Labels

టీమిండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీమిండియా మాజీ క్రికెటర్ కన్నుమూత
23-09-2019


న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. అక్టోబరు 5న 87వ పుట్టిన రోజుకు సిద్ధమవుతున్న తరుణంలో ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1952-53 మధ్య భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆయన ఏడు టెస్టులు ఆడి 542 పరుగులు చేశారు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 67 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మాధవ్.. ఆరు సెంచరీలు, 16 అర్ధ సెంచరీలతో 3,336 పరుగులు చేశారు.

1932లో ముంబైలో జన్మించిన ఆప్టే లెగ్ స్పిన్నర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించారు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆప్టే డాన్ బ్రాడ్‌మన్ సగటు 100.00 కాకుండా అడ్డుకున్నారు. 1989లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నికయ్యారు. లెజెండ్స్ క్లబ్ చీఫ్‌గానూ సేవలు అందించారు.