవంగా శ్రీకాంత్‌ ఎన్నికైనట్లు ఐఏసీసీ వెల్లడించింది. మొద టి వైస్‌ చైర్మన్‌గా విజయ సాయి మేకా, రెండో వైస్‌ చైర్మన్‌గా రామ్‌కుమార్‌ రుద్రభట్ల ఎన్నికయ్యారు

ఏటీఎంలలో ఉత్తర కొరియా మాల్‌వేర్‌!

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: భారతీయ బ్యాంకుల ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని ఉత్తర కొరియా ఓ శక్తిమంతమైన మాల్‌వేర్‌ను తయారు చేసింది. ఆ దేశ నిఘా సంస్థ రికానిసెన్స్‌ జనరల్‌ బ్యూరోకు చెందిన లాజరస్‌ గ్రూప్‌ ఈ మాల్‌వేర్‌ను రూపొందించిందని దిగ్గజ యాంటీవైరస్‌ సంస్థ కాస్పర్‌స్కై వెల్లడించింది. రిమోట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ టూల్‌ (ర్యాట్‌)గా పనిచేసే ‘ఏటీఎండీట్రాక్‌’ అనే ఆ మాల్‌వేర్‌ బ్యాంకుల సర్వర్లలో, ఏటీఎంలలో చొరబడితే.. వినియోగదారుల కార్డుల వివరాలన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తాయని పేర్కొంది.

విమాన ప్రయాణికుల కోసం.. జపాన్‌ ఎయిర్‌ లైన్స్‌ సరికొత్త ఫీచర్‌

టోక్యో: మనం విమాన ప్రయాణం చేస్తునప్పుడు చాలా విషయాలు మనకు చిరాకు తెప్పిస్తుంటాయి. నచ్చని సీటు, పక్క సీట్లో వ్యక్తి గురక పెట్టడం, పక్క సీట్లో ఏడ్చే పిల్లలు ఇలా చాలా సమస్యలుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల ఏడుపు ఒక్కొసారి మనకు తలనొప్పి తెప్పిస్తుంటుంది. విమాన ప్రయాణికుల్లో చాలా మంది దీన్ని అస్సలు తట్టుకోలేరు కూడా. అలాంటి వారి కోసమే జపాన్‌ ఎయిర్‌ లైన్స్‌ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. టిక్కెట్ రిజర్వేషన్‌ బుకింగ్‌లో ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. టిక్కెట్‌ బుకింగ్‌ సమయంలో రెండేళ్లలోపు పిల్లలు ఏ వరుసలో, ఏ సీటులో కూర్చున్నారో తెలియజేస్తూ బేబీ బొమ్మతో ఉన్న ఐకాన్‌ కనిపిస్తుంది. దాంతో ఆ సీటును వదిలేసి మిగతా వాటిలో ఖాళీగా ఉన్న సీటును ముందుగానే మనం బుక్‌చేసుకోవచ్చు. దీని కోసం ‘సీట్‌ అరెంజ్‌మెంట్‌’ చార్ట్‌‌ను ఉపయోగించుకోవాలి. అలాగే ఎనిమిది రోజుల పసివాళ్ల నుంచి రెండేళ్లలోపు పిల్లలను తీసుకొచ్చే ప్రయాణికులు కూడా ‘బేబీ ఐకాన్‌’ చూపిన సీటునే ముందుగా బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందట. ఇక ఈ ఫీచర్ పిల్లలు లేనివారికి సౌరక్యవంతంగానే ఉన్నా... పిల్లలను తీసుకొచ్చే వారికి మాత్రం కొంచెం తలనొప్పి వ్యవహారమనే చెప్పాలి. 

విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్య ప్రవర్తన.. ఎన్నారైకి నాలుగు నెలల జైలు

సింగపూర్: విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఎన్నారైకి సింగపూర్ న్యాయస్థానం శుక్రవారం నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. వినయన్ మాథన్ అనే వ్యక్తి నవంబర్ 2, 2017లో కొచ్చి నుంచి సింగపూర్ వెళ్తున్న విమానంలో ప్రయాణించాడు. ఆ సమయంలో 22 ఏళ్ల ఎయిర్ హోస్టెస్‌తో మాథన్ అసభ్యంగా ప్రవర్తించాడు. కావాలనే కాల్ లైట్ బటన్‌ను మళ్లీ మళ్లీ నొక్కి ఆమెను పిలవడం చేశాడు. అప్పటికే ఆమె ఇలా చేయకండి సార్ అని వారించే ప్రయత్నం చేసింది. కాని ఎయిర్ హోస్టెస్‌ మాటలను పెడచెవిన పెట్టిన అతడు నీవు చాలా అందంగా ఉన్నావంటూ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని దగ్గరకు లాక్కున్నాడు. అతడి చర్య ఆమెకు కష్టంగా ఉన్న, అసహ్యంగా అనిపిస్తున్న ప్రయాణికుడు అనే కారణంతో మర్యాదపూర్వంగా మీరు ఇలా చేయడం సరికాదు సార్ అంటూ అక్కడి నుంచి వెళ్లబోయింది. నా మీద నీకు కోపంగా ఉంది కదూ. నేను ఈ ఫ్లైట్‌కు బాస్ అంటూ ఆమెను మరింత దగ్గరకు లాక్కుని గట్టిగా అదిమిపట్టుకున్నాడు. ఎలాగోలా అతడి నుంచి తప్పించుకున్న ఆమె జరిగిన విషయం విమానం కెప్టెన్‌తో చెప్పింది. అలాగే విమానం ల్యాండ్ అయిన తరువాత సింగపూర్ ఎయిర్‌పోర్టు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో మాథన్‌పై పోలీసులు మహిళపై వేధింపుల కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. విచారణలో తన నేరాన్ని అంగీకరించడంతో మాథన్‌కు కోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

ఎల్‌ సాల్వడార్‌ అధ్యక్షుడి వింత చేష్ట.. ఒక్క సెకను ఓపిక పట్టండంటూ..

ఐక్యరాజ్యసమితి: ‘‘ప్రసంగం ప్రారంభించడానికి ముందు ఈ వేదికపై నుంచి నన్ను ఓ సెల్ఫీ తీసుకోనివ్వండి...’’ అంటూ ఎల్‌ సాల్వడార్‌ అధ్యక్షుడు నయీబ్‌ బుక్లే అన్న మాట సర్వప్రతినిధి సభలో దేశాల అధినేతలను, మంత్రులను, అత్యున్నత స్థాయి అధికార గణాన్ని విస్తుపోయేట్లు చేసింది. వేదికపైకి రాగానే ఆయన ‘మీరు ఒక్క సెకను ఓపిక పట్టండి.. అని చెప్పి వెంటనే తన జేబులోంచి స్మార్ట్‌ ఫోన్‌ బయటకు తీసి ఓ సెల్ఫీని క్లిక్‌ మనిపించారు. ఆయన ట్విటర్‌, ఇన్‌స్టా అకౌంట్లకు 12 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నేను చేసే ప్రసంగం కంటే నా సెల్ఫీనే ఎక్కువ మంది చూస్తారు అని ఆయన వ్యాఖ్యానించారు

హ్యూస్టన్‌లో దారుణం.. భారత సంతతి పోలీస్‌ అధికారిని కాల్చి చంపిన దుండగుడు

హ్యూస్టన్: అమెరికాలో భారత సంతతి పోలీస్‌ అధికారిని విధుల్లో ఉండగా కారులో వచ్చిన ఓ జంట నడి రోడ్డుపై అతి కిరాతకంగా తుపాకీతో కాల్చి చంపేశారు. సందీప్ సింగ్ ధలివాల్(40) అనే వ్యక్తి హ్యూస్టన్‌లో ట్రాఫిక్ పోలీస్‌గా విధులుగా నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో కారులో వచ్చిన ఓ జంటను తనిఖీల పేరుతో ధలివాల్ ఆపాడు. కారులోంచి దిగిన వ్యక్తి తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో ధలివాల్‌పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, హ్యూస్టన్ పోలీస్ విభాగంలో ధలివాల్ మొదటి సిక్కు డిప్యూటీ అని.. విధుల్లో కూడా తలపై పాగాతోనే ఉండేవాడని పోలీస్ అధికారి గాంజలేజ్ తెలిపారు. గత పదేళ్లుగా హ్యూస్టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ధలివాల్ పనిచేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలించిన అధికారులు.. సింగ్‌ను కాల్చిన తరువాత నిందితుడు సమీపంలోని షాపింగ్ మాల్ వైపు పరిగెత్తిన్నట్లు గుర్తించారు. వీడియోలో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు గాంజలేజ్ పేర్కొన్నారు.  నిందితుడి కారు, అతడితో పాటు ఉన్న మహిళ, వారు ఉపయోగించిన తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధలివాల్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ధలివాల్ చాలా మంచి పోలీస్ ఆఫీసర్ అని, అతడికి తన సిక్కు కమ్యూనిటీ అంటే ఎంతో గౌరవమని పోలీస్ కమిషనర్ అదిరన్ గ్రేసియా చెప్పారు. తన కమ్యూనిటీకి గౌరవంగా విధుల్లో కూడా ఎప్పుడు తల పాగాతోనే ఉండేవాడని ఆయన గుర్తు చేశారు.

రేనాటి సూరీడా..

29 September 2019 భారీతనానికి టాలీ’తరం కేరాఫ్ అడ్రెస్సవుతోంది. పాన్ ఇండియా సినిమాలన్నీ ప్రాంతీయ భాషా పరిశ్రమ నుంచే ఉద్భవిస్తున్నాయని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది. భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు చిత్రసీమ గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తోందంటే -కారణం వచ్చిన రెండూ మూడు పెద్ద చిత్రాల గురించి కాదు.. ఈ అనుసరణ ఎంతవరకూ కొనసాగగలదన్న అంశం గురించే. నాలుగొందల కోట్ల పెట్టుబడితో రెండు భాగాల బాహుబలి ఆవిష్కృతమైనపుడు -యాధృచ్చికంగా జరిగిందనుకున్నారు. రెండేళ్లు తిరక్కుండా అంతే బడ్జెట్‌తో -సాహో వచ్చినపుడూ మళ్లీ అలాంటి సీన్ చూడలేంలే అనే అన్నారు. ఇప్పుడు సుమారు మూడొందల కోట్లతో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రెడీ అయినపుడు -టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాల అనుసరణ ఎంతకాలం? అన్న విషయాన్ని ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలకు నాంది పలుకుతోన్న చిత్రం సైరా. పాన్ ఇండియా సినిమా మళ్లీ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదన్న మాట అప్పుడెలా వినిపించిందో ఇప్పుడూ అలానే వినిపిస్తుంది. కానీ, వచ్చే చిత్రాలు వస్తూనే ఉన్నాయి. ఇంకా వస్తాయి. వస్తూనే ఉంటాయనీ ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితి టాలీవుడ్‌లో కనిపిస్తోంది. సైరా. భారత స్వతంత్ర తొలి పోరాటకర్త జీవిత కథ. బ్రిటీష్ పాలనపై కత్తిగట్టిన వీరుల చిత్రాలు టాలీవుడ్‌కు కొత్తకాదు. కాని -సిపాయి తిరుగుబాటుకు ముందే హింసాత్మకమార్గంలో కత్తిదూసిన అజ్ఞాత వీరుడి కథే సైరా. రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషిస్తోన్న చిరంజీవి -తెలుగు సినీ కథానాయక చరిత్రకు కొత్త వెలుగునిస్తాడా? చూడాలి. ** నటించడాన్ని -జీవించటం నుంచే మొదలెట్టాడు చిరంజీవి. పాత్రలోకి ఒదిగిపోయే ద్రావణంలా -తనవంతు పాత్రే పోషించాడు. అలా ఎన్నో పాత్రల్లోకి ఒదిగిపోయి -‘చిరంజీవి’గా మిగిలాడు కొణిదెల వరప్రసాద్. పదేళ్ల క్రితంనాటి కలను నెరవేర్చుకోడానికీ -సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ కాయకష్టానికి సిద్ధమైన చిరు ప్రస్థానాన్ని ‘సైరా’ వరకూ పరిశీలిద్దాం. 1978లో ‘ప్రాణం ఖరీదు’తో తెరంగేట్రం చేసిన చిరు, ‘మనఊరి పాండవులు’గా ఆడియన్స్‌కి దగ్గరైపోయాడు. వెండితెరపై 1988కే అంటే పదేళ్లలో యముడికి మొగుడుతో సెంచరీ కొట్టాడు చిరు. అవకాశాలు వెతుక్కునే స్థాయినుంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేస్థాయికి ఎదిగిన చిరంజీవికి ఒక దశలో పోటీ అన్నదే లేకుండాపోయింది. నాలుగు దశాబ్దాల కాలంలో తిరుగులేని హీరోగా నిలబడటానికి కారణం -చిరంజీవిలోని నటన ఒక్కటే కాదు, పరుగాపని తత్వం. ‘మెగా’ స్టార్‌డమ్ ఊరకనే రాలేదు. ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులన్నీ దాటాకే దక్కింది. చిరంజీవి చేసిన చిత్రాలన్నీ బ్లాక్‌బస్టర్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్టే కాదు. ఫ్లాపులున్నాయి. అట్టర్‌ఫ్లాప్‌లున్నాయ్. ఎన్నో చిత్రాలు యావరేజ్‌లు, అబౌ యావరేజ్‌లు, బిలో యావరేజ్‌ల దగ్గరా ఆగిపోయాయి. సంఖ్యాపరంగా చూస్తే -చిరంజీవి చిత్రాల్లో హిట్లు 53. సూపర్ హిట్లు కేవలం నాలుగే. ఇండస్ట్రీ హిట్లు ఐదు, ఫ్లాప్‌లు 41, అట్టర్ ఫ్లాప్‌లు 21, యావరేజ్‌లు 15, అబౌ యావరేజ్ 4, బిలో యావరేజ్ 8. 150 చిత్రాల్లో ఎన్నో చిత్రాలు తస్సుమన్నా -అది చిరంజీవి చిత్రం అన్న పేరు తెచ్చుకుంది. అదే మెగాస్టార్‌ను చేసింది. ఇప్పుడు చిరంజీవికి హిట్టు ఫట్టుతో సంబంధం లేదు. ఏ సినిమా చేసినా -అది చిరంజీవి సినిమా అనే రేంజ్‌లోనే సెకెండ్ ఇన్నింగ్సూ మొదలవుతుంది. పూర్తి చారిత్రక చిత్రంలో తననుతాను చూసుకోబోతున్నాడు చిరు. అదే సైరా. టీజర్ సెనే్సషన్ అయ్యింది. ‘సూర్యుడివై వీరుడివై వెలుగే పంచావు’ అంటూ టైటిల్ సాంగ్ ఆడియన్స్ నాల్కల మీద ఆడుతోంది. ఇప్పటివరకు చిరంజీవికి కాస్ట్యూమ్ డ్రామా లేకపోయింది. కానీ సైరాతో అదీ ఫుల్‌ఫిల్ అయిపోతుంది. పదేళ్ల క్రితమే అనుకున్న కథ.. సుమారుగా మూడేళ్లు నిర్మాణం జరుపుకున్న సినిమా -సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోంది సైరా. కథను బలంగా చెప్పడానికి దేశంలో ఆరితేరిన నటులను తెచ్చిపెట్టుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్ కనిపించనున్నాడు. ఝాన్సీ లక్ష్మిబాయిగా అనుష్క, రాజా పండి పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి, అవుకురాజుగా కన్నడ స్టార్ సుదీప్, దేశభక్తి కలిగిన లక్ష్మి పాత్రలో తమన్నా భాటియా, రాజ కుటుంబానికి చెందిన దేశభక్తుడు వీరారెడ్డిగా జగపతిబాబు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య సిద్దమ్మగా నయనతార నటిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి పెర్ఫార్మెన్స్‌పై ఆడియన్స్‌లో ఆసక్తి కనిపిస్తోంది. చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రం, పైగా సమరయోథుడి జీవిత కథ కనుక స్క్రిప్ట్‌వర్క్‌పై ఎక్కువ కష్టమే పెట్టామని చెబుతోంది చిత్రబృందం. నరసింహారెడ్డి జీవితాన్ని తెలుసుకోడానికి చెన్నై లైబ్రరీలో పుస్తకాలు అధ్యయనం చేశామని, తంగిరాల సుబ్బారావు రాసిన పుస్తకాలు, బ్రిటీషర్లు ప్రచురించిన గెజిట్లు.. ఉయ్యాలవాడ ఎక్కడెక్కడ తిరిగాడు, ఏ ప్రాంతంలో పోరాటాలు సలిపాడు, ప్రభుత్వం అతన్ని ఎక్కడ ఉరితీసింది.. ఇలాంటి విషయాలు సేకరించి ఉద్దంత రచయితల సహకారంతో స్క్రిప్ట్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఇక యుద్ధ సన్నివేశాల కోసం జార్జియా నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో క్రొత్త ప్రపంచానే్న ఆవిష్కరించి, వెయ్యిమందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తోంది. హైదరాబాద్‌లోనూ భారీ సెట్స్‌వేసి చిత్ర నిర్మాణం పూర్తి చేశారు. పాన్ ఇండియా సినిమా కనుక తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. బాహుబలికి ఇది సమానస్థాయిలో ఉంటుందా? అంటే బాహుబలి రెండు భాగలూ జానపదాలు. కానీ ఇదొక వీరుడి యదార్థ జీవితగాథ. భారతదేశ చరిత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం, బ్రిటీషర్లపై ఆయన తిరుగుబాట్లలోని కీలక ఘట్టాలు చిత్రంలో కనిపించనున్నాయి. ఈ భారీ చిత్రానికి నిర్మాత -చిరంజీవి తనయుడు రామ్‌చరణ్. ‘కొణిదెల ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై దాదాపు 250 కోట్ల నిర్మాణ వ్యయంతో పూర్తి చేశారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి మూడేళ్ల సమయం తీసుకుని ఈ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించాడు. కథకు రచనా సహకారం, సలహాలు పరుచూరి బ్రదర్స్ అందిస్తే, మాటల్ని తూటాల్లా పేల్చే బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందించారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ ఒక ఎత్తు. రత్నవేలు దేశంలోని టాప్ టెన్ సినిమాటోగ్రాఫర్లలో ఒకరు. యాక్షన్ ఎపిసోడ్స్‌ని రామ్‌లక్ష్మణ్, సంగీతాన్ని అమిత్ త్రివేదీ సమకూర్చారు. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ -పవన్‌కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో అట్రాక్షన్. కథ విషయానికొస్తే.. 1857నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎదురు నిలిచినటువంటి విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. స్వాతంత్య్ర సంగ్రామంలో ఈయన పాత్ర పెద్దది. ఝాన్సీలక్ష్మీబాయి, భగత్‌సింగ్‌లకు తీసిపోని విప్లవకెరటం ఉయ్యాలవాడ. తన జీవితానే్న త్యాగం చేసిన వీరుడు చరిత్రలో కనుమరుగయ్యాడు. ఆయన కాలంలో జరిగిన తిరుగుబాట్లు, మిత్రులు, శత్రువులు, పరిస్థితులు, పోరాటాలు, గెలుపు ఓటములు, యుద్ధాలు జరిగిన విధానం, ఎందుకోసం ఆ తిరుగుబాటు జరిగింది, అజాత శత్రువులెవరు? అనే విషయాలనే తెరమీదికెక్కించడం జరిగింది. ఈయన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు. అయితే ఈయన కర్నూలు (రాయలసీమ) ప్రాంతానికి చెందినవాడు. అయినప్పటికీ కేవలం ప్రాంతానికే పరిమితం కాకుండా యాస, భాషలు కాస్త అందరికీ అర్థమయ్యేలా చిత్రంలోని మాటలు, పరిసరాలుంటాయి. నరసింహారెడ్డి ఈ సినిమా కథలో ఒక పాలెగాడు. అయినప్పటికీ దాదాపు 70మంది పాలెగాళ్లను తాటిమీదకుతెచ్చి రాజులమీద ఎదురుదాడి చేయడమే ఇందులోని సారాంశం. మరో పది రోజుల్లో ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదల కానుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న ‘సైరా’ -టాలీవుడ్ స్టామినాను ఎంత గొప్పగా చెప్పనుందో చూద్దాం. -శ్రీనివాస్ పర్వతాల