Andhra Pradesh Assembly |
సర్కార్ విఫలమైనందునే అవిశ్వాసం: బాబు
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైనందునే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా తాము ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
అందువల్లే తప్పని పరిస్థితుల్లో రైతు సమస్యలపై అవిశ్వాసం పెడుతున్నామని చంద్రబాబు తెలిపారు. ఎన్నికలైనా, పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. రైతుల వద్ద ధాన్యాన్ని కొనకుండా సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్ల వెనక్కి పోయిందన్నారు. అధికారం కోసం తాము అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదని తెలిపారు.
స్పీకర్ పదవికి పోటీ పడనున్న టీడీపీ!
హైదరాబాద్ : స్పీకర్ పదవికి పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సన్నాహాలు మొదలుపెట్టినట్లు సమాచారం. టీడీపీ స్పీకర్ అభ్యర్థిగా కేఈ కృష్ణమూర్తి పేరు తెరమీదకు వచ్చింది. అలాగే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో చంద్రబాబునాయుడు పార్టీ కార్యాలయంలో నేతలతో సమావేశం అయ్యారు. అవిశ్వాత తీర్మానం నోటీస్‌ను అందించేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్‌ను కలవనున్నారు.
విశ్వాస తీర్మానానికి సర్కార్ సిద్ధం ?
అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షం వ్యూహం
హైదరాబాద్, జూన్ 2 : శాసనసభ విశ్వాసం చూరగొనడానికి వీలుగా తమంతటతామే సిద్ధపడాలని కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ యోచిస్తుండగా, ఆ అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకూడదనే వ్యూహంలో తెలుగుదేశం పార్టీ ముందుగా తామే అవిశ్వాస తీర్మానానికి డిప్యూటీ స్పీకర్‌కు నోటీసులు ఇవ్వాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా స్పీకర్ పదవికి కూడా టీడీపీ పోటీ పడే ఆలోచనలో ఉందని, టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తిని స్పీకర్ పదవికి పోటీగా దించేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే స్పీకర్ పదవికి పోటీ పడితే టీడీపీకి టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ లు మద్దతు ఇవ్వకపోవచ్చునని ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ సీనియర్లతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురవారం ఉదయం సమావేశమయ్యారు. విశ్వాస పరీక్షపై అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చలు జరిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తూ, కాంగ్రెసుతో తాము కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవడానికి ఇదే సమయమని భావించి, ముఖ్యమంత్రి విశ్వాస పరీక్షకు ముందే తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఎలా ఉంటుందనే విషయంపై ఆయన పార్టీ నాయకులతో చర్చించారు. తీవ్ర చర్చల అనంతరం అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనకు సంబంధించి నోటీసు ఇవ్వడానికి తెలుగుదేశం శానససభ్యులు డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వద్దకు వెళ్లారు.
విశ్వాస తీర్మానం ప్రతిపాదించి నెగ్గితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిలదొక్కుకుంటారని, ముఖ్యమంత్రి ప్రతిష్ట పెరుగుతుందని, కిరణ్ కుమార్ రెడ్డికి ఆ అవకాశం దక్కకుండా ముందుగానే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని చంద్రబాబు అనుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల తాము కాంగ్రెసుతో కుమ్మక్కు కాలేదని చెప్పుకోవడానికే కాకుండా వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులకు సవాల్ విసిరినట్లుగా కూడా ఉంటుందని భావిస్తున్నారు. స్పీకర్ ఎన్నిక సందర్భంగా చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని అనుకున్నారు.

No comments:
Post a Comment