తెలుగు సినీ అభిమాని మరోసారి బిక్కమొహం వేసిన రోజది.
కన్నడ, మరాఠీ, బెంగాలీ, తమిళ చిత్రాలన్నీ జాతీయ అవార్డులు ఎగరేసుకుపోతుంటే...మరోసారి మన తెలుగు సినిమా ఖాతా తెరవకుండానే ఉత్తి చేతులతో మొత్తుకున్న రోజది.
ప్చ్...అద్భుతాలేం జరగలేదు. అనుకున్నట్టుగానే మనకు మొండి చెయ్యే మిగిలింది. షరా మామూలుగానే ‘తెలుగు సినిమా జాతీయ అవార్డులకు సరితూగదు’ అనే నిజం మరోసారి రుజువైంది. దశాబ్దాలుగా ఉత్తమ నటుడు అనే హోదా మనకు దక్కని ఆనవాయితీ కొనసాగిస్తూ ఉసూరుమన్నాం.
కోపం వచ్చి...‘అసలు మనదర్శకులు సత్తా ఉన్న సినిమాలు తీయడం చేతకాదెహె...’ అని ఆడిపోసుకున్నాం. ఖాళీగా ఉన్న నలుగురిని పోగేసుకుని ‘ఎటుపోతుంది తెలుగు సినిమా?’ అనే విషయంమీద గంటలకొద్దీ జరిగాం. మళ్లీ మామూలే. సాయంత్రం అయ్యేసరికి మాస్ మసాలా అంశాలు జోరుగా ఉన్న ఒక సినిమాని ఎంచుకుని బ్లాక్‌లో టికెట్లు కొనుక్కుని ...్థయేటర్‌లో దూరిపోయి హీరోయిజాన్ని చూసి మురిసిపోయాం. హీరోయిన్ అంగాంగ ప్రదర్శన చూసి ఖుషీ అయిపోయాం. హాస్యనటుడి వెకిలి చేష్టలు చూసి థియేటర్ బయటకు వచ్చి కూడా నవ్వుకున్నాం. అంతే...మన పని అయిపోయింది. మన కోపం చప్పున చల్లారిపోయింది. మరో ఏడాది జాతీయ అవార్డులు ప్రకటించే వరకు ఆ కోపాన్ని ఆవేశాన్ని అలాగే అణచిపెట్టుకుంటాం. ఎనే్నళ్లనుంచో జరుగుతున్న తంతు ఇదే కదా!
మనకూ జాతీయ అవార్డులు ఖచ్చితంగా వచ్చేవే. కాకపోతే రెండు విషయాల్లో మార్పులు జరగాలి. ఒకటి-మన సినీ రూపకర్తల ఆలోచన మారాలి. వాస్తవికతకు అద్దంపట్టే కథలు రావాలి. అయితే ఇలా ఆశించడం అత్యాశే. ఎందుకంటే మన కథలన్నీ నేలవిడిచి సాము చేస్తాయి. వాణిజ్య సూత్రాలకు లోబడే సన్నివేశాలు, పాటలు వస్తాయి. అవి లేకపోతే సినిమా బండి నడవదు. అఫ్‌కోర్స్..ప్రేక్షకులూ చూడరు. అందుకే ఇది చాలా కష్టం. రెండోది మాత్రం చాలా ఈజీ. జాతీయ అవార్డుల కేటగిరి పూర్తిగా మార్చేయాలి. ఉత్తమ బూతు చిత్రం, ఉత్తమ హింసాత్మక చిత్రం, పసలేని చిత్రం, ఉత్తమ ఐటమ్‌సాంగ్...ఇలాంటి కేటగిరి ప్రవేశపెడితే అవార్డులన్నీ మనకే వచ్చుండేవి. కానీ ఇదీ జరగదు. అంటే మనకు అవార్డులు రావు.
కాసేపు వాస్తవం ఆలోచిద్దాం. అసలు మనకు అవార్డు ఎందుకు రావాలి? యాక్షన్ పేరుతో రక్తపాతం సృష్టించే మన సినిమా న్యాయనిర్ణేతల కళ్లకు కనిపించకపోవడం విడ్డూరం ఏం కాదు. గ్లామర్ పేరుతో అశ్లీలాన్ని, వినోదం పేరు చెప్పి బూతునూ అడ్డు అదుపు లేకుండా చూపించే మన దర్శకుల ప్రతిభ...జాతీయ స్థాయి వరకు వెళ్లకపోవడం వింతేమీ కాదు. హీరోయిజం పేరు చెప్పి...విలనిజం పండించే కథానాయకుల పాత్ర చిత్రణ జ్యూరీకి ఎక్కకపోవడం వాళ్లపాపం కాదు. హింస, సెక్స్..ఈ ఎక్స్‌ట్రా వేషాలు బొత్తిగా రుచించకపోవడం నేరం కాదు. చివరికి మనం లొట్టలేసుకుని చూసే ఐటమ్‌సాంగ్స్ కూడా కిక్ ఎక్కించలేదు. అందుకే మనకు అవార్డులు రాలేదు.చేపా..చేపా..ఎందుకు ఎండలేదు? అని చెబితే ఏం సమాధానం వస్తుందో తెలుసు. అవార్డూ అవార్డూ నువ్వు ఎందుకు రాలేదు? అని అడిగినా అదే సమాధానం వస్తుంది. దర్శకుడు కావాలని కలలు కంటున్న ఎవరైనా సరే ఫక్తు కమర్షియల్ సినిమాలు చేయాలని కలలు కనరు. ఏదో ఉద్ధరిద్దాం అనుకునే వస్తారు. తెలుగు సినిమాకి కొత్త రక్తం ఎక్కించాలని ఉబలాటపడతారు. దిగితేగానీ లోతు..అవకాశం వస్తేగాని వాస్తవం అర్ధం కావు. హీరోగారి ఇమేజ్ కథలో ఉన్న నిజాయితీకి కత్తెర్లు వేస్తుంది. డిస్ట్రిబ్యూటర్ల ధోరణి..ఆశయాన్ని ఆవిరి చేస్తుంది. కథలో వేలే కాదు...సమస్తం దూర్చేసే నిర్మాతల ఆలోచనలు వాస్తవికతకు తూట్లు పొడుస్తుంది. అప్పటికే అసలు కథ జావగారిపోయి...అదో మిక్స్‌డ్ ఫ్రూట్ సలాడ్‌గా తయారవుతుంది. అంటే ఈ తప్పు దర్శకుడిది కాదన్నమాట.
ఇక బంతి నిర్మాత కోర్టులో పడింది. ‘‘నువ్వు పది కోట్లుపెట్టి సినిమా తీయ్. తిరిగి ఒక్కపైసా ఆశించకు. అవార్డులు అవే వస్తాయి’’ అని చెబితే ఏ నిర్మాత ధైర్యం చేస్తాడు? పది రూపాయల కష్టానికి పదకొండు రూపాయల ప్రతిఫలం ఆశించడం తప్పుకాదు. అలాంటిది కోట్ల రూపాయలు వడ్డీలకు తెచ్చి సినిమా తీసే నిర్మాత ఆ డబ్బుని అవార్డులకోసం ఫణంగా పెట్టమని అడిగే హక్కు ఏ ఒక్కరికీ లేదు. అంటే...ఈ పాపంలో నిర్మాత వాటా అస్సలు లేదన్నమాట.
పోనీ హీరోలను అందామా అంటే అంత ధైర్యం ఎవరికీ లేదాయె. ‘ఇంట్రడక్షన్ ఫైటు అదిరిపోవాలి...లేదంటే నా ఫ్యాన్స్ ఫీలైపోతారు’’ అని ఎప్పుడూ ఆ గిరిలోనే ఉండే హీరోని అనేంత సాహసం చేస్తామా? తప్పు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ప్రేక్షకుల మీదకే పడుతుంది. ఈ పాపంలో ఎక్కువ వాటా సగటు ప్రేక్షకుడిదే. ఈ పాపభారం కిక్కురుమనకుండా మోయాల్సిందే.
యధా ప్రేక్షకుడు..తథా సినిమా...మన తెలుగు సినీ రూపకర్తలు పాటిస్తున్న సూత్రం ఇదే. ప్రేక్షకులకు ఏం కావాలో అది అందిస్తే ప్రయాణం సురక్షితంగా ఉంటుందని నమ్ముతున్నారు. ఇందుకు విరుద్ధంగా అడుగులు వేశారా...? బొక్క బోర్లాపడడం ఖాయం అని అనేక సందర్భాలు రుజువు చేసాయి. చేస్తున్నాయి. నిజానికి మన దర్శకుల ఆలోచన ధోరణి ఇప్పుడిప్పుడే మారుతోంది. సృజన, వాస్తవికత జోడించి కథలు అల్లుకుంటున్నారు. ప్రేక్షకులు ఆదరిస్తారు అనే నమ్మకం ఏ కోశానా లేకపోయినా కొంతమంది నిర్మాతలు ధైర్యం చేస్తున్నారు. ‘అందరి బంధువయ’, ‘ప్రస్థానం’, ‘బ్రోకర్’, ‘గంగపుత్రులు’ వంటి సినిమాలు రూపుదిద్దుకున్నాయంటే అందుకు కారణం అదే. కానీ మనం ఏం చేశాం? ఈడ్చి కొట్టాం. ‘సినిమా చాలా స్లోగా ఉంటుందిరా..’ అంటూ ఓ ముద్ర వేశాం. ఫలితం..ఆ నిర్మాతలకు డబ్బులు మిగల్లేదు. స్టార్లు ఉంటే చూస్తారేమో అనే అనుమానంతో ‘వేదం’ తీసుకువచ్చారు. దురదృష్టం... ఆ సినిమాకీ లాభాలు రాలేదు. ఇక ఇలాంటి సినిమాలు ఎందుకు తీయాలి? ఎవరికోసం తీయాలి?
కేవలం సందేశం ఇస్తే జనాలు చూస్తారా అంటే చూడరు. దానికి మసాలా జోడించాలి. ఆ ప్రయత్నంలో అసలు కథ మరుగును పడిపోతుంది. తూకంలో తేడా వస్తే..ఆర్ట్ సినిమా అనే ముద్ర పడిపోతుంది. ఆ తరువాత థియేటర్లు ఖాళీగా కనిపిస్తాయి. అందుకే నిర్మాతలు అంత సాహసానికి ఒడిగట్టడంలేదు. ‘ప్రస్థానం‘, ‘గంగపుత్రులు’, ‘బ్రోకర్‘...ఈ సినిమాల్లో ఒక్కదాన్ని మనం పట్టించుకున్నా..మరో పది మంచి సినిమాలకు బీజం పడేది. అందులో ఒక్కటైనా జాతీయస్థాయిలో నిలబడేది. కానీ అది జరగలేదు. ‘మనకు మంచి సినిమాలు వద్దు...మసాలా సినిమాలు కావాలి. డబ్బుని నీరులా వెదజల్లి ఓ మంచి సినిమా తీస్తే...నిర్మాతకు దక్కే ప్రతిఫలం ఏమిటి? ఓ సినిమా పోతే...వందలాది బతుకులు రోడ్డుమీద పడతాయి. అవార్డుని ఎరగా వేసి...బతుకుల్ని బుగ్గిపాలు చేయడం ఎవరి కోసం? ముందు ప్రేక్షకులు మారాలి. మంచి సినిమా వస్తే తప్పకుండా చూస్తాం అనే నమ్మకం కల్పించాలి. అపుడే లాంటి సినిమాలు వస్తాయి’’ అని ఓ నిర్మాత ఆవేదన వెలిబుచ్చారు. నిజమే..ఆయన ఆవేదనకు అర్ధం వుంది. మంచి మనకు ఎక్కదు.. మసాలా కావాలి. అందుకు ఓ తాజా ఉదాహరణ. తమిళంలో ‘కో’ అనే సినిమా వచ్చింది. పాత్రికేయ రంగానికీ, రాజకీయ రంగానికి చక్కని ముడివేసి...కథని అందంగా నడిపారు. ఆ సినిమాలో జీవా ఎక్కడా హీరోయిజం చూపించలేదు. ఆయన పాత్ర కూడా హద్దుల్లోనే ఉంటుంది. తమిళ జనం బ్రహ్మరథం పట్టారు. అదే సినిమా ‘రంగం’గా తెలుగులో అనువాద రూపంలో వచ్చింది. పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. ఎందుకంటే అందులో మనకు కావాల్సిన ‘మసాలా’ కరువైంది.
ఇందుమూలంగా తేల్చుకోవాల్సిన విషయం ఏమిటంటే-జాతీయ స్థాయిలో మన సినిమా నిలబడపోవడానికి కారణం...మనమే. మనకు నచ్చిన మాస్ మసాలాకు ఎంత విలువ ఇస్తామో, మానవత్వం, మంచితనం పరిమళించిన వాస్తవ కథలనూ అలాగే ఆదరిద్దాం. అప్పుడే కొండంత ఆశతో కథ అల్లుకున్న దర్శకుడు ధైర్యంగా ముందడుగు వేస్తాడు. నిర్మాత చేయూత నిస్తాడు. ఇమేజ్ ముసుగులో ఉన్న హీరో ఆ ముసుగు తీస్తాడు. ఆ రోజే మన సినిమాకు వంద జాతీయ అవార్డులు వచ్చినట్టు. ఆ శుభ ఘడియకు బీజం ఎప్పుడు పడుతుందో చూడాలి.-

No comments:
Post a Comment