Labels

ఎల్‌ సాల్వడార్‌ అధ్యక్షుడి వింత చేష్ట.. ఒక్క సెకను ఓపిక పట్టండంటూ..

ఐక్యరాజ్యసమితి: ‘‘ప్రసంగం ప్రారంభించడానికి ముందు ఈ వేదికపై నుంచి నన్ను ఓ సెల్ఫీ తీసుకోనివ్వండి...’’ అంటూ ఎల్‌ సాల్వడార్‌ అధ్యక్షుడు నయీబ్‌ బుక్లే అన్న మాట సర్వప్రతినిధి సభలో దేశాల అధినేతలను, మంత్రులను, అత్యున్నత స్థాయి అధికార గణాన్ని విస్తుపోయేట్లు చేసింది. వేదికపైకి రాగానే ఆయన ‘మీరు ఒక్క సెకను ఓపిక పట్టండి.. అని చెప్పి వెంటనే తన జేబులోంచి స్మార్ట్‌ ఫోన్‌ బయటకు తీసి ఓ సెల్ఫీని క్లిక్‌ మనిపించారు. ఆయన ట్విటర్‌, ఇన్‌స్టా అకౌంట్లకు 12 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నేను చేసే ప్రసంగం కంటే నా సెల్ఫీనే ఎక్కువ మంది చూస్తారు అని ఆయన వ్యాఖ్యానించారు