Labels

10న ‘బద్రినాథ్’


అల్లు అర్జున్, తమన్నా జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై వివి వినాయక్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన భారీ చిత్రం ‘బద్రినాథ్’. ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 10న విడుదలకు ముస్తాబైంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ- ‘ఈ చిత్రంకోసం తెలుగు చలనచిత్ర చరిత్రలో లేనివిధంగా 22 భారీ సెట్టింగులు వేశాం. ఈ సెట్టింగులు స్క్రీన్‌మీద అద్భుతంగా కనిపిస్తాయి. 3 కోట్ల రూపాయలతో ఓంకారేశ్వరి పాట చిత్రీకరణలో దాదాపు వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులతో భారీగా చిత్రించాం. వినాయక్ ఈ చిత్రంలో సరికొత్త అర్జున్‌ని చూపనున్నాడ’ని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: అల్లు అరవింద్, దర్శకత్వం: వివి వినాయక్

No comments:

Post a Comment