Labels

ఆస్ట్రేలియాలో భారతీయులకు ఉపాధి!

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో గనులను(మైనింగ్) వినియోగించుకొనేందుకు వృత్తి నిపుణులు కొరత ఆధికంగా ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా దాదాపు 30 వేల మంది భారతీయులకు ఆస్ట్రేలియన్ల చేత శిక్షణ ఇప్పించి వారి ద్వారా గనులను వినియోగంలోకి తెస్తుందని ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్వ్యూ బిజినెస్ డైలీ గురువారం తెలిపింది. ఇందు కోసం ఆస్ట్రేలియాలో శిక్షణ వ్యవస్థని ప్రారంభించేందుకు ఇరు దేశాలకు చెందిన అధికారులు చర్చల ప్రక్రియ కార్యక్రమం మొదటి దశ లో ఉందని పేర్కొంది.
దాదాపు లక్షమంది భారతీయులను శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదట విడత 30 వేల మందికి ఆస్ట్రేలియన్లతో శిక్షణ ఇస్తుంది. దీని వల్ల విద్యా, పరిశ్రమల్లో అత్యధికంగా ఉద్యోగావకాశాలు వస్తాయని ఆస్ట్రేలియా సీనియర్ ట్రేడ్ అధికారి పీటర్ లిన్‌ఫోర్డ్ తెలిపారు. ఇక్కడ గనుల(మైనింగ్) కంపెనీలు ఆధిక సంఖ్యలో ఉన్నాయని అందువల్ల భారతీయ గ్రాడ్యుయేట్స్‌కి ఇక్కడ విపరీతమైన డిమాండ్ ఉందని పేర్కొంది. అందువల్ల ఇరుదేశాల అధికారులు ఈ విషయంలో పాలుపంచుకొవాలని తెలిపింది. ఆస్ట్రేలియా గనుల రంగంలో భారత్‌తో కలసి పనిచేయటం వల్ల భారతీయల వృత్తి నైపుణ్యం మరింత పెరుగుతుందని తాము ఆశిస్తూన్నట్లు లిన్‌ఫొర్డ్ తెలిపారు.
దీంతో ఇతర దేశాలకు, ఇతర పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తామని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాలోని పద్దతులకు అనుగుణంగానే భారతీయులకు శిక్షణ ఉంటుందని అలాగే ఆస్ట్రేలియన్స్‌కి ఉంటుందని చెప్పారు. రాబోయే నాలుగేళ్లలో గనుల వ్యాపారం విజృంభిస్తుందని అందువల్ల దాదాపు 2.4 మిలియన్ల మంది వృత్తి నైపుణ్యం కలిగిన వారు అవసరం అవుతారని ఈ నెల మొదటి వారంలో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఈ చర్యలకు ఉపక్రమించింది.

No comments:

Post a Comment