లండన్: స్వాతంత్య్ర సమరంలో అమృతసర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో వందలాది మంది భారతీయుల ఊచకోతకు కారణమైన బ్రిటన్ రాణి బేషరత్తుగా క్షమాపణలు చె ప్పాలని భారతీయ సంతతికి చెందిన లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మ బుధవారం డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనలో అభం శుభం తెలియని వందలాది మంది భారతీయలు ప్రాణాలు క్షణాల్లో అనంత వాయువుల్లో కలిసి పోయేలా చేశారని అందువల్ల బ్రిటన్ రాణి తప్పకుండా క్షమాపణలు చెప్పితీరవలసిందే అని ఆయన అన్నారు. మనం 21వ శతాబ్థంలో ఉన్నాం, ప్రతి ఒక్కరిని సమన్వయ పరుచుకుని ముందుకు వెళ్తున్నాము కనుక క్షమాపణలు తెలుపడంలో తప్పేలేదని ఆయన స్పష్టం చేశారు. 1997 సంవత్సరంలో బ్రిటన్ రాణీ జలియన్ వాలా బాగ్ పర్యటనలో క్షమాపణలు తెలుపలేదని.. అయితే క్షమాపణలు తెలుపడానికి అనువైన సమయమని ఆయన అన్నారు. ప్రస్తుత సమయంలో రాణి అధికారికంగా క్షమాపణలు చెప్పాలని ఆయన కొరారు. లేబర్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన జాక్ స్ట్రా 2005లో జలియన్ వాలా బాగ్‌ని సందర్శించి మొక్కుబడిగా క్షమాపణలు చెప్పారని ఆయన తెలిపారు.
జలియన్ వాలా బాగ్ ఘటన జరిగినప్పుడు ఈ రాణి అధికారంలో లేరని అందువల్ల ఆమె క్షమాపణలు చేప్పావలసిన అవసరం లేదని ప్రముఖ చరిత్రకారుడు పీటర్ బెనసి అభిప్రాయాన్ని ఆయన ఖండించారు. ‘ఐర్లాండ్ గార్టెన్ ఆఫ్ రిమెంబరెన్స్’ సందర్భంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమంలో అమర వీరులైన ఐర్లాండ్ వాసులకు నివాళులర్పించిన సంఘటనను ఆయన గుర్తు చేశారు. 1919, ఏప్రిల్13న అమృతసర్ పట్టణంలోని జలియన్‌వాలా బాగ్‌లో శాంతియుతంగా సిక్కులు పండగ జరుపుకుంటుండగా జనరల్ డైయ్యర్ కాల్పులకు ఆదేశించారు. ఈ దుర్ఘటనలో అధికారికంగా 379 మంది చనిపోయారని ప్రకటించారని, అయితే కాల్పుల బారి నుంచి తప్పించుకునేందుకు జరిగిన తొక్కిసలాట, గొడలపై నుంచి జారిపడి 1000 మంది పైగానే మరణించారని ఆయన అన్నారు.

No comments:
Post a Comment