తమిళ దర్శకులలో తెలుగునాట అత్యంత పేరు పొందిన ఏకైక దర్శకుడు బాలచందర్ ఒక్కరే. అందుకే తెలుగింటి ప్రతీ గడపా బాలచందర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించడంపట్ల అమితానందపడుతోంది. కారణం ఆయన సినిమా కథలు ఒక ప్రాంతానికి పరిమితమైనవి కావు. ఆయన చిత్రాలలో సామాజిక స్పృహ కల కథాంశం ఉంటుంది. అలాగే నిరుద్యోగ, తాగునీటి సమస్య, మధ్యతరగతి జీవితాల కథలు.. ఇలా ఏ దర్శకుడు చేపట్టని కొత్త సమస్యలే ఆయన కథలు. అంతులేని కథ, ఆకలిరాజ్యం, గుప్పెడుమనసు, మద్రాసులో తాగునీటి సమస్యపై తన్నీర్ తన్నీర్ ఇలా ఒక చిత్రానికి మరొక చిత్రానికి సంబంధంలేని కధాంశాలు ఎన్నుకోవడం బాలచందర్ ప్రత్యేకత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్థాపించిన 1969 నుంచి నేటివరకు ఈ అవార్డు పొందిన 42 మందిలో నాల్గవ దక్షిణాది దర్శకుడు బాలచందర్ (మిగతా ముగ్గురు బిఎన్‌రెడ్డి 1974, ఎల్‌వి ప్రసాద్ 1982, ఆదూర్ గోపాలకృష్ణ 2004). ఈ అవార్డు పొందిన ఏకైక తమిళ దర్శకుడు బాలచందర్ కావడం ఒక విశేషం. తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎందరో పరభాషా దర్శకులు ఉన్నా, ఒక్క బాలచందర్‌కు ఉన్న పాపులారిటీ మరే దర్శకుడికీ లేదు. కారణం బాలచందర్ చిత్రాలలో ప్రతి తెలుగింటి ఉమ్మడి కుటుంబ సమస్యలు ఉంటాయి. విశాఖ ప్రకృతి అందాలను వెండితెరపై ఆరబోసిన మొదటి చిత్రదర్శకుడు బాలచందర్.అందుకే తెలుగువారికి ఆయనంటే అత్యంత అభిమానం. బాలచందర్ తన చిత్రాలలో ఇమేజ్‌గల హీరోల పాపులారిటీని ఉపయోగించుకోలేదు. తన హీరోలను తానే సృష్టించిన విధాత. బాలచందర్ సృష్టించిన కమల్‌హాసన్, రజనీకాంత్ జాతీయ నటులుగా పేరొందారు. టీవీ సీరియల్‌నుంచి వెండితెరకు ఎదిగిన ప్రకాష్‌రాజ్, పృధ్వీరాజ్‌లు కూడా బాలచందర్ ద్వారానే పరిశ్రమకు వచ్చారు. సుజాత, సరిత సరేసరి. కొందరు నటులు సరికొత్త పాత్రలలో ఎక్స్‌ప రిమెంట్ కూడా చేసాడు. హాస్యపాత్రలు ధరించే నగేష్ నటనతో ప్రేక్షకులను ‘నీర్‌కుమళి’ చిత్రం ద్వారా కంటతడిపెట్టించాడు. అలాగే చలంతో సత్తెకాలపు సత్తెయ్య.
హీరో ఇమేజ్ వస్తున్న రోజుల్లో ముగ్గురు హీరోయిన్లతో కామెడీ కథ సృష్టించి భలేకోడళ్లు చిత్రం నిర్మించారు. ఈ చిత్రం తీన్ బహురానిమాగా అఖండ విజయం సాధించింది. ఆయన చిత్రాలకు హీరోతో పనిలేదు కథే హీరో. చిరంజీవితో రుద్రవీణ చిత్రాన్ని నిర్మించినా అది బాలచందర్ చిత్రం అన్నారుగానీ చిరంజీవి చిత్రం అనలేదు. దర్శకుడు చిత్ర యూనిట్‌కు కెప్టెన్ అన్నది బాలచందర్‌తోనే ప్రారంభమైంది. అందుకే ఆయన పేరు పబ్లిసిటీలో మేఘాలలో ఉంటుంది. అదే ఆయన ప్రత్యేకత. నేడు చలనచిత్రాలను అభిమానిస్తున్న ఆబాల గోపాలానికి బాలచందర్ బాల చంద్రుడిలాగానే ఇంకా వెనె్నలలు ప్రసాదిస్తుంటాడని ఏ గ్రహణాలు కూడా ఈ చంద్రుడి శక్తిని ఎదుర్కొనలేవని నమ్మకంలో మరెన్నో అద్భుత చిత్రాలని ఆశించవచ్చు. గత సంవత్సరం అక్కినేని జాతీయ స్థాయి అవార్డు బాలచందర్‌ని వరించినపుడే అందరూ మరో జాతీయస్థాయి అవార్డు బాలచందర్‌ను వరించబోతున్నది అని. అదే నిజమైంది. ఈ బాలచంద్రుడి కీర్తి జాతీయస్థాయిలోనే ఖండాంతరాల ఖ్యాతినార్జించాలని ఆశిద్దాం. -పర్చా శరత్‌కుమార్

No comments:
Post a Comment