Labels

ఒక్కేసి….. పువ్వేసి

తెలంగాణలో పెద్ద పండగ దసరా. తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులు బతుకమ్మ ఆటపాటలతో గడుపుతారు. రోజుకో బతుకమ్మను చేసి ఇరుగు, పొరుగువారు కలిసి ఆడుతారు. ఆ తర్వాత ఆ బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఎన్నో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ సంస్కృతి సంప్రదాయాలు తెలంగాణలో మరింత జోరందుకుంటున్నాయి. శనివారం రోజు నుంచే బతుకమ్మ పండగ మొదలవుతోంది. పండుగ విశిష్టత సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో తెలంగాణ ప్రజలకు రెండు పెద్ద పండుగ లుంటాయి. ఒకటి బతుకమ్మ పండుగ, మరొకటి విజయ దశమి, బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను ఆడిన తర్వాత నిమజ్జనం చేస్తారు. ఈ పండుగ వర్షాకాలం చివరిలో, శీతాకాలం తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. పండుగ సంబరాలు 9 రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మహా అమావాస్య రోజు బతుకమ్మ పండగ మొదలవుతుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రెండోరోజు అటుకుల బతుకమ్మ, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. నాలుగోరోజు నానే బియ్యం బతుకమ్మ నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. సద్దుల బతుకమ్మతో ముగింపు….. ఐదోరోజు అట్ల బతుకమ్మ, అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఈ రోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదోరోజు వెన్నముద్దల బతుకమ్మ, నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు. తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మ, ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు. బతుకమ్మ పండగ మొదలైనప్పటి నుంచి అన్ని రోజుల మహిళలు ఆడుతూ… పాడుతూ హుషారుగా ఉంటారు. ఒక వేళ ఈ ఎనిమిది రోజులు కూడా ఎవరైనా బతుకమ్మను చేయకున్నా…. ఆడకున్నా చివరిరోజు అనగా సద్దుల బతుకమ్మ రోజు తప్పకుండా ఆడుతారు.

టీడీపీ చేజారిన ఐదో నెంబర్ గది!

  న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: పార్లమెంటు ఆవరణలోని ఐదో నంబర్ గది ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ నుంచి జారిపోయి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చేతిలో పడింది. తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా మరో గదిని కూడా కేటాయించలేదు. పార్లమెంటు ఆవరణలోని ప్రధాన సర్కిల్‌లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉండకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంతం నెగ్గింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఔటర్ సర్కిల్‌లోని ఐదో నంబర్ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి తప్పించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు కేటాయించారు. తెలుగుదేశం పార్టీకి లోక్‌సభలో ముగ్గురు, రాజ్యసభలో ఇద్దరు సభ్యులున్నారు. వైసీపీకి ఇరవై రెండు మంది, రాజ్యసభలో ఇద్దరు సభ్యులన్నారు. తమకు ఐదో నంబర్ గదిని కేటాయించాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు గతంలో లేఖ రాశారు. ఆయన ఇంతటితో ఆగకుండా స్పీకర్ ఓం బిర్లాను పలుమార్లు కలిసి తమ పార్టీకి ఐదో నంబర్ గదిని కేటాయించవలసిన అవసరం గురించి వివరించారు. ఇదిలాఉంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న బీజేపీకి దూరం కావడం.. గత లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోదీపై చంద్రబాబు రకరకాల ఆరోపణలతో విరుచుకుపడడం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో మోదీని వ్యక్తిగత స్థాయిలో కూడా దూషించారు. బీజేపీ అధినాయకత్వం వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అత్యంత ప్రాధాన్యత ఉన్న ఐదో నంబర్ గది కార్యాలయాన్ని వైసీపీకి కేటాయించిందని అంటున్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం దాదాపు 35 సంవత్సరాల నుండి ఈ ఐదవ నంబర్ గదిలోనే కొనసాగుతోంది. ఎన్‌టీ రామారావు నాయకత్వంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ 1984లో 30 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నప్పుడు ఐదో నంబర్ గదిని కేటాయించారు. తెలుగుదేశం పార్టీకి అత్యధిక మంది లోక్‌సభ సభ్యులున్నందుకే పార్లమెంటులోని ఔటర్ లాబీలోని ఐదో నంబర్ గదిని కేటాయించారు. ఐదో నంబర్ గదికి కుడి వైపున కొద్దిదూరంలో ప్రధాన మంత్రి కార్యాలయం ఉంటే.. ఎడమ పక్క ఐదు అడుగుల దూరంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం ఉంటుంది. అందుకే ఐదో నంబర్ గదికి అంత ప్రాధాన్యత. తెలుగుదేశం లోక్‌సభ సభ్యుల సంఖ్య 1989లో రెండుకు, 2004లో ఐదుకు, 2009లో ఆరుకు పడిపోయినా ఐదో నంబర్ గదిని నిలబెట్టుకున్నారు. 2004లో అప్పటి టీడీఎల్‌పీ నాయకుడు కె.ఎర్రంనాయుడు, 2009లో టీడీఎల్‌పీ నాయకుడు నామా నాగేశ్వరరావు ఐదో నంబర్ గదిని కాపాడుకోవటంలో విజయం సాధించారు. గతంలో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు ఐదో నంబర్ గది కోసం పెద్దఎత్తున గొడవ చేశాయి. గతంలో ఈ ఐదో నంబర్ గది ఒకసారి తృణమూల్ కాంగ్రెస్‌కు, మరోసారి డీఎంకేకు కేటాయించినా తెలుగుదేశం నాయకులు కష్టపడి కాపాడుకోగలిగారు. అయితే ఇప్పుడు వైసీపీ పక్షం నాయకుడు విజయసాయి రెడ్డి ఐదో నంబర్ గదిని సాధించుకునేందుకు వేసిన ఎత్తులను తెలుగుదేశం సభ్యులు ఎదుర్కొనలేకపోయారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఐదో నంబర్ గదిని వైసీపీకి కేటాయించటంతో తెలుగుదేశం సభ్యులు ఆ గదిని ఖాళీ చేయకతప్పడం లేదు. ఇదిలాఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌కు పార్లమెంటు మూడో అంతస్తులోని 125 నంబర్ గదిని కేటాయించారు.

మోదీ అమెరికాలో సెట్ చేసేశాడు బాస్


Sep 26 2019



ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో దౌత్యపరంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. భారత్ - అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడాన్ని ప్రాధాన్యమైన అంశంగా తీసుకున్న మోదీ...ఈ క్రమంలో న్యూయార్క్ లో బ్లూంబర్గ్ సమ్మిట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగు ముఖ్యమైన అంశాలకు వేదికగా... భారత్ ఉందని పేర్కొంటూ...ఇలాంటి ప్రాంతం మరొకటి లేదని తెలిపారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందని పరిస్థితుల అనుకూలత - డిమాండ్ ఉందన్న ప్రధాని...వీటన్నింటి వల్ల భారత్ లో పెట్టుబడులకు భరోసా ఉందన్నారు.

భారత్ - అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునేందుకు త్వరలోనే భారత్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్ హైజర్.. భారత్ తో సంప్రదింపులు జరుపుతున్నారని - త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని పేర్కొన్నారు. ఈ అంశాలను పేర్కొంటూ...ఇండియా మీ అందరి కోసం ఎదురుచూస్తోందని మోదీ పిలుపు ఇచ్చారు. ప్రకృతి వనరులను అవసరాలకు వాడుకోవాలి తప్పితే.. స్వార్థంతో కబళించకూడదని.. తాము నమ్ముతామని అన్నారు. అందరూ మెచ్చే గమ్యస్థానం ఇండియానే అని - పెట్టుబడులతో రావాలని - అభివృద్ధిని పంచుకుందామని మోదీ అమెరికా వ్యాపారవేత్తలకు పిలుపు ఇచ్చారు.

పెట్టుబడులకు ప్రస్తుత సమయం మహత్తర అవకాశమని మోదీ విశ్లేషించారు. తమ దేశంలో రాజకీయ స్థిరత్వం వచ్చాక.. పెట్టుబడులకి - అభివృద్ధికి అవకాశాలు పెరిగాయన్నారు. గత ఐదేళ్ల అనుభవంతో మరింత స్పష్టంగా - బలంగా.. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించామని మోదీ పేర్కొన్నారు. స్టార్టప్ లకు ఇండియాలో లభిస్తున్నంత ప్రోత్సాహం మరెక్కడా లేదన్నారు. 20 శాతానికి పైగా వృద్ధిరేటుతో విమానయానం విస్తరిస్తోందన్నారు. ఇండియాలో ఇప్పుడు ప్రతి నగరానికి విమాన సర్వీసులున్నాయని - విమానయానంలో ఇండియా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని మోదీ స్పష్టం చేశారు.

కాగా కీలకమైన వాణిజ్యం విషయంలో...ఇరు దేశాల మధ్య పేచీ కొనసాగుతోంది. ఉక్కు - అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన భారీ సుంకాలను తగ్గించాలని భారత్ డిమాండ్ చేస్తున్నది. ప్రాధాన్య హోదా కల్పిస్తున్న రాయితీలను పునరుద్ధరించాలని కోరతున్నది. మరోవైపు అమెరికా తమ వ్యవసాయ - తయారీ ఉత్పత్తులు - డైరీ ఉత్పత్తులు - వైద్య పరికరాలకు మెరుగైన మార్కెట్ కల్పించాలని భారత్ను డిమాండ్ చేస్తున్నది. ఐసీటీ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని కోరుతోంది. ఈ అంశాల్లో వచ్చే వాటి ఆధారంగానే...ప్రధాని అమెరికా టూర్ సఫలం ఆధారపడి ఉండనుంది.

ఏపీకి కొత్త ఓడరేవులు..

Thu Sep 26 2019


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా రెండు ఓడరేవులను ఏర్పాటు చేయాలని ఏపీ ఐటీ - పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవియాను కోరారు. భారతదేశంలో అత్యధిక సముద్ర తీరం ఉన్న రాష్ట్రంలో ఏపీ ఒకటి. ఏపీకి 972 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీరరేఖ ఉంది. గుజరాత్ 1061 కిలోమీటర్ల తర్వాత దేశంలో ఎక్కువ తీరరేఖ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. ఏపీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సముద్రతీరం ఇప్పుడు ఓ అంతర్జాతీయ సరుకు రవాణాకు ముఖ్యమైన కేంద్రంగా విరాజిల్లుతుంది.

అయితే సరుకు రవాణాకు ఓడల ద్వారా ఖర్చు తక్కువ అవుతోంది. విమాన రవాణా - రైల్ రవాణాతో ఖర్చు అధికంగా అవుతుంది. అదే ఓడరేవులతో ఖర్చు తక్కువ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంత పెద్ద సముద్ర తీరం ఉన్న ఏపీకి మరో రెండు మూడు ఓడరేవులు వస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఏపీ సర్కారు అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు - అందాల్సిన సహకారంపై కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవియాను ఏపీ పరిశ్రమలు - ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బుధవారం కలిశారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రికి గౌతంరెడ్డి అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలోని దుగరాజ పట్నం పోర్టును జాతీయ పోర్టుగా గుర్తించి ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల దృష్ట్యా ముందుకు సాగలేదు. దీంతో దుగరాజపట్నం పోర్టును జాతీయ పోర్టుగా చేయనందున - ప్రత్యామ్నాయంగా రామాయపట్నం - మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో కొత్త ఓడరేవులను ఏర్పాటు చేయాలని మాండవియాకి గౌతం రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ రెండు ఓడరేవులు కేంద్రం ఏర్పాటు చేస్తే ఏపీ అభివృద్ధికి బాటలు పడుతాయని గౌతం రెడ్డి అన్నారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ఏపీ సముద్ర రవాణాలో మరింత ముందుకు దూసుకు వెళ్లడం ఖాయం.

ప్రేమ పెళ్లిళ్లకు నో అంటున్న మిజో యువత





భారతీయ సమాజంలో కులశృంఖలాలు ఎంత గట్టిగా బిగించినా కొందరు ప్రేమికులను బంధించడంలో అనాదికాలం నుంచీ అవి విఫలమవుతూనే ఉన్నాయి. అందుకే అనులోమ వివాహాలనీ, ప్రతిలోమ వివాహాలనీ, వాటి వలన పుట్టిన సంతానాన్ని ఫలానా పేరుతో పిలుస్తారని మన పురాణగ్రంథాల్లోనే కనబడుతుంది. కానీ యిప్పటికీ పెద్దలు కులాంతర వివాహాలను నిరసిస్తూనే ఉంటారు. స్వేచ్ఛ కోరే యువత వారిని ధిక్కరిస్తూనే ఉంటారు. స్థానికంగా ఉన్న సమాజ పరిస్థితుల బట్టి, సంస్కారం బట్టి పెద్దల ప్రతిచర్య ఉంటూంటుంది. కుల, మత రాజకీయాలు కూడా చొరబడినప్పుడు సమస్య తీవ్రమౌతుంది. మొన్నటిదాకా 'లవ్‌ జిహాద్‌' అనేది పెద్ద అంశంగా చిత్రీకరించ బడింది. ఇటీవల హిందువుల్లోనే కులాంతర వివాహాలు ఎక్కువయ్యాయి. తక్కిన ప్రాంతాల్లో జరిగినప్పుడు వార్తల్లోకి రావు కానీ ఉత్తరాది రాష్ట్రాలలో జరిగినప్పుడు అవి ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఎందుకంటే పరువుహత్యల పేరుతో సంతానాన్ని చంపుకోవడానికి కూడా వెనుకాడని కుటుంబాలున్నాయక్కడ!

యుపిలోని బరేలీకి చెందిన ఒక బ్రాహ్మణ బిజెపి ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా ఉదంతం యీ మధ్య అందరి దృష్టినీ ఆకర్షించింది. అన్నగారికి స్నేహితుడైన ఒక బంజారా యువకుణ్ని ఆమె ప్రేమించి, యింట్లో ఎవరూ లేని సమయం చూసి జులై 3న అతనితో పారిపోయింది. దాంతో ఆమె తండ్రి అనుచరులైన కొందరు గూండాలు ఆ జంటను వెంటాడారు. మా మానాన మమ్మల్ని బతకనీయండి అంటూ తండ్రిని, అన్నను ఉద్దేశించి ఆమె ఒక వీడియో తయారు చేసి సోషల్‌ మీడియాలో పెట్టేసింది. దాంతో తండ్రి యిబ్బందిలో పడ్డాడు. ఆ జంట జులై 15న ఇలహాబాద్‌ హైకోర్టుకి వచ్చినపుడు అడ్వకేట్ల వేషంలో ఉన్న తండ్రి అనుచరులు వారిపై దాడి చేయడంతో కోర్టు వారిని దొడ్డి గుమ్మం ద్వారా బయటకు పంపించి వేసింది. ఆ అమ్మాయికి 24, అతనికి 29 కాబట్టి వారి వివాహం చెల్లుతుందని కోర్టు తీర్పు యిచ్చింది. వారి వివాహాన్ని తను ఆమోదించనని, కానీ తన వలన వారికి ప్రాణహాని లేదని ఎమ్మెల్యే కోర్టుకి హామీ యిచ్చాడు. తన పట్టింపంతా అబ్బాయి కులం గురించి కాదని, వారిద్దరి మధ్య ఉన్న వయసు తేడా (5 ఏళ్లు) గురించి అని, పైగా అబ్బాయికి ఆదాయం లేదని అతను ప్రెస్‌కి చెప్పాడు. అబ్బాయి తండ్రి బ్యాంకు ఉద్యోగి. అబ్బాయి, అతని అన్నగారు కలిసి టైల్స్‌ వ్యాపారం చేస్తున్నారు. తండ్రి ఊరుకున్నా, కొందరు మాత్రం సాక్షిని సోషల్‌ మీడియాలో బండబూతులు తిడుతున్నారు. ఈమె వారికి ధాటీగా సమాధానం చెపుతోంది.

యుపి కంటె సామాజికంగా వెనుకబడిన బిహార్‌లో కూడా కులాంతర వివాహాలు గతంలో కంటె పెరిగాయి. నీతీశ్‌ పాలనలో ఆడవారికి విద్యావకాశాలు, 35% రిజర్వేషన్‌ కారణంగా ఉద్యోగావకాశాలు బాగా పెరిగి వారికి ధైర్యం సమకూరింది. అందువలన పెద్దలు కుదిర్చిన సంబంధాలు కాదని నచ్చినవాడితో లేచిపోతున్నారు. ఇలాటి కేసుల్లో తలిదండ్రులు 'మా అమ్మాయి మైనర్‌, అవతలి అబ్బాయి బలవంతంగా ఎత్తుకుపోయాడు' అని కేసులు పెడుతున్నారు. అప్పుడు అమ్మాయిలు మేం మేజర్లం, మా యిష్టప్రకారమే పారిపోయి పెళ్లి చేసుకున్నాం అని సోషల్‌ మీడియాలో జవాబిస్తున్నారు. ఇటీవల ఒకమ్మాయి తను మైనరు కాదని నిరూపించడానికి ఆధార్‌ కార్డును కూడా పోస్టు చేసింది. 2018లో 10,271 కిడ్నాప్‌ కేసులు నమోదైతే వాటిలో 3,017 (30%) కేసులు యిలా పారిపోయిన కేసులేట. ఈ ఏడాది మే వరకు 4,576 కేసులు నమోదయ్యాయి. వాటిలో 1626 (35%) యిలాటివేట. ఇలా కేసులు పెట్టి హంగామా చేసిన తర్వాత కొన్నాళ్ల తర్వాత చాలా సందర్భాల్లో రాజీ పడుతున్నారుట. పడని సందర్భాలూ ఉన్నాయి కాబట్టి జంకు మాత్రం ఉంటోంది. కులాంతర వివాహం చేసుకుంటే బిహార్‌ ప్రభుత్వం ఆ జంటకు లక్ష రూ.లు యిస్తుంది. కానీ దాని కోసం అర్జీ పెట్టుకుంటే తాము ఎక్కడున్నామో తెలుస్తుందనే భయంతో యీ జంటలు అడగటం లేదట. 2017-18లో ఆ పద్దు కింద బిహార్‌ ప్రభుత్వం ఖర్చు పెట్టినది రూ.1.03 కోట్లు మాత్రమే. అంటే 103 జంటలు మాత్రమే అడిగాయన్నమాట. ఎలా చూసినా గతంలో కంటె కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి. దీనికి గాను యువతలో మారుతున్న దృక్పథమే కారణం.

అయితే దీనికి భిన్నంగా ఉంది మిజో యువత దృక్పథం. మిజోయేతరులను పెళ్లి చేసుకోవద్దని వాళ్లు ఉద్యమిస్తున్నారు. మిజోలు కానివాళ్లను పెళ్లి చేసుకున్న మిజో అమ్మాయిలను గ్రామాల నుండి బహిష్కరించిన వార్తలు గత ఏడాదే వచ్చాయి కానీ యిప్పుడు ''మిజో జిర్లాయ్‌ పాల్‌'' అనే అత్యంత బలమైన విద్యార్థి సంఘం దీన్ని ఒక ఉద్యమంలా చేపట్టింది. వాళ్లు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి విద్యార్థినీవిద్యార్థుల చేత మిజోయేతరులను పెళ్లి చేసుకోమని ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. ఎందుకు అంటే మన సంస్కృతి, సంప్రదాయం కాపాడుకోవడానికి.. అంటున్నారు. మిజో వారందరూ అని పైకి అంటున్నా, నిజానికి వారి తాపత్రయమంతా మిజో అమ్మాయిలు యితరులను పెళ్లి చేసుకోకుండా చూడడమే! ఆ మాట వారే చెప్తున్నారు. బయటివారిని పెళ్లి చేసుకోవడంలో మిజో యువకుల కంటె యువతులు ముందంజలో ఉన్నారు కాబట్టి.. అంటున్నారు. మిజోయేతరులను పెళ్లి చేసుకున్న మిజో యువతులకు గిరిజన రిజర్వేషన్లు వర్తింప చేయకూడదంటూ కితం ఏడాది 'యంగ్‌ మిజో అసోసియేషన్‌' అనే శక్తివంతమైన యూత్‌ ఆర్గనైజేషన్‌ ఒక ప్రతిపాదన చేసింది.

ఇలాటి ఆలోచనలు మిజోరాంలోనే కాదు, మేఘాలయ, మణిపూర్‌లలో కూడా ఉన్నాయి. మేఘాలయ లోని గిరిజన కౌన్సిల్‌ గత ఏడాది ఒక బిల్లు ప్రవేశపెట్టబోయింది. దాని ప్రకారం ఖాశీ యువతులు యితర జాతుల వారిని పెళ్లి చేసుకుంటే వారసత్వపు హక్కులు కోల్పోతారు. మహిళా గ్రూపులు అభ్యంతర పెట్టడంతో ఆ బిల్లు పాస్‌ కాలేదు. కశ్మీరులో మాత్రమే కాదు, ఈ మూడు రాష్ట్రాలలో కూడా యితరులు భూమి కొనడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. బయటివాళ్లను పెళ్లాడితే వారసత్వం, పౌరసత్వం పోతుందన్న కశ్మీరు నిబంధనను అక్కడి హైకోర్టు కొట్టేసింది కూడా. అయినా యిక్కడ యీ ప్రయత్నం జరిగింది. మిజోయేతరులు మిజోరాంలో భూమి కొనలేక పోవడమే కాదు, అక్కడికి వెళ్లాలన్నా వీసా లాటి స్పెషల్‌ పాస్‌ - ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌ (ఐఎల్‌పి)ని పరిమితి కాలానికి తీసుకోవాలి. ఈ నిబంధనలు పాటిస్తూనే యితర ప్రాంతాల నుంచి కార్మికులు, వ్యాపారులు అక్కడకు వెళుతున్నారు. వారిలో కొందర్ని మిజో యువతులు వలచి, పెళ్లాడుతున్నారు. దీన్ని మిజో విద్యాధికులు సైతం సహించలేక పోతున్నారు. 'ఇలా అయితే మా సంస్కృతి, సంప్రదాయం, మతం ఏమయ్యేట్లు?' అని వాదిస్తున్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం 11 లక్షల మంది ఉన్న మిజోరాం జనాభాలో 87% మంది క్రైస్తవులే. ఉన్న 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 39 గిరిజనులకే కేటాయించారు. ఆర్టికల్‌ 371 (జి) ప్రకారం మిజోలకు సంబంధించిన మతపరమైన, సామాజికపరమైన ఆచారవ్యవహారాల్లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం లేకుండా పార్లమెంటు ఏమీ చేయలేదు. భూమి కొనుగోళ్ల వ్యవహారంలో కూడా..! కశ్మీరు విషయంలో యిలాటి హక్కులను కాలరాసిన బిజెపి ప్రభుత్వం యింకా వీటి జోలికి రాలేదు. అందువలన మిజో మగవారే తమ స్త్రీలపై ఆంక్షలు విధించడానికి పూనుకున్నారు. కానీ అక్షరాస్యతలో కేరళ, లక్షద్వీప్‌ తర్వాతి స్థానం మిజోరాందే. విద్యావంతులైన మిజో మహిళలు దీనిని ఎంతవరకు సహిస్తారో చూడాలి. ముఖ్యంగా బయటివారితో వివాహమనే సాకు చెప్పి, అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆస్తిహక్కులు హరిస్తూంటే ఊరుకుంటారా అన్నది ప్రశ్న.

ఇక్కడ వారసత్వం విషయంలో మిజో ఆచారాల గురించి కొంత తెలుసుకోవాలి. అక్కడ పితృస్వామ్యమే నడుస్తోంది కాబట్టి ఆస్తిలో మగవాళ్లకే వాటా. కొడుకుల్లో ఆఖరివాడికి ఆస్తి వెళుతుంది. తక్కిన కొడుకులకు కూడా తండ్రి దయతలచి యిస్తే యివ్వవచ్చు. కొడుకులు లేకపోతే బంధువుల్లో మగవారసుడు ఎవరుంటే వాళ్లకే వెళుతుంది. ఇంటి పెద్ద మరణించే సమయానికి, పిల్లలు మైనర్లయితే, వారి ఆస్తి కస్టడీ అతని భార్యకు రాదు, భర్త వైపు మగబంధువులకు వస్తుంది. కొడుకులు పెద్దవాళ్లయాక వాళ్లకు అజమాయిషీ వస్తుంది. ఇంటిపెద్ద వైపు మగబంధువులు ఎవరూ లేకపోతేనే భార్యకు కానీ, కూతురుకు కానీ ఆస్తి వస్తుంది. పెళ్లి సమయంలో భర్త యిచ్చే కన్యాశుల్కంపైనే ఆమెకు సంపూర్ణమైన హక్కు ఉంటుంది. ఇటీవలి కాలంలో తండ్రి విల్లు ద్వారా కూతురికి వాటా యిస్తే అప్పుడు మాత్రమే వారికి దక్కుతోంది. ఇలాటి పరిస్థితుల్లో ఆస్తిలో వాటా దక్కదనే బెదిరింపు మిజో మహిళలపై ఏ మేరకు పని చేస్తుందో మరి.

ఆర్టికల్‌ 370 రద్దు చేయగానే ఎల్లెడలా వినబడిన నినాదం - కశ్మీరులో యిక మనం కూడా భూమి కొనవచ్చు, కశ్మీరు అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు అని. హరియాణా ముఖ్యమంత్రి కూడా కశ్మీరీ వధువులు అందుబాటులో రావడం గురించి మాట్లాడాడు. విశ్వనాథ్‌ ఆనంద్‌ అనే గాయకుడు భోజపురి భాషలో 'లాయీబ్‌ కశ్మీర్‌సే దుల్హనియా..', అంటూ పాట పాడి ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ఇదే కాదు, వివిధ భాషల్లో కశ్మీరీ యువతుల గురించి యింకా అనేక పాటలు చలామణీలోకి వచ్చాయి. ఇవి విని కశ్మీరీ యువకులు గొణుక్కుని ఊరుకుంటున్నారేమో కానీ ఉద్యమాలు లేవదీసే స్థితిలో లేరు. మిజో యువతుల గురించి యిలాటి ప్రకటనలు, పాటలు వస్తే ప్రతిఘటించడానికి అక్కడి విద్యార్థి సంఘాలు తయారుగా ఉన్నాయి. జాగ్రత్త! (ఫోటో - మిజోయేతరులను పెళ్లాడమని ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు)
-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2019)
mbsprasad@gmail.com

కశ్మీర్‌లో ఒక్కసారే పర్యటించిన గాంధీ.. అప్పుడు ఆయన ఏమన్నారు?

26 సెప్టెంబర్ 2019


స్వాతంత్ర్యం ఇంటి గుమ్మం దగ్గరే ఉంది. కానీ, తలుపు ఇంకా తెరుచుకోలేదు. రాచరిక రాజ్యాలను విలీనం చేసే ప్రణాళికలో జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ తలమునకలై ఉన్నారు.

రాచరిక రాజ్యాలు రకరకాల ఎత్తులు వేస్తున్నాయి. భారత దేశంలో విలీనం అయ్యేందుకు అనేక షరతులు పెడుతున్నాయి.

అదే సమయంలో, సామ్రాజ్యవాద శక్తులు కొత్త కుట్రలు పన్నుతున్నాయి. స్వాతంత్ర్యం అంచున ఉన్న భారత్‌పై ఓ కన్నేసి ఉంచడంతో పాటు, ఆసియా కీలక రాజకీయాల్లో జోక్యం చేసుకునేందుకు ఈ పరిస్థితులను ఒక అవకాశంగా మలచుకోవాలని ఆ శక్తులు చూస్తున్నాయి.

అప్పటికే పాకిస్తాన్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. కశ్మీర్ కూడా సామ్రాజ్యవాదుల వ్యూహానికి అనుకూలంగా ఉంది. 1881 నుంచి సామ్రాజ్యవాదులు ఆ 'సాలిగూడు'ను అల్లుతూ వస్తున్నారు. అందుకు సంబంధించిన పత్రాలు తాజాగా బయటపడ్డాయి.

కశ్మీర్ కీలకంగా మారింది. రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువ నాయకుడు షేక్ మొహమ్మద్ అబ్దుల్లాకు కాంగ్రెస్‌ మద్దతు ఉంది. ఆయన జవహర్‌లాల్‌కు సన్నిహితుడిగా ఉండేవారు.

స్థానికంగా నిరసన కార్యక్రమం చేపట్టిన ఆయనను మహారాజా హరిసింగ్ జైలులో పెట్టారు. దాంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన జవహర్‌లాల్ నెహ్రూ ప్రతీకార చర్యలు చేపట్టేందుకు కశ్మీర్ వెళ్లారు. ఆయనను కూడా తన సొంత గెస్ట్ హౌజ్‌లోనే గృహనిర్బంధం చేశారు. ఆ పరిణామంతో మహారాజాకు ఇక్కట్లు మొదలయ్యాయి.

కశ్మీర్ ఎటు వెళ్లాలి? అన్న సందిగ్ధత కారణంగా లోయలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? బాపుజీని అక్కడికి వెళ్ళాలని కోరితే ఎలా ఉంటుంది? అని లార్డ్ మౌంట్‌బాటన్ ప్రతిపాదించారు.
‘అల్-ఖైదాకు మా దేశమే శిక్షణ ఇచ్చింది’ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకారం
హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?Image copyrightGETTY IMAGES

అంతకుముందు మహాత్మా గాంధీ ఎన్నడూ కశ్మీర్‌‌లో అడుగుపెట్టలేదు. వెళ్లాలని అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక కారణంతో ఆ పర్యటన విరమించుకోవాల్సి వచ్చేది.

జిన్నా కూడా కశ్మీర్‌ను కేవలం ఒక్కసారే సందర్శించారు. అప్పుడు, టొమాటోలు, కోడి గుడ్లతో ఆయనకు స్వాగతం లభించింది. భూస్వాములకు, యువరాజులకు జిన్నా అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉండేది.

గాంధీజీ కశ్మీర్ వెళ్లాలని మౌంట్‌బాటన్ ప్రతిపాదనలు చేశారు. గాంధీజీకి అప్పుడు 77 ఏళ్లు.

భారత భౌగోళిక స్వరూప మూలాలు బలంగా లేకపోతే, రాచరిక రాజ్యాలు భవిష్యత్తులో కొరకరాని కొయ్యలా తయారవుతాయని ఆయనకు తెలుసు. కశ్మీర్ వెళ్లేందుకు గాంధీ సరే అన్నారు.

"మీరు ఈ వయసులో అంత క్లిష్టమైన ప్రయాణం చేయడం అవసరమా? మీరు మహారాజాకు లేఖ పంపితే సరిపోతుంది కదా" అని ఒకరు గాంధీకి సలహా ఇచ్చారు. గాంధీ ఆయన కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ... ’’మీ లాజిక్ ప్రకారం, బంగ్లాదేశ్‌లోని నోవాఖలీకి కూడా నేను వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడికి కూడా నేను ఉత్తరం పంపేవాడిని కదా. కానీ మిత్రమా, అలా చేస్తే పనులు జరగవు" అని అన్నారు.

ఆ ప్రయాణం చాలా క్లిష్టమైనది. కానీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా, గాంధీజీ తన ప్రయాణాన్ని పెద్ద ఇబ్బందిగా భావించలేదు.

స్వాతంత్య్రానికి కేవలం 14 రోజుల ముందు మహాత్మా గాంధీ తొలిసారి రావల్పిండి మీదుగా కశ్మీర్ చేరుకున్నారు. కశ్మీర్‌కు ఆయన చివరి ప్రయాణం కూడా అదే. ఆ ప్రయాణం ప్రారంభానికి ముందు, 1947 జులై 29న ప్రార్థనా సమావేశం సందర్భంగా తాను కశ్మీర్‌‌కు వెళ్తున్నానని గాంధీ చెప్పారు.

"భారత్‌లోనే ఉండేలా కశ్మీర్‌‌ను ఒప్పించేందుకు నేను అక్కడికి వెళ్లడం లేదు. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది కశ్మీర్ ప్రజలు.. అది నేను లేదా మహారాజా తీసుకునే నిర్ణయం కాదు. కశ్మీర్‌కు మహారాజా ఉన్నారు, పౌరులు ఉన్నారు. ఒకవేళ రేపు రాజు మరణించినా, ఆ ప్రజలు అక్కడే ఉంటారు. కశ్మీర్ భవితవ్యాన్ని నిర్ణయించేది వాళ్లే" అని మహాత్మా గాంధీ అన్నారు.
Image copyrightGETTY IMAGESచిత్రం శీర్షికజవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ

1947 ఆగస్టు 1న గాంధీ కశ్మీర్ చేరుకున్నారు. అప్పట్లో ఎన్నడూ లేనంతగా భారీ మొత్తంలో ప్రజలు కశ్మీర్ లోయలో ఒక్కచోటకు చేరుకున్నారు. జీలం నది మీద ఉన్న వంతెన మీద కూర్చునేందుకు కూడా చోటు దొరకనంత మంది వచ్చారు.

ఆ వంతెన మీది నుంచి శ్రీనగర్‌లోకి గాంధీ కారు వెళ్లలేకపోయింది. దాంతో, ఆయన కారు దిగి, బోటులో నదిని దాటి శ్రీనగర్‌కు వెళ్లారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన కశ్మీరీలు, గాంధీ పర్యటన పట్ల ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు.

ఆ సమయంలో షేక్ అబ్దుల్లా జైలులో ఉన్నారు. గాంధీ కోసం బేగం అక్బర్ జెహాన్ అబ్దుల్లా కూడా మర్యాదపూర్వక విందు ఏర్పాటు చేశారు. మహారాజా కూడా తన రాజభవనంలో విందు ఇచ్చారు.

మహారాజా హరి సింగ్, మహారాణీ తారా దేవీ, రాకుమారుడు కరణ్ సింగ్ రాజభవనం నుంచి బయటకు వచ్చి గాంధీకి స్వాగతం పలికారు. దేశీయ వ్యవహారాల గురించి అక్కడ వారు ఏం చర్చించారో తెలియలేదు. కానీ, బేగం అక్బర్ జెహాన్ విందు కార్యక్రమంలో మాత్రం బాపూజీ బాహాటంగానే మాట్లాడారు.
Image copyrightGETTY IMAGES
"ఈ రాచరిక రాజ్యానికి నిజమైన పాలకులు ప్రజలే. వాళ్లు పాకిస్తాన్‌తో వెళ్లాలని అనుకుంటే, వారిని ఏ శక్తీ అడ్డుకోలేదు. కానీ, ప్రజల అభిప్రాయాలను మీరు ఎలా సేకరిస్తారు? ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు అనువైన పరిస్థితులను నెలకొల్పాలి. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించేలా చూడాలి. వారిపై దాడి చేసి, వారి గ్రామాలను, ఇళ్లను తగలబెట్టడం ద్వారా మీరు వారి అంగీకారాన్ని పొందలేరు.

తాము ముస్లింలం అయినప్పటికీ భారతదేశంలోనే ఉండాలని కోరుకుంటున్నామని ఇక్కడి ప్రజలు చెబితే, వారిని ఏ శక్తీ ఆపలేదు. పాకిస్తానీయులు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తే, వారు తమ పాలనను స్థాపించకుండా ఇక్కడి ప్రజలు అడ్డుకోవాలి. పాకిస్తాన్‌ను అడ్డుకోలేకపోతే, అప్పుడు వారు నిందల నుంచి తప్పించుకోలేరు" అని గాంధీ అన్నారు.

భారత విధానాన్ని గాంధీ మరోసారి స్పష్టం చేశారు: "కాంగ్రెస్ ఎప్పుడూ రాచరికానికి వ్యతిరేకమే. అది ఇంగ్లండ్‌లో కావచ్చు, ఇక్కడ కావచ్చు. షేక్ అబ్దుల్లా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటారు, దాని కోసం పోరాడుతున్నారు. మేము ఆయనకు అండగా ఉన్నాం. ఆయన జైలు నుంచి బయటకు రావాలి. ఆ తర్వాత ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఆయనతో చర్చలు జరుపుతాం. కశ్మీర్ ఎటు వెళ్లాలో ఇక్కడి ప్రజలు నిర్ణయిస్తారు" అని గాంధీజీ అన్నారు.

"ఇక్కడి ప్రజలు" అని చెప్పినప్పుడు గాంధీ తన ఉద్దేశాన్ని కూడా స్పష్టం చేశారు: "ఇక్కడి ప్రజలు" అంటే, నేను ముస్లింలు, హిందువులు, కశ్మీరీ పండిట్స్, డోగ్రాలు, సిక్కులను ఉద్దేశించి అన్నాను" అని ఆయన వివరించారు.
Image copyrightGETTY IMAGES

కశ్మీర్‌ విషయంలో భారత్ తన పాత్ర గురించి అధికారికంగా చేసిన ప్రకటన అది. అప్పటికి స్వతంత్ర భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఏర్పడనందున గాంధీ ప్రభుత్వ ప్రతినిధి కాదు.

ఆయన భారత స్వాతంత్ర్య పోరాట విలువలకు పితామహుడు. స్వతంత్ర భారతదేశం పాత్రకు అత్యంత అధికారిక, విశ్వసనీయమైన ప్రతినిధి అన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు.

గాంధీ పర్యటన కశ్మీరీలలో విశ్వాసాన్ని ఎంతగానో పెంచింది. షేక్ అబ్దుల్లా జైలు నుంచి విడుదల, కశ్మీర్ భారత దేశంతోనే ఉంటుందని ఆయన ప్రకటించడం, కశ్మీరీ ముస్లింలను పాకిస్తాన్ నుంచి వేరుచేసేందుకు ఆయన ప్రయత్నించడంలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది.

జవహర్‌లాల్ నెహ్రూ -సర్దార్ పటేల్- షేక్ అబ్దుల్లాలు గాంధీ ప్రశంసలు పొందారు. అలా చరిత్రలో ఓ అధ్యాయం లిఖితమైంది. ప్రస్తుత ప్రభుత్వం దానిని చెరిపివేసేందుకు ప్రయత్నిస్తోంది.

ఆనాటి ప్రక్రియలో ఎలాంటి పాత్రా పోషించని వారు, ఇవాళ దానిని తుడిచేసేందుకు తాము అర్హులమని చెప్పుకొంటున్నారు.

ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. పాకిస్తాన్ తన సైనిక బలంతో కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, భారత్ తిప్పికొట్టింది.

అప్పుడు, మహాత్మా గాంధీ భారత సైనిక చర్యకు మద్దతు ఇచ్చారని మరచిపోకూడదు.

లాల్‌ బహుదూర్‌ శాస్త్రి మరణం: గుండెపోటా? విషప్రయోగమా? 52 ఏళ్లయినా సమాధానం దొరకని ప్రశ్నలు


తెలుగు డెస్క్
బీబీసీ
26 సెప్టెంబర్ 2018

Image copyrightGETTY IMAGESచిత్రం శీర్షికలాల్ బహుదూర్ శాస్త్రి

భారత మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణించి 52 ఏళ్లయినా ఇప్పటికీ ఆయన మృతిపై ముసురుకున్న అనుమానాలకు తెరపడలేదు.

1965లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం తరువాత 1966 జనవరిలో శాస్త్రి అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో భేటీ అయ్యేందుకు అప్పటి సోవియట్ యూనియన్‌లోని తాష్కెంట్ వెళ్లారు. భారత్, పాక్‌ల సంయుక్త ప్రకటనపై ఆయన సంతకం చేసిన కొద్ది గంటల్లోనే మరణించారు.

అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన మరణంపై ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు.

శాస్త్రి మృతిపై విచారణ జరిపేందుకు జనతా పార్టీ హయాంలో రాజ్‌ నారాయణ్ కమిటీని ఏర్పాటుచేసినా ఆ నివేదిక వెలుగు చూడలేదు.

శాస్త్రి మృతికి సంబంధించిన పత్రాలను బయటపెట్టాలని కోరుతూ నవదీప్ గుప్తా అనే సమాచార హక్కు కార్యకర్త గత ఏడాది జులై 14న కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. హోం శాఖ ఆ దరఖాస్తును 'నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా'కు పంపించగా వారు సమాచారం ఇవ్వలేమని సమాధానమిచ్చారు.

దరఖాస్తుదారు దానిపై రెండుసార్లు అప్పీల్ చేసుకున్నా సమాచారం రాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన కమిషన్... పత్రాలను బహిర్గతం చేయాలని ప్రధాన మంత్రి కార్యాలయ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు(సీపీఐవో) సహా విదేశాంగ, హోం శాఖల సీపీఐవోలను ఆదేశించింది.

విచారణ సందర్భంగా వివిధ శాఖలు ఏం చెప్పాయన్నది పేర్కొంటూ, లాల్ బహుదూర్ శాస్త్రి మరణం, కారణాలపై 1966 ఫిబ్రవరి 16న పార్లమెంటు ఉభయ సభల్లో అప్పటి విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనను పొందుపరుస్తూ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు 2018 సెప్టెంబర్ 24న తన తుది ఆదేశాలను వెలువరించారు.

దీంతోపాటు శాస్త్రి కుటుంబీకులు లేవనెత్తిన అనుమానాలను, ప్రముఖ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ రాసిన పుస్తకంలోని అంశాలను, మరికొన్ని పత్రికల్లోని వ్యాసాలను ఉటంకిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు.
ప్రధానమంత్రి లాల్‌ బహదూర్ శాస్త్రి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని కారు కొన్నప్పుడు ఏం జరిగిందంటే..Image copyrightGETTY IMAGESచిత్రం శీర్షికలండన్ పర్యటన సందర్భంగా లాల్ బహుదూర్ శాస్త్రి దంపతులు

శాస్త్రి మరణంపై అనుమానాలు

లాల్ బహుదూర్ శాస్త్రి మరణంపై ఆయన భార్య సహా కుటుంబ సభ్యులు గతంలో అనేకసార్లు అనుమానాలు వ్యక్తంచేశారు.

శాస్త్రితో పాటు తాష్కెంట్ వెళ్లిన ప్రతినిధుల బృందంలో ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ రాసిన పుస్తకంలోనూ పలు అనుమానాస్పద అంశాల ప్రస్తావన ఉంది. వీటితో పాటు శాస్త్రి మరణంపై వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారాన్ని కేంద్ర సమాచార కమిషన్ ఇటీవల వెల్లడించింది.

అందులో ప్రస్తావించిన కొన్ని ముఖ్యాంశాలు..

* తాష్కెంట్ ఒప్పందం జరిగిన మరుసటి రోజు అంటే 1966 జనవరి 11న వేకువజామున 1.20 గంటలకు(తాష్కెంట్ సమయం) శాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. తొలుత ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆర్.ఎన్.చుగ్‌ వచ్చి పరిశీలించారు. అప్పటికే శాస్త్రి తీవ్రమైన దగ్గుతో శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన శాస్త్రికి.. మెప్తెటేయిన్ సల్ఫేట్, మిక్రెనా ఇంజక్షన్లను ఇచ్చారు. అనంతరం 3 నిమిషాలకే శాస్త్రి స్పృహ కోల్పోయారు. కొద్దిసేపట్లోనే ఆయన శ్వాస, గుండె కొట్టుకోవడం మందగించాయి.

* సోవియట్ డాక్టర్ ఇ.జి.యెర్మన్కోతో కలిసి కృత్రిమ శ్వాస ఇచ్చేందుకు డాక్టర్ చుగ్ ప్రయత్నించారు. కానీ, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. శాస్త్రి గుండెపోటు కారణంగా రాత్రి 1.32 గంటలకు మరణించారని వైద్యులు ప్రకటించారు.
'మూగ' ఇందిర 'ఉక్కు మహిళ'గా ఎలా మారారు?Image copyrightGETTY IMAGESచిత్రం శీర్షికకులదీప్ నయ్యర్
కులదీప్ నయ్యర్ ఏం చెప్పారు?

కాగా.. కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు 2018 మే నెలలో కులదీప్ నయ్యర్‌ను కలిసినప్పుడు ఆయన శాస్త్రి మరణానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు.

''శాస్త్రి మరణించారని తెలియగానే అందరం షాకయ్యాం. మాకు అప్పుడు ఏ అనుమానం రాలేదు. కానీ, భారత్‌కు తిరిగివచ్చాక శాస్త్రి భార్య, బంధువులు కీలకమైన అనుమానాలు వ్యక్తం చేశారు. తాష్కెంట్‌లో శాస్త్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలనే ఆలోచన రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయనపై విషప్రయోగం జరిగిందా అనే ప్రశ్నలపై నేనేమీ చెప్పలేను. అయితే, ఆ అనుమానాలు నిరాధారాలు అని కొట్టిపారేయలేం.

శాస్త్రి మృతిపై నిజాలు తేల్చేందుకు ఏర్పాటైన రాజ్ నారాయణ్ కమిటీ ఎదుట సాక్ష్యం చెప్పేందుకు వస్తున్న శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు చుగ్, వ్యక్తిగత సహాయకుడు రాంనాథ్ ఇద్దరూ వేర్వేరుగా రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు.

ఈ రెండు నిజంగా రోడ్డు ప్రమాదాలేనా? శాస్త్రిపై విషప్రయోగం జరిగిందా? అదే నిజమైతే ఆ పని చేసిందెవరూ? నేనేమీ చెప్పలేను.. దీనిపై దర్యాప్తు జరగాలని మాత్రం చెప్పగలను'' అన్నారు.

అంతేకాదు.. కమిషన్ ఈ వ్యవహారంలో 2018 మే 13న మధ్యంతర ఆదేశాలు ఇచ్చిన తరువాత ప్రభుత్వ స్పందనలను కులదీప్ నయ్యర్ ఆసక్తిగా చదివారు. శాస్త్రి మరణంపై సమాచార హక్కు దరఖాస్తు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఆయన్ను మరోసారి కలుసుకుని వివరాలు తెలుసుకోవాలని కమిషన్ అనుకున్నప్పటికీ ఆయన మరణించడంతో అది సాధ్యం కాలేదు.

అయితే, అంతకుముందు ఆయన 'బియాండ్ ద లైన్స్' పేరుతో రాసిన పుస్తకంలో లాల్ బహుదూర్ శాస్త్రి మరణించిన నాటి రాత్రి ఏం జరిగిందో రాశారు.
వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?Image copyrightGETTY IMAGES
'బియాండ్ ద లైన్స్' ఏం చెప్తోంది?

కులదీప్ నయ్యర్ తన 'బియాండ్ ద లైన్స్' పుస్తకంలో అనేక అంశాలను వివరించారు.

''శాస్త్రికి అంతకుముందే రెండుసార్లు గుండెపోటు వచ్చింది. తాష్కెంట్ ఒప్పందం సమయంలో ఆయన చాలా బిజీగా గడిపారు. చాలా తక్కువ సమయం నిద్రపోయారు. ఆ రోజు సాయంత్రం నేను డాక్టర్ చుగ్‌ను కలిశాను. శాస్త్రి ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నారని అడిగాను. అప్పుడు ఆయన ఆకాశంవైపు చూస్తూ అంతా దేవుడి చేతిలోనే ఉంది అని బదులిచ్చారు'' అని కులదీప్ తన పుస్తకంలో ప్రస్తావించారు.

మరణానికి ముందు రోజు రాత్రి శాస్త్రి తనకు కేటాయించిన కాటేజ్‌కు వచ్చారు. తన వ్యక్తిగత సిబ్బందితో మాట్లాడారు.

శాస్త్రి కాటేజ్‌లో వంటగాడికి సహాయంగా ఇద్దరు రష్యన్ మహిళలు ఉండేవారు. వారు ఆ దేశ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందినవారు. శాస్త్రికి ఆహారపదార్థాలు వడ్డించడానికి ముందు వారు వాటిని పరీక్షించేవారు. చివరకు ఆయన తాగే మంచినీటికి కూడా పరీక్షించాకే ఆయనకు ఇచ్చేవారని నయ్యర్ రాసుకొచ్చారు.
‘నేను కేవలం ప్రధానమంత్రిని, ఆమె సంగీత ప్రపంచ మహారాణి’Image copyrightGETTY IMAGES
'ఆయన చనిపోతున్నట్లు కల వచ్చింది'

''ఆ రోజు రాత్రి శాస్త్రి చనిపోతున్నట్లు కల వచ్చింది. నేనున్న గది తలుపుకొట్టినట్లు అనిపించడంతో హఠాత్తుగా లేచాను. కారిడార్‌లో ఒక మహిళ.. 'మీ ప్రధానమంత్రి మృత్యువు ముంగిట ఉన్నారు' అని చెప్పింది. నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా దుస్తులు తొడుక్కుని ఒక భారతీయ అధికారిని వెంట తీసుకుని శాస్త్రి ఉన్న చోటికి వెళ్లాను.

అక్కడ వరండాలో సోవియట్ ప్రధాని అలెక్సీ కోస్జిన్ నిల్చున్నారు. నన్ను చూడగానే.. శాస్త్రి ఇక లేరు అన్నట్లుగా చేతులతో సంజ్ఞ చేశారు. ఆ వెనుక ఉన్న భోజనాల గదిలో కొందరు వైద్యులు శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు ఆర్.ఎన్.చుగ్‌ను వివరాలు అడుగుతున్నారు.

ఆ పక్కనే శాస్త్రి గది ఉంది. ఆ విశాలమైన గదిలోని మంచంపై శాస్త్రి అచేతనంగా పడి ఉన్నారు. ఆ పెద్ద మంచంపై శాస్త్రి శరీరం ఒక భారీ డ్రాయింగ్ బోర్డుపై చిన్న చుక్కలా కనిపించింది నాకు. మంచం పక్కనే నేలపై ఆయనపై పాదరక్షల పొందికగా అమర్చినట్లు ఉన్నాయి. ఆయన వాటిని ఉపయోగించిన ఆనవాళ్లేమీ కనిపించలేదు. కానీ, ఆ పక్కనే ఉన్న టేబుల్‌పై మాత్రం థర్మాస్ ప్లాస్క్ పడిపోయి కనిపించింది. ఆయన దాన్ని తెరవడానికి ఎంతో ప్రయత్నించినట్లుగా అనిపించింది. సహాయకులను పిలవడానికి వీలుగా గదిలో బజర్ వంటిదేమీ లేదు.

పక్కనే టేబుల్‌పై శుభ్రంగా మడతపెట్టి ఉన్న భారత జాతీయ పతాకాన్ని మా అధికారిక ఫొటోగ్రాఫర్, నేను కలిసి ఆయనపై కప్పాం. అక్కడున్న పుష్పాలను ఆయనపై ఉంచి నివాళులర్పించాం.

అక్కడి నుంచి నేను శాస్త్రి సహాయకులతో మాట్లాడడానికి వెళ్లాను. అర్ధరాత్రి సమయంలో శాస్త్రి తమ గది తలుపు కొట్టి తాగడానికి నీరు అడిగారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి జగన్నాథ్ సహాయి చెప్పారు. ఆ తరువాత సహాయి, ఇద్దరు స్టెనోగ్రాఫర్లు కలిసి శాస్త్రిని తిరిగి ఆయన గదికి చేర్చినట్లు చెప్పారు.

ఆ తరువాత పక్కనే ఉన్న గదిలో జనరల్ కుమారమంగళం భారత్‌లోని అధికారులకు ఫోన్‌లో(దిల్లీ, తాష్కెంట్ మధ్య ఏర్పాటుచేసిన హాట్‌లైన్లో) సూచనలిస్తున్నారు.. శాస్త్రి మృతదేహం భారత్ చేరుకునేటప్పటికి చేయాల్సిన ఏర్పాట్ల గురించి వారితో చర్చించారు. ఆయన మాట్లాడడం పూర్తయ్యాక నేను రిసీవర్ అందుకుని.. అక్కడి ఆపరేటర్‌కు యూఎన్‌ఐ విలేఖరి నంబర్ ఇచ్చాను.

అప్పటికి అక్కడ సుందర్ ధింగ్రా అనే ఆపరేటర్ విధుల్లో ఉన్నారు. ఆయనకు ఏం చేయాలో చెప్పాను.. 'లాల్‌బహుదూర్ శాస్త్రి మరణించారు' అనే ఫ్లాష్ న్యూస్ పంపించమని చెప్పాను. అప్పటికే అర్ధరాత్రి దాటడంతో వార్తాపత్రికల ముద్రణకు వెళ్లే సమయం దాటిపోయింది. నా మాట వినగానే ధింగ్రా గట్టిగా నవ్వారు.. అంతకుముందు శాస్త్రి పాల్గొన్న కార్యక్రమంలో చేసిన ఉపన్యాసాన్ని ఇంకా అప్పుడే పూర్తిచేశానని చెప్పారు. సమయం వృథా చేయకుండా వెంటనే ఫ్లాష్ న్యూస్ పంపించమని నేను మళ్లీ చెప్పినప్పటికీ ఆయన నమ్మకపోవడంతో కాస్త గట్టిగా చెప్పాను. దాంతో ఆయన నేను చెబుతున్నది నిజమేనని తెలుసుకుని పత్రికా కార్యాలయాలకు ఫోన్లు చేశారు. చాలా పత్రికలు ముద్రణ ఆపి ఈ వార్తను పతాక శీర్షికగా ప్రచురించాయి.

అక్కడి నుంచి పక్కనే వై.బి.చవాన్, స్వరణ్ సింగ్‌లు ఉన్న గదికి వెళ్లాను. అక్కడ వారిద్దరూ శాస్త్రి తరువాత ప్రధాని ఎవరవుతారని చర్చించుకుంటున్నారు. నన్ను చూడగానే నన్నూ అదే ప్రశ్న అడిగారు స్వరణ్ సింగ్. శాస్త్రి బతికున్నప్పుడు తన తరువాత చవాన్ ప్రధాని కావాలనుకున్నారని.. ఆయన మరణిస్తే ఇందిరాగాంధీ ప్రధాని అవుతారని అనుకున్నారని చెప్పాను'' అని రాశారు.
ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంతImage copyrightGETTY IMAGESచిత్రం శీర్షిక1966 జనవరి 10 తాష్కెంట్ ఒప్పందం నాటి చిత్రం: అప్పటి భారత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్, సోవియట్ ప్రధాని అలెక్సీ కోస్టిన్
గుండెపోటా? విషప్రయోగమా?

అక్కడి నుంచి మళ్లీ శాస్త్రి సహాయకుల గదికి వెళ్లి అసలేం జరిగిందో కనుక్కునే పని ప్రారంభించాను. వారితో మాట్లాడాక తెలిసిందేంటంటే... వీడ్కోలు వేడుకలో పాల్గొన్నాక శాస్త్రి రాత్రి 10 గంటలకు తన గదికి చేరుకున్నారు. జగన్నాథ్ సహాయి, శాస్త్రి సేవకుడు రామ్ నాథ్, మరికొందరు సహాయకులు ఆయనతో వచ్చారు.

పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తేనీటి విందుకు ఆహ్వానించినట్లు వారికి తెలియడంతో వారు శాస్త్రిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. పాకిస్తాన్ హాని తలపెట్టే ప్రమాదముందని జాగ్రత్తగా ఉండాలని శాస్త్రికి వారు సూచించారు.

ఇండియా-పాకిస్తాన్ యుద్ధ సమయంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బల్వంత్‌రాయ్ మెహతా ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానాన్ని పాకిస్తాన్ కూల్చేసిన ఘటనను జగన్నాథ్ సహాయి గుర్తు చేసుకున్నారు.

అయితే, శాస్త్రి వారి ఆందోళనను కొట్టిపారేసి.. అయూబ్ ఖాన్ మంచివారని చెబుతూ రాయబారి టి.ఎన్.కౌల్ ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని తన కోసం తెమ్మని రామ్‌నాథ్‌ను పురమాయించారట. ఆ భోజనాన్ని కౌల్ వంటమనిషి జన్ మొహమ్మద్ తయారుచేశారు. శాస్త్రి చాలా కొంచెమే తిన్నారని.. తింటున్న సమయంలో దిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని జగన్నాథ్ చెప్పారు. ఆ ఫోన్ దిల్లీలో ఉన్న శాస్త్రి మరో సహాయకుడు వెంకటరామన్ నుంచి వచ్చింది. తాష్కెంట్ ఒప్పందంపై మంచి స్పందన వచ్చిందని.. కానీ, కుటుంబసభ్యులు మాత్రం సంతోషంగా లేరని చెప్పారాయన. అంతేకాదు... ప్రజా సోషలిస్ట్ పార్టీ నేత సురేంద్ర నాథ్ ద్వివేదీ, జనసంఘ్ నేత అటల్ బిహారీ వాజ్‌పేయిలు కూడా హాజీపూర్, టిత్వాల్ నుంచి సేనలను ఉపసంహరించాలన్న నిర్ణయాన్ని తప్పు పట్టినట్లుగా చెప్పారు. అయితే.. శాస్త్రి దానికి స్పందిస్తూ ఒప్పందాన్ని విమర్శించడమే ప్రతిపక్షాల పని అన్నారట.

ఆ తరువాత జగన్నాథ్.. 'రెండు రోజులుగా మీరు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు. ఫోన్ కలపమంటారా' అని అడగ్గా తొలుత వద్దని చెప్పిన శాస్త్రి ఆ వెంటనే మనసు మార్చుకుని చేయమని చెప్పారు. అప్పుడు తాష్కెంట్లో సమయం దాదాపు 11 గంటలైంది(దిల్లీలో సుమారు 11.30 గంటలు). మొదట ఆయన అల్లుడు వి.ఎన్.సింగ్ మాట్లాడిన తరువాత శాస్త్రికి ఎంతో ఇష్టమైన పెద్ద కుమార్తె కుసుమ్‌కు(వి.ఎన్.సింగ్‌కు వదిన) ఫోన్ ఇచ్చారు. తాష్కెంట్ ఒప్పందంపై ఆయన ఆమె అభిప్రాయాన్ని కోరగా ఆమె తనకు నచ్చలేదని చెప్పారు. ఆ వెంటనే అమ్మ ఏమంటోంది అని ప్రశ్నించగా.. తనకూ ఇష్టం లేదని చెబుతుంది కుసుమ్. ఆ తరువాత భార్య లలితా శాస్త్రితోనూ ఆయన మాట్లాడారు.

ఆ సంభాషణలు శాస్త్రిని అసంతృప్తికి గురిచేశాయని జగన్నాథ్ సహాయి చెప్పారు. ఫోన్లో మాట్లాడిన తరువాత ఆయన గదిలోనే అటూఇటూ పచార్లు చేశారని.. దిల్లీలో ఇంటికి వచ్చినవారితో మాట్లాడాక కూడా ఆయన ఇలాగే అటూఇటూ నడుస్తారని జగన్నాథ్ చెప్పారు. అప్పటికే రెండు సార్లు హార్ట్ అటాక్‌ వచ్చిన ఆయనపై ఆ సంభాషణ, పత్రికల్లో వస్తున్న విమర్శలు ఒత్తిడికి గురిచేసి ఉండొచ్చు.

అనంతరం రామ్‌నాథ్ పాలు తెచ్చి ఇచ్చారు. తాను అక్కడే నేలపై పడుకుంటానని రామ్‌నాథ్ చెప్పినప్పటికీ వద్దు నీ గదికి వెళ్లి పడుకోమని శాస్త్రి చెప్పడంతో ఆయన పైనున్న తన గదికి వెళ్లిపోయారు.

ఉదయాన్నే కాబూల్ వెళ్లాల్సి ఉండడంతో సామాన్లు సర్దుకుంటుండగా రాత్రి 1.20 గంటల సమయంలో శాస్ర్తి తమ గది తలుపు కొట్టారని జగన్నాథ్ గుర్తు చేసుకున్నారు. రాగానే డాక్టర్ ఎక్కడున్నారని అడిగారని.. తీవ్రమైన దగ్గుతో మెలికలు తిరిగిపోతుండడంతో ఆయన గదికి తీసుకెళ్లి పడుకోబెట్టి మంచి నీళ్లు ఇచ్చినట్లు జగన్నాథ్ చెప్పారు. ఆ వెంటనే శాస్త్రి ఛాతీపై చేయి పెట్టుకుని అచేతన స్థితిలోకి వెళ్లిపోయారని జగన్నాథ్ గుర్తు చేసుకున్నారు.

అంతలో ఆయన వ్యక్తిగత వైద్యుడు చుగ్ వచ్చి శాస్త్రి నాడి పట్టుకుని చూసి 'బాబూజీ! మీరు నాకు ఏమాత్రం సమయం ఇవ్వలేదు' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చేతికి ఒక ఇంజక్షన్ ఇచ్చి ఆ తరువాత ఛాతీకి మరో ఇంజక్షన్ ఇచ్చినా ఎలాంటి స్పందనా లేకపోవడంతో చివరి ప్రయత్నంగా నోటి ద్వారా శ్వాస అందించే ప్రయత్నమూ చేశారు. అవేమీ ఫలితమివ్వకపోవడంతో ఇంకా వైద్యులను పిలిపించాలని జగన్నాథ్‌కు ఆయన సూచించారు. కొద్ది నిమిషాల్లోనే వైద్య బృందం వచ్చి అప్పటికే శాస్త్రి మరణించినట్లు నిర్ధారించింది. తాష్కెంట్ సమయం ప్రకారం 1.32 గంటలకు(దిల్లీ సమయం 2.00 గంటలు) ఆయన మరణించినట్లుగా ప్రకటించారు.
వాజ్‌పేయి: అటల్‌తో పీవీ, కలాం, మోదీ, సోనియా, చంద్రబాబు, జయలలిత, కరుణImage copyrightGETTY IMAGESచిత్రం శీర్షికజుల్ఫికర్ అలీ భుట్టో
'ఇద్దరిలో ఎవరు చనిపోయారు?' భుట్టో వేసిన ఈ ప్రశ్నకు అర్థమేంటి?

వేకువన 4 గంటలకు పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్ వచ్చి నన్ను చూసి 'భారత్-పాక్ మధ్య శాంతి కోసం ఈ మనిషి ప్రాణాలర్పించారు' అన్నారు. ఆ తరువాత ఆయన పాక్ పాత్రికేయులతో మాట్లాడుతూ.. శాస్త్రి బతికుంటే రెండు దేశాల మధ్య సమస్యలు పరిష్కారమయ్యేవి అని చెప్పారు.

అయితే, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి అజీజ్ అహ్మద్... అప్పటి విదేశాంగ మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోకు ఫోన్ చేసి శాస్త్రి మరణవార్త చెప్పగా సగం నిద్రలో ఉన్న ఆయన 'చనిపోయారు' అన్నది మాత్రమే విని 'ఇద్దరిలో ఎవరు?' అని ప్రశ్నించారు.

నేను తాష్కెంట్ నుంచి తిరిగొచ్చాక లలితా శాస్త్రి(శాస్త్రి సతీమణి) ఆయన శరీరం ఎందుకు నీలంగా ఉందని నన్నడిగారు. మృతదేహాలకు ఎంబాల్మింగ్ చేశాక నీలం రంగులోకి మారుతాయని అక్కడ చెప్పారని ఆమెతో చెప్పాను నేను. మరి ఒంటిపై ఉన్న ఆ గాయాలేంటని అడిగారామె. మృతదేహాన్ని చూడకపోవడంతో నాకు వాటి సంగతి తెలియదని చెప్పాను.

అంతేకాదు.. శాస్త్రి భౌతిక కాయానికి పోస్టు మార్టం నిర్వహించకపోవడంపైనా కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తంచేశారు. శాస్త్రిది సహజ మరణం కాదని ఆరోపిస్తూ చేసిన ఒక ప్రకటనపై సంతకాలు చేయాలని కోరగా ఆయన ఇద్దరు సహాయకులు అందుకు నిరాకరించడంపైనా లలితా శాస్త్రి ఆగ్రహంతో ఉన్నట్లు అక్కడికి కొద్ది రోజుల తరువాత నాకు తెలిసింది.

కామరాజ్ నాకు ఫోన్ చేసి శాస్త్రి మరణంపై ఎక్కడా మాట్లాడొద్దని సూచిస్తూ ఆయన కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత ఆ కుటుంబం ఉండేందుకు గృహవసతి, జీవనభృతి కల్పిస్తూ తీర్మానించారు.

విషప్రయోగం వల్లే శాస్త్రి మరణించారన్న అనుమానం ఆయన కుటుంబసభ్యుల్లో మరింత బలపడింది. ఆయన వ్యక్తిగత సేవకుడు రామ్‌నాథ్ కాకుండా టి.ఎన్.కౌల్ వంటమనిషి జన్ మొహమ్మద్ ఆ రోజు వంట చేయడంపై వారు అసంతృప్తి, అనుమానంతో ఉన్నారు. 1965లో శాస్త్రి మాస్కోలో పర్యటించినప్పుడూ జన్ మొహమ్మదే వంట చేశారు. కాగా.. శాస్త్రి మరణంపై విచారణ జరిపించాలంటూ 1970లో ఆయన జయంతి రోజున(అక్టోబర్ 2) లలితా శాస్త్రి కోరారు.

అదే నెలలో మొరార్జీ దేశాయిని శాస్త్రిది సహజ మరణం కాదని మీరు నమ్ముతున్నారా అని నేను ప్రశ్నించగా.. ఆయన.. 'అదంతా రాజకీయం. ఇందులో ఎలాంటి కుట్రా లేదు. ఆయన గుండెపోటుతో చనిపోయారు. ఆయన వైద్యుడు, సెక్రటరీతో మాట్లాడి నేను నిర్ధారించుకున్నాను' అని చెప్పారు'' అని కులదీప్ తన పుస్తకంలో ఆ నాటి ఘటనలను రాశారు.
హిందూమతం అంటే ఏమిటి? చరిత్ర ఏం చెప్తోంది?
సంజయ్ గాంధీకి చరిత్ర అన్యాయం చేసిందా?Image copyrightGETTY IMAGES
పోస్ట్‌మార్టం చేయకపోవడంపై..

కులదీప్ నయ్యర్ పుస్తకంలోని అంశాలు, శాస్త్రి కుటుంబ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలతో 2012లో 'అవుట్ లుక్'లో ఒక వ్యాసం ప్రచురితమైంది. అందులో.. శాస్త్రి మృతికి సంబంధించిన వెల్లడించాలని కోరుతూ దాఖలైన సమాచార హక్కు దరఖాస్తును ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించినట్లుగా పేర్కొన్నారు. శాస్త్రి మృతికి సంబంధించి రెండు దేశాల రాయబార కార్యాలయాల మధ్య జరిగిన సంప్రదింపుల పత్రాలు కోరుతూ అనూజ్ ధర్ అనే వ్యక్తి 2009లో ఈ దరఖాస్తు చేశారు.

శాస్త్రి మరణంపై సమాధానం దొరకని ప్రశ్నలున్నాయంటూ అవుట్‌లుక్ వ్యాసంలో కొన్ని ప్రస్తావించారు. అవి..

* శాస్త్రి మరణం తరువాత ఒక రష్యన్ వంటగాడిని సోవియట్ అధికారులు అరెస్టు చేశారు. అయితే, 5 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించి ఆ తరువాత వదిలేశారు.

* విష ప్రయోగం జరిగిందని ప్రాథమికంగా అనుమానాలు ఉన్నప్పటికీ ఆయన మృతదేహానికి తాష్కెంట్‌లో కానీ, భారత్‌లో కానీ పోస్ట్‌మార్టం నిర్వహించలేదు.

* శాస్త్రి కుటుంబసభ్యులు అనేకసార్లు అనుమానాలు వ్యక్తంచేసినా దర్యాప్తు చేయలేదు.

* ఎమర్జెన్సీ తరువాత జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాస్త్రి మరణంపై దర్యాప్తు కోసం రాజ్‌నాథ్ కమిటీ నియమించారు. కమిటీ నివేదిక ఇవ్వనప్పటికీ దర్యాప్తు ప్రక్రియ ప్రారంభించింది. కానీ, దీనికి సంబంధించి పార్లమెంటు లైబ్రరీలో ఎలాంటి పత్రాలు లేవు.

* ఈ కమిటీ ముందు వివరాలు చెప్పడానికి వస్తుండగానే శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు చుగ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా... వ్యక్తిగత సహాయకుడు రామ్‌నాథ్ కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గతం మర్చిపోయారు.(అయితే... కమిటీ ఎదుట హాజరవడానికి వెళ్లడానికి ముందు రామ్‌నాథ్ శాస్త్రి సతీమణిని కలిశారు. ''చాలా రోజులుగా మనసులో ఈ భారమంతా మోస్తున్నాను. ఈ రోజు మొత్తం చెప్పేస్తాను'' అని చెప్పారని కుటుంబీకులు వెల్లడించారు.)
‘ముక్కు నుంచి రక్తం, ఒంటిపై గాయాలు’ - అనిల్ శాస్త్రి

లాల్ బహుదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి తన తండ్రి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. తన తండ్రి మృతికి సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేయాలని ఆయన 2015లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరారు. సీఎన్ఎన్ ఐబీన్ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్.. తన తండ్రి మృతిపై అనేక అనుమానాలు లేవనెత్తారు.

'నాన్న మృతదేహం దిల్లీ విమానాశ్రయానికి వచ్చినప్పుడు చూస్తే ఆయన శరీరం నీలిరంగులో కనిపించింది. ముఖంపై తెల్లమచ్చలు కనిపించాయి. ఉజ్బెకిస్తాన్‌లో భారత్ ప్రధాని ఉండే రూంలో కాలింగ్‌బెల్ కూడా ఉండదా, ఫోన్ ఉండదా, కనీసం చూసుకునే వారు కూడా ఉండరా? నమ్మశక్యంగా లేదు' అని ఆయన వ్యాఖ్యానించారు.

భారత దౌత్య కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన తండ్రి మరణించారంటూ అనిల్ ఆరోపించారు.

షిప్పింగ్ వ్యాపారి ధరమ్ తేజ్ కుంభకోణం గురించి నాన్నకు తెలుసు. శాస్త్రి చనిపోయన సమయంలో ధరమ్ తేజ్ కూడా తాష్కెంట్‌లోనే ఉన్నారని కుశ్వంత్ సింగ్ కథనం రాశారని ఆయన పేర్కొన్నారు.

తన తాతతో పాటు అమ్మమ్మ కూడా విదేశీ పర్యటనలకు వెళ్లేవారని.. కానీ, రష్యా పర్యటనకు ఆమె వెళ్లలేదని శాస్త్రి మనవడు సంజయ్ అన్నారు.

తాష్కెంట్‌లో హోటల్ బుక్ చేయాలనుకున్నారు. అయితే, ఆయనకు సోవియట్ ప్రభుత్వం ఒక కాటేజ్ కేటాయించింది. అందులో టెలీప్రింటర్, టెలిఫోన్ కూడా లేవు.

మృతదేహం దిల్లీకి వచ్చినప్పుడు చూస్తే ఆయన నోరు, ముక్కు నుంచి రక్తం కారడం కనిపించింది. ఆయన ఒంటిపై గాట్లు ఉన్నాయి. అమ్మమ్మ నెయ్యిలో ఆయన చేతులను ముంచింది. పెదాలకు నెయ్యి పూసింది. అప్పుడు నెయ్యి నీలిరంగులో కనిపించింది. ఆయన వ్యక్తిగత డైరీ, ఆయన రోజువారి కార్యక్రమాలను రాసుకొనే యాక్షన్ ప్లాన్ పుస్తకం కనిపించలేదు అని సంజయ్ తెలిపారు.
దళిత, మైనారిటీలలో పేదరికం వేగంగా తగ్గుతోంది. కానీ...Image copyrightGETTY IMAGESచిత్రం శీర్షికహిట్లర్‌తో సుభాష్ చంద్రబోస్
నేతాజీ అదృశ్యానికి, శాస్త్రి మరణానికి సంబంధం ఉందా?

మరోవైపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం, శాస్త్రి మరణం మధ్య సంబంధం ఉందంటూ.. దీనికి సంబంధించి పలు ప్రశ్నలు లేవనెత్తుతూ సుప్రీంకోర్టు న్యాయవాది అనూప్ బోస్ 'ట్రాజిక్ డెత్ ఆఫ్ లాల్ బహుదూర్ శాస్త్రి అండ్ ది మిస్టిఫైయింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యాంగిల్' పేరుతో రాసిన వ్యాసంలో చర్చించారు. ఈ వ్యాసం 2016 డిసెంబరు 7న లా జెడ్ మ్యాగజీన్‌లో ప్రచురితమైంది.

శాస్త్రి.. నేతాజీకి వీరాభిమాని. ఫజియాబాద్‌లో ఉన్న గుమ్నామీ బాబా సుభాష్ చంద్రబోసేనని వస్తున్న వదంతులపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. నెహ్రూ చనిపోయినప్పుడు ఆయనకు నివాళి అర్పించేందుకు నేతాజీ వచ్చారని చాలామంది భావిస్తుంటారు.

ప్రముఖ బ్లాగర్ కెప్టెన్ అజిత్ వడాకయిల్ కథనం ప్రకారం.. శాస్త్రికి సమాచారం ఇచ్చాకే నెహ్రూ చివరి చూపులకు నేతాజీ వచ్చారు.
ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?

2015 డిసెంబర్ 12న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం.. బ్రిటిష్ నిపుణుడు నెయిల్ మిల్లర్ ఒక ఫోరెన్సిక్ ఫేస్ మ్యాపింగ్‌ నివేదికలో తాష్కెంట్ పర్యటన ఫొటోలను పరిశీలించి అందులో ఒక వ్యక్తి సుభాష్ చంద్రబోస్ పోలికలతో ఉన్నట్లు తెలిపారు.

శాస్త్రి తన మరణానికి ముందు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినప్పుడు ఒక ప్రత్యేక వ్యక్తిని కలవబోతున్నట్లు చెప్పారు.

జీ 24 గంట న్యూస్ చానెల్ ఇంటర్వ్యూలో శాస్త్రి కుమారుడు సునీల్ మాట్లాడుతూ, ఒక ప్రత్యేక వ్యక్తిని కలుసుకోబోతున్నానని అప్పుడు నాన్న చెప్పారు. బహుశా ఆయన నేతాజీనే కావొచ్చు? 26 జనవరి 1966న గణతంత్ర దినోత్సవానికి నేతాజీని ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలనుకొని ఉండొచ్చు అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణలో ఎందుకు కలవాలనుకుంటున్నారు


కేసీఆర్, కేటీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఫొటోలతో బ్యానర్ ఏర్పాటు చేసిన మహారాష్ట్ర నాయకులు
మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లాలోని నయ్‌గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్‌గావ్ నియోజకవర్గాలకు చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు.

"తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మా గ్రామాల్లోనూ అమలు చేయాలి. అలా చేయలేకపోతే మా గ్రామాలను తెలంగాణలో కలపాలి" అనే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు వారు చెప్పారు. ఆ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు వివరించి, తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని వారు కోరారు.

తాము టీఆర్‌ఎస్‌ టికెట్‌పై మహారాష్ట్రలో పోటీ చేసేందుకు కూడా సిద్ధమని తెలిపారు. 'మా గ్రామాలన్నీ తెలంగాణ గ్రామాలకు ఆనుకునే ఉన్నాయి. కానీ, మా గ్రామాల పరిస్థితి, తెలంగాణ గ్రామాల పరిస్థితి చాలా భిన్నంగా ఉంది" అని వారు చెప్పారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దు వెంట మహారాష్ట్రలో ఉన్న గ్రామాలలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? రాజకీయ నాయకులు ఏమంటున్నారు? అన్న విషయాలను తెలుసుకునేందుకు బీబీసీ క్షేత్రస్థాయిలో పర్యటించింది.

హైదరాబాద్ నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులోని ధర్మాబాద్ తాలూకా సహా... 5 నియోజకవర్గాలలోని పలు గ్రామాల ప్రజలతో, రాజకీయ నాయకులతో బీబీసీ మాట్లాడింది.

కశ్మీర్‌లో ఒక్కసారే పర్యటించిన గాంధీ.. అప్పుడు ఆయన ఏమన్నారు?
నరేంద్ర మోదీ 'ఫాదర్ ఆఫ్ ఇండియా': అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్
ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
"ఇక్కడ మాకు ప్రతిదీ సమస్యే. రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మీరే చూస్తున్నారు కదా" అని నయ్‌గావ్‌ నియోజకవర్గానికి చెందిన గంగాధర్ అన్నారు.

"మా ప్రాంతంలో గ్రామాలకు సరిగా రోడ్లు లేవు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు" అని డెగ్లూర్ నియోజకవర్గానికి చెందిన చిన్నా రెడ్డి చెప్పారు.

"నీటి సమస్య ఉంది. నాలాలు శుభ్రం చేయరు. రోడ్లు బాగుండవు" అని బోకర్ ప్రాంతానికి చెందిన గణపతి రావు చెప్పారు.

మహారాష్ట్ర ఎన్నికలు: శివసేన-బీజేపీలకు కాంగ్రెస్, ఎన్సీపీ పోటీ ఇవ్వగలవా
కాళేశ్వరం ప్రాజెక్ట్: జాతికి అంకితం చేసిన కేసీఆర్... హాజరైన గవర్నర్, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు
డెగ్లూర్ నియోజకవర్గానికి చెందిన రాజు మాత్రం తమకు సమస్యలేమీ లేవని అన్నారు.

"గతంలో సమస్యలు ఉండేవి. కానీ, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంతో సమస్యలేమీ లేవు. అంతా బాగా ఉంది. మా మహారాష్ట్ర కూడా అభివృద్ధి అవుతుంది" ఆయన వివరించారు.

"సరైన వైద్య సదుపాయాలు లేవు. కరెంటు, విద్య, ఇవన్నీ ఇక్కడ సమస్యలే" అని కిన్వట్‌కు చెందిన సూర్యవంశీ గజానంద్ చెప్పారు.

"మహారాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న కోపం ఏంటంటే, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారు. కానీ, ఆ పథకాల ప్రయోజనాలు అందాల్సిన వారికి అందవు" అని బోకర్‌‌ నియోజకవర్గం వాసి స్వరూప అన్నారు.

'మా అమ్మను, తోబుట్టువులను నా ముందే చంపేశారు.. చనిపోయినట్లు నటించి నేను బయటపడ్డా'
బీబీసీ రివర్ స్టోరీస్: ‘సత్లెజ్ నదిలో ఇసుక మైనింగ్‌ వల్ల పంటలకు నీళ్లు లేకుండాపోయాయి...’
మహారాష్ట్ర సీఎం ఏం చేస్తున్నారు?

ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అజెండాగా టీఆర్‌ఎస్ పార్టీ టికెట్‌పై ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న స్థానిక నాయకులతో బీబీసీ మాట్లాడింది.

"సరిహద్దులో ఉండటంతో మమ్మల్ని పట్టించుకునేవారు లేరు. తెలంగాణను కేసీఆర్ అంత అభివృద్ధి చేసినప్పుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? కేంద్రంలోనూ వారి ప్రభుత్వమే ఉంది కదా" అని బాబ్లీ సర్పంచ్ బాబురావు గణపతిరావు కదమ్ ప్రశ్నించారు.

"మా తాలూకా మాత్రమే కాదు, సరిహద్దులో ఉన్న అన్ని తాలూకాల్లోనూ నాయకుడిగా నిలబడి ప్రజలందరికీ సౌకర్యాలు అందేలా చూడాలని కేసీఆర్ నాకు సూచించారు. కేసీఆర్ చెప్పడంతోనే (ఎన్నికల) పనిలో దిగాము" అని బాబురావు గణపతిరావు చెప్పారు.

"ఇక్కడ టీఆర్‌ఎస్ పోటీ చేయడం వల్ల, నాకు తెలిసి పెద్దగా ఏం జరగదు. ఓట్లను చీల్చడం తప్పితే, ఆ పార్టీ గెలిచే అవకాశాలైతే లేవు. కాబట్టి టీఆర్‌ఎస్ పార్టీ ఒక స్పాయిలర్‌గా వచ్చి మహారాష్ట్రలో బీజేపీని బలపరిచే పని చేయటానికి ఇష్టపడదు అనుకుంటున్నా. టీఆర్‌ఎస్ పార్టీకి ప్రాధాన్యతలు ఏంటో తెలుసు. ఒక స్పాయిలర్‌గా కాకుండా మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిస్తే ఇంకా మంచిది" అని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ అన్నారు.

అమితాబ్ బచ్చన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు... అసలు ఎవరీ ఫాల్కే, ఈ అవార్డు ఎందుకిస్తారు
బీబీసీ కథనానికి స్పందన: గుర్రంపై టీచర్ వెళ్తున్న ఊరిలో పాఠశాల నిర్మిస్తామన్న ఐటీడీఏ పీవో
టీఆర్‌ఎస్ పోటీపై ఏమంటున్నారు?
"ఇది ఒక పొలిటికల్ స్టంట్ కూడా అయి ఉండవచ్చు. ఇక్కడ చాలా మంచి అభివృద్ధి పథకాలు ఉన్నాయి. అందరికి ప్రయోజనాలు అందుతున్నాయి. కాబట్టి, తెలంగాణలోని టీఆర్‌ఎస్ పార్టీ ఇక్కడికి వచ్చి ఎన్నికలలో పోటీ ఇవ్వలేదు" అని శివసేన నేత కునాల్ నాగర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇక్కడ కూడా అమలు చేయాలన్న నినాదంతో టీఆర్‌ఎస్ తరఫున బరిలోకి దిగేందుకు స్థానిక నాయకులు సిద్ధమవుతున్నారు. దీని గురించి ఇక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్నది తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధులు ప్రయత్నించారు.

"టీఆర్‌ఎస్ ఇక్కడ పోటీ చేయడం చాలా మంచిది" అని నయ్‌గావ్‌కు చెందిన గంగాధర్ అన్నారు.

"అంతటా పోటీ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది. కేవలం సరిహద్దు వెంట ఉన్న ఒకటి రెండు నియోజకవర్గాలలో నిలబడితే ఏం ఫలితం ఉంటుంది?" అని డెగ్లూర్ వాసి చిన్నా రెడ్డి ప్రశ్నించారు.

"టీఆర్‌ఎస్‌ వాళ్లను ముందు తెలంగాణను బాగు చేసుకోమనండి. ఆ తర్వాత మా మహారాష్ట్ర వైపు రమ్మనండి" అని రాజు అన్నారు.

చిత్రం శీర్షిక
స్వరూప
భిన్నాభిప్రాయాలు
"తెలంగాణ అధికారులు ప్రజలతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ, సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడి అధికారులు మాత్రం పక్కకు పో అని కసురుకుంటారు" అని హథ్‌గావ్‌ నియోజకవర్గానికి చెందిన కమలా భాయ్ చెప్పారు.

"మహారాష్ట్రలో మాకు ఏమీ తక్కువ లేదు. మా ప్రభుత్వం అన్నీ ఇస్తోంది" అని బోకర్ నియోజకవర్గానికి చెందిన గణపతి రావు అన్నారు.

"మా ఎమ్మెల్యేను గెలిపించుకుని రోడ్ల కోసం పోరాడుతాం. మాకు తెలంగాణ వాళ్లు ఏమీ అవసరం లేదు" అని నయ్‌గావ్‌ వాసి శివాజీ వ్యాఖ్యానించారు.

కిన్వట్‌కు చెందిన సూర్యవంశీ గజానంద్ మాత్రం... "మేము మహారాష్ట్రలో కాకుండా, తెలంగాణలో ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నాం. నేను ఒక్కడిని కాదు. మా దగ్గర చాలామంది అలాగే అనుకుంటున్నారు" అని చెప్పారు.

"మహారాష్ట్ర ప్రభుత్వ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ఆ పథకాలను లబ్ధిదారులకు అందేలా చేస్తే చాలు" అని స్వరూప అన్నారు.
                                                                   -రిపోర్టింగ్: దీప్తి బత్తిని, షూట్ ,ఎడిట్: సంగీతం ప్రభాకర్
                                                                                                       బీబీసీ ప్రతినిధులు

ఫోర్బ్స్‌ అత్యుత్త్తమ జాబితాలో 17 భారత కంపెనీలు.

  3వ స్థానంలో ఇన్ఫోసిస్‌                                   25 Sep, 2019.                                                 న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ ఉత్తమ కంపెనీల జాబితాలో 17 భారత కంపెనీలు స్థానం సంపాదించాయి. ‘వరల్డ్‌ బెస్ట్‌ రిగార్డెడ్‌ కంపెనీస్‌’ పేరిట విడుదల చేసిన తాజా జాబితాలో దేశీ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ ఏకంగా 3వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోలి్చతే 31 స్థానాలను మెరుగుపరుచుకుంది. ఇతర భారత కంపెనీల్లో టాటా స్టీల్‌ (105), ఎల్‌ అండ్‌ టీ(115), మహీంద్రా అండ్‌ మహీంద్రా (117), హెచ్‌డీఎఫ్‌సీ (135), బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ (143), పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (149), స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (153) ), హెచ్‌సీఎల్‌ టెక్‌ (155), హిందాల్కో (157), విప్రో (168), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (204), సన్‌ ఫార్మా (217), జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌  (224), ఐటీసీ (231), ఏషియన్‌ పెయింట్స్‌ (248) స్థానాల్లో నిలిచాయి. జాబితాలో అత్యధిక స్థానాలను అమెరికా కైవసం చేసుకుంది. మొత్తం 250 కంపెనీలతో ఈ జాబితా విడుదల కాగా, ఇందులో 59 యూఎస్‌ కంపెనీలే.  ఇక అంతర్జాతీయ చెల్లింపుల సాంకేతిక సంస్థ వీసా టాప్‌లో.. ఇటాలియన్‌ కార్ల  దిగ్గజం ఫెరారీ రెండవ స్థానంలో నిలిచాయి.

పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా భారత్‌

            25 Sep, 2019              కార్పొ పన్ను కోతతో కీలక పరిణామం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆర్థిక మంత్రితో భేటీ న్యూఢిల్లీ: కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో భారత్‌ పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా మారిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనదిగా ఆయన అభివరి్ణంచారు. ఆరి్థక మందగమనానికి మందుగా దేశీయ కంపెనీలపై 30 శాతంగా ఉన్న పన్నును 25.2 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ గత వారం తగ్గించిన సంగతి తెలిసిందే. 28 సంవత్సరాల్లో చరిత్రాత్మకమైనదిగా ఈ నిర్ణయాన్ని కార్పొరేట్లు స్వాగతించారు. ‘‘ఇది ఎంతో సాహసోపేతమైన చర్య. ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన ఆరి్థక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి అత్యంత సానుకూలమైనది. భారత్‌ కార్పొరేట్‌ పన్ను ప్రస్తుతం ఆసియాన్‌ అలాగే ఇతర ఆసియా దేశాల్లో అతితక్కువగా ఉంది. అంతర్జాతీయ వాణిజ్య పోటీ అంశాలకు వస్తే, ఇది భారత్‌కు అత్యంత సానుకూలమైనది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల కోణంలో చూసినా లేక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారుల (ఎఫ్‌డీఐ) వైపు నుంచి ఆలోచించినా, భారత్‌ ఇప్పుడు పోటీ పూర్వక వాతావరణంలో నిలిచింది. అధిక పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యాన్ని పొందింది’’ అని దాస్‌ పేర్కొన్నారు. ‘‘ఇక దేశీయ కార్పొరేట్ల విషయానికి వస్తే, వారి వద్ద ఇప్పుడు అదనపు నిధులు ఉంటాయి. దీనితో వారు మరిన్ని పెట్టుబడులు పెట్టగలుగుతారు’’ అని కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొన్నారు. రుణ భారంలో ఉన్న కంపెనీలు దీనిని కొంత తగ్గించుకోగలుగుతాయని, వాటి బ్యాలెన్స్‌ షీట్లు మెరుగుపడతాయన్నారు. ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రితో చర్చ అంతకుముందు ఆయన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం ముందు జరిగే సాంప్రదాయక సమావేశంగా ఆయన దీనిని పేర్కొన్నారు. ‘‘పాలసీ సమావేశానికి ముందు ఆరి్థక శాఖ మంత్రితో ఆర్‌బీఐ గవర్నర్‌ సమావేశం కావడం, ఆరి్థక వ్యవస్థపై చర్చించడం గత ఎంతోకాలంగా ఉన్న సాంప్రదాయమే. ఇప్పుడు జరిగింది కూడా ఈ తరహా సమావేశమే’’ అని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచీ ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ మూడు రోజుల సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా పావుశాతం రెపోరేటు కోత ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఆర్థిక వృద్ధికి ఊతం ఇవ్వడానికి కేంద్రం ఉద్దీపన చర్యలు ప్రకటించడానికి వీలుపడదని, ద్రవ్య పరిస్థితులు ఇందుకు దోహదపడవని ఇటీవల పేర్కొన్న ఆర్‌బీఐ గవర్నర్, రెపో రేటు తగ్గింపునకు మాత్రం అవకాశం ఉందని అభిప్రాయపడిన సంగతి ఇక్కడ గమనార్హం.  ఆర్థిక వృద్ధి లక్ష్యంగా గడచిన 4 త్రైమాసికాల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో 1.1% తగ్గింది. దీనితో ఈ రేటు ప్రస్తుతం 5.4%కి దిగివచి్చంది. అంతేకాకుండా  ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు తక్షణం కస్టమర్లకు బదలాయించడానికీ ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది.  బ్యాంక్‌ రుణ రేటును రెపో, తదితర బెంచ్‌మార్క్‌ రేట్లకు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అనుసంధానించాలని  ఆదేశించింది. 3 నెలలకు ఒకసారి సమీక్ష జరిపి ఇందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఆర్‌బీఐ సూచించింది.