Labels

నేటి నుంచి మాతృభూమిలో ‘ఆటా’ వేడుకలు…!

 
హైదరాబాద్, డిసెంబర్ ౧౦: నగరంలో ప్రవాసాంధ్రుల కోలాహలం మొదలైంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం అమెరికా(1990)లో ఏర్పాటైన ఆటా (అమెరికా తెలుగు సంఘం) రాష్ట్రంలో విస్తృత సేవా కార్యక్రమాలకు సన్నద్ధమైంది. కరీంనగర్ జిల్లా నుంచి 10వ తేదీన మొదలయ్యే కార్యక్రమాలు, 15న రవీంద్రభారతిలో జరిగే ఆటా పాటలతో ముగుస్తాయి. 

మెరికా తెలుగు సంఘం (ఆటా) శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు ‘వేడుకలు’ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రేపు నగరంలో 5కె రన్‌ను నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ఉదయం 7 గంటలకు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి సంజీవయ్య పార్క్ వరకు ఈ రన్ కొనసాగుతుందని సంఘం అధ్యక్షుడు మాధవరం కరుణాకర్ తెలిపారు. నగరంలో ట్రాఫిక్‌పై అవగాహన, కాలుష్య నివారణకు సంబంధించి ప్రచారం నేపథ్యంగా ఈ రన్‌ను తలపెట్టినట్లు ఆయన చెప్పారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ‘ఆటా’ సభ్యులు రన్ పోస్టర్, టీ షర్ట్‌లను విడుదల చేశారు. మీడియా సమావేశంలో ట్రాఫిక్ ఏసీపీ రామనర్సింహారెడ్డితో పాటు ‘ఆటా’ సంస్థ ప్రతినిధులు బల్వంత్‌రెడ్డి, జిన్నా రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. 

అలరించనున్న తెలుగు వెలుగులు…
‘ఆటా’ ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆయా సమకాలీన అంశాలపై సదస్సులను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే 10న కరీంనగర్, 11, 15న హైదరాబాద్, 12న మైలవరంలో వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఇందులో కనుమరగవుతున్న కళలైన కత్తి, కర్రసాములు, పులివేషాలు, హరికథ, భాగవతాలతో పాటు అన్నమయ్య, త్యాగరాజ కీర్తలను, జానపద, కూచిపూడి నృత్యాలను ప్రదర్శించేందుకు ఆటా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. 15వ తేదీన సెంట్రల్ కోర్టు హోటల్‌లో జరిగే విద్యా సదస్సుకు అమెరికాలోని పలు యూనివర్సిటీల డీన్లు హాజరవుతారు. సాయంత్రం రవీంద్రభారతిలో జరిగే ఉత్సవాల్లో హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ జనరల్ దనానితో పాటు ఎన్నారైల కుటుంబసభ్యులు పాల్గొంటారు.
 మాతృభూమిని మరిచిపోం… 
కన్నతల్లిని, సొంత గడ్డను మరి చిపోం. తెలుగు సంస్కృతి, సం ప్రదాయాన్ని ముందుకు తీసుకువెళుతూ మాతృభూమి అభివృద్ధి, సంక్షేమానికి చేతనైన సహాయం చేసేందుకు అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుంది. అందుకే అమెరికాలో తెలుగు వైభవాన్ని చాటుతూనే.. ఇక్కడ పలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాం. – రాజేందర్ జిన్నా, అధ్యక్షులు ఆటా
మా వంతు కర్తవ్యం.. 
చదువు, వ్యాపారం కోసం అమెరికాకు వచ్చి ఇబ్బందులు పడే వారి కోసం ఆటా ప్రత్యేక చర్య లు తీసుకుం టుంది. ఇటీవల ట్రైవ్యాలీ విషయంలో ఇబ్బందికి లోనైన మన రాష్ట్ర విద్యార్థులకు అండగా నిలిచాం. నేటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల ద్వారా అనేక మందికి ప్రత్యక్ష, పరోక్ష మేలు జరగనుంది. 
                                                                                           - బల్వంత్ రెడ్డి కొమ్మిడి, ఆటా ట్రస్టీ
మున్ముందు.. మరింత చేరువవుతాం
ఆటాను తెలుగు ప్రజలకు మరింత చేరువచేసే కార్యక్రమాలు రూపొందిస్తాం. మన రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి విస్తృత స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాం. నేటి నుంచి ప్రారంభయ్యే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని సూచనలు అందించాలి. 
                                                                         - కరుణాకర్ మాధవరం, ఆటా ఎలెక్ట్ ప్రెసిడెంట్ 
మన ఆటా.. పాట లకు పెద్దపీట… 
ఆటా ఉత్సవాల్లో మన పండగలు, ప్రాచీన కళల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెబుతాం. ముఖ్యం గా పల్లె కళలకు ప్రా ధాన్యతనిస్తాం. ఈ నెల 15న రవీంద్రభారతిలో జరిగే ఉత్సవంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కళల్ని ప్రదర్శిస్తారు.  - డాక్టర్ పద్మజారెడ్డి, ఆటా సాంస్కృతిక ప్రతినిధి