Labels

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాలన్నీ వెలువడ్డాయి. అయిదు రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, చత్తీస్'ఘడ్'లలో ఉప ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి లోక్'సభ సభ్యుడుగా, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ శాసనసభ్యురాలిగా విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్ లో మూడు దశాబ్దాల వామపక్ష పాలనకు ఓటర్లు చరమగీతం పాడారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ నాయకత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. తమిళనాడులో డిఎంకెని కూడా ప్రజలు ఓడించారు. అక్కడ అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత నాయకత్వంలోని కూటమి ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినన్ని స్థానాలు గెలుచుకుంది. కేరళలో కాంగ్రెస్ పార్టీ కూటమి మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పుదుచ్చేరిలో రంగస్వామి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది.

వివిధ రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్ లో మొత్తం స్థానాలు - 294
తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన స్థానాలు - 226
వామపక్షాలు గెలిచిన స్థానాలు - 62
ఇతరులు గెలిచిన స్థానాలు - 6

కేరళలో మొత్తం స్థానాలు - 140
యుడిఎఫ్ గెలిచిన స్థానాలు - 72
ఎల్.డి.ఎఫ్. గెలిచిన స్థానాలు - 68


అస్సాంలో మొత్తం స్థానాలు - 126
కాంగ్రెస్ గెలిచిన స్థానాలు - 78
ఎజిపి గెలిచిన స్థానాలు - 10
ఎయుడిఫ్ గెలిచిన స్థానాలు - 18
బిజెపి గెలిచిన స్థానాలు - 5
ఇతరులు గెలిచిన స్థానాలు - 15

పుదుచ్చేరిలో మొత్తం స్థానాలు - 30
ఎఆర్ సి గెలిచిన స్థానాలు - 20
కాంగ్రెస్ కూటమి గెలిచిన స్థానాలు - 9
ఇతరులు గెలిచిన స్థానాలు - 1


ఆంధ్రప్రదేశ్ లోని కడప లోక్ సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి రికార్డు స్థాయి మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఆయనపై పోటీ చేసినవారందూ ధరావతు కోల్పోయారు. పులివెందుల శాసనసభా స్థానం నుంచి అదే పార్టీకి చెందిన విజయమ్మ రికార్డు స్థాయి మెజార్టీతో ఘన విజయం సాధించారు.

కర్నాటకలో జరిగిన ఉప ఎన్నికలలో మూడు స్థానాల్లోనూ బిజెపి ఘనవిజయం సాధించింది.
ఛత్తీస్'ఘడ్ లోని లోక్ సభ స్థానం బిజెపి విజయం సాధించింది.

No comments:

Post a Comment