Labels

భారతీయులు యెమెన్ విడిచి వెళ్లాలి


న్యూఢిల్లీ: యెమెన్‌లో నివసిస్తున్న భారతీయులందరు సాధ్యమైనంత తొందరల్లో ఆ దేశం విడిచి వెళ్లాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు శుక్రవారం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేసింది. యెమెన్ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా రాజీనామా కోరుతూ భద్రతాదళాలకు, స్థానిక పౌర సైన్యానికి మధ్య జరుగుతున్న పోరు తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
యెమెన్ రాజధాని సనలోని భార తీయ రాయబార కార్యాలయం వీరికి సహాయ సహాకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. అమెరికన్లు, బ్రిటీష్‌వారిని ఆ దేశం విడిచి వెళ్లాలని ఇప్పటికే ఆయా రాయబారి కార్యాలయాలు సూచించాయని పేర్కొంది. స్వచ్ఛందగా పదవి నుంచి తప్పుకునేందుకు ఆదివారం అధ్యక్షుడు అబ్దుల్లా సంతకం చేసేందుకు నిరాకరించటంతో ఆల్లర్లు మళ్లీ తీవ్ర రూపం దాల్చాయి. దీంతో సోమవారం ఒక్క రోజు జరిగిన హింసలో 70 మంది అశువులుబాశారు. 1978 లో దేశాధ్యక్ష పదవిని చేపట్టిన అలీ అబ్దుల్లా 2013లో తను ఈ పదవి నుంచి తప్పుకుంటానని చెబుతున్నా అక్కడి ప్రజలు ఆందోళనను విరమించట్లేదు.

No comments:

Post a Comment