Labels

ఏటీఎంలలో ఉత్తర కొరియా మాల్‌వేర్‌!

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: భారతీయ బ్యాంకుల ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని ఉత్తర కొరియా ఓ శక్తిమంతమైన మాల్‌వేర్‌ను తయారు చేసింది. ఆ దేశ నిఘా సంస్థ రికానిసెన్స్‌ జనరల్‌ బ్యూరోకు చెందిన లాజరస్‌ గ్రూప్‌ ఈ మాల్‌వేర్‌ను రూపొందించిందని దిగ్గజ యాంటీవైరస్‌ సంస్థ కాస్పర్‌స్కై వెల్లడించింది. రిమోట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ టూల్‌ (ర్యాట్‌)గా పనిచేసే ‘ఏటీఎండీట్రాక్‌’ అనే ఆ మాల్‌వేర్‌ బ్యాంకుల సర్వర్లలో, ఏటీఎంలలో చొరబడితే.. వినియోగదారుల కార్డుల వివరాలన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తాయని పేర్కొంది.