బెజవాడ నుంచి ఢిల్లీకి ఎయిర్‌బస్
విజయవాడ, అక్టోబర్ 21: సుదీర్ఘ చరిత్ర కల్గిన గన్నవరం విమానాశ్రయంలో తొలిసారి గురువారం ఎయిర్ ఇండియా విమానం గగనతలంలో చక్కర్లు కొట్టింది. దీంతో ప్రయాణికుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి 142 సీట్ల సామర్థ్యంతో కూడిన ఎయిర్‌బస్‌ను నడిపేందుకుగాను ఎయిర్ ఇండియా 750 అడుగుల మేర నూతనంగా విస్తరించిన రన్‌వే ట్రయిల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఢిల్లీ నుంచి ఉదయం 11.30 నిమిషాలకు ల్యాండ్ అయిన ఈ విమానం తిరిగి మధ్యాహ్నం 1.30కు బయలుదేరి వెళ్లింది. ఈ నెలాఖరులో తొలుత ఒక సర్వీసును ఆపై మరో సర్వీస్‌ను నడుపనుంది. విదేశాల నుంచి దక్షిణ కోస్తా వచ్చే ప్రయాణీకులు ఢిల్లీలో దిగి అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి మరో విమానంలో గన్నవరానికి రావాల్సి వస్తోంది. ఇక ఆ ప్రయాస తప్పనుంది.
No comments:
Post a Comment