Labels

మోదీపై ట్రంప్ ప్రశంసలు.. ఇమ్రాన్ అసహనం

మోదీపై ట్రంప్ ప్రశంసలు.. ఇమ్రాన్ అసహనం
23-09-2019

న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. న్యూయార్క్‌లో ఇమ్రాన్ తనను కలిసిన సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మోదీని ప్రశంసించారు. మోదీ పనితీరు అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. అదే సమయంలో అమెరికా విషయంలో పాక్ తీరు సరిగా ఉండదని ట్రంప్ అనడంతో ఇమ్రాన్ అసహనానికి గురయ్యారు. కశ్మీర్‌పై అమెరికా మధ్యవర్తిత్వం వహించాలన్న ఇమ్రాన్‌ డిమాండ్‌కు చెక్ పెట్టిన ట్రంప్ భారత్ కోరుకుంటేనే మధ్యవర్తిత్వం వహిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ వైఖరితో ఇమ్రాన్‌కు దిక్కుతోచని పరిస్ధితి ఏర్పడింది.