Labels

ఒంగోలులో తెలుగు మహోత్సవాలు

హైదరాబాద్: ఒంగోలు వేదికగా ప్రపంచ తెలుగు మహోత్సవాలు 2012 జనవరి 5, 6, 7 తేదీల్లో జరగనున్నాయి. మొత్తం 11 దేశాలనుంచి తెలుగు సంఘాల ప్రతినిధులు వీటికి హాజరవుతారని నిర్వాహక సంస్థ రామ్‌కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ఆళ్ల దాక్షాయణి తెలిపారు. ఈ ఉత్సవాల బ్రోచర్‌ను సీఎం కిరణ్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలను విలక్షణంగా నిర్వహించనున్నట్లు ఫౌండేష న్ ఆపరేషన్స్ హెడ్ ఎంవీ రామిరెడ్డి చెప్పారు. దేశం నలుమూలల ఉండే జానపద కళలను ప్రదర్శింపజేస్తామని వివరించారు. తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.
‘ప్రపంచ తెలుగు మహోత్స వం’కు వెబ్‌సైట్‌!

రాంకీ ఫౌండేషన్ జనవరి 5,6,7 తేదీల్లో ఒంగోలులో నిర్వహించనున్న ‘ప్రపంచ తెలుగు మహోత్స వం’ కు సంబంధించిన వెబ్‌సైట్‌ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. భాషా, సం స్కృతుల పరిరక్షణకోసం ఇలాంటి ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన రాంకీ ఫౌం డేషన్‌ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. తెలుగు మహోత్సవం కార్యక్ర మ ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మాట్లా డుతూ www. ramkyculture.org వెబ్ సైట్‌లోకి వెళ్లితే ఉత్సవాల వివరాలు తెలు సుకోవచ్చన్నారు. ఉత్సవాల కన్వినర్ పి.వినయ్‌కుమార్, రాంకీ గ్రూప్ ప్రతినిధి నారాయణరెడ్డి, ఆదర్శిని మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.