Labels

'కాంగ్రెస్,టిడిపిల చెంపచెళ్లుమనిపించిన ఓటర్లు'

కడప(వైఎస్ఆర్ జిల్లా): కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి అన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఫలితాలు రాష్ట్రంలో జరుగబోవు మార్పుకు నాంది అన్నారు. ప్రతిపక్షంగా ఉండవసిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ప్రజలను మోసం చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీకి కూడా ప్రజలు లాగి చెంపదెబ్బ కొట్టారన్నారు.

దేశ చరిత్రలో మరచిపోలేని విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. అపూర్వమైన తీర్పు ఇచ్చిన ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. తాను ముఖ్యంగా ముగ్గురికే కృతజ్ఞతలు తెలుపుతానని చెప్పారు. తాను దేవుడి దయవల్ల, నాన్న ఆశీస్సులతో, నాన్నను ప్రేమించే ప్రతి ఒక్కరి అండ వల్ల తాను గెలిచానని అన్నారు. వారందరికీ కృతజ్ఞలు తెలుపుతున్నానన్నారు.

జులై 8న నాన్న పుట్టిన రోజని, ఆ రోజున ఇడుపులపాయలోనే పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ రోజున ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త నుంచి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు.
ఏం చేయబోతున్నామో వివరంగా చెబుతామని చెప్పారు. తమ పార్టీ జెండా చూస్తే చాలు ఎజండా చెప్పకనే చెప్పినట్లు ఉంటుందన్నారు.

తాను ప్రజల పక్షాన ఉన్నానని చెప్పారు. ఈ ప్రభుత్వం పడిపోతే ముందుగా సంతోషించేది పేద ప్రజలన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్టనర్ అయిపోయిందని అందువల్ల ఈ ప్రభుత్వం పడిపోదన్నారు.

No comments:

Post a Comment