* జగన్ అధ్యక్షతన 22 మంది సభ్యులతో కేంద్ర పాలక మండలి * జిల్లాలకు అడ్‌హాక్ కన్వీనర్లు, ఎన్నికల పరిశీలకులు... పార్టీ అధికార ప్రతినిధుల నియామకం * మహిళ, యువజన, విద్యార్థి విభాగాల అధ్యక్షుల ఎంపిక * ఇది తాత్కాలిక కమిటీ మాత్రమే... జూలై 8న పార్టీ ప్లీనరీ.. ఆ తర్వాతే పూర్తి స్థాయి కమిటీలు: భూమా * జగన్ పేరిట ఏర్పాటు చేసిన సంఘాలన్నీ రద్దు హైదరాబాద్, న్యూస్‌లైన్: పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ(అడ్‌హాక్)ని ప్రకటించింది. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి వై.ఎస్.విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా ఏర్పాటైన ఈ కమిటీలో కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన 22 మంది సభ్యులతో కూడిన కేంద్ర పాలక మండలి (సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్)తోపాటు వివిధ కమిటీలను పార్టీ నేత భూమా నాగిరెడ్డి ప్రకటించారు. గురువారమిక్కడ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జూపూడి ప్రభాకర్ రావు, వాసిరెడ్డి పద్మ, అబ్దుల్ రెహమాన్‌లతో కలసి భూమా విలేకరులతో మాట్లాడారు. అనుభవజ్ఞులైన ఇద్దరు సలహాదారులతో పాటు కేంద్ర పాలకమండలి (సీజీసీ), జిల్లాలకు అడ్‌హాక్‌కన్వీనర్లు, సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా ఎన్నికల పరిశీలకులు, పార్టీ అధికార ప్రతినిధులు, రాష్ట్ర మహిళా, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధుల పేర్లను వారు ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు జగన్ నేతృత్వంలో సుదీర్ఘ కసరత్తు అనంతరం పార్టీ మిత్రులు, శ్రేయోభిలాషులతో చర్చించి ఈ అడ్‌హాక్ కమిటీని నియమించారని చెప్పారు. అభ్యర్థులపై ఎంతో విశ్వాసంతో జగన్ వారిని ఎంపిక చేశారని.. అందుకే ప్రతి ఒక్కరూ తమ గురుతర బాధ్యతను సవాలుగా తీసుకొని పనిచేయాలని భూమా కోరారు. ‘పార్టీ అవసరాల కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరి గినా వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించే దిశగా కమిటీ రూపకల్పన జరిగింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలపడానికి కమిటీ తోడ్పడుతుంది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ కమిటీ తాత్కాలికమే’ అని స్పష్టం చేశారు. వైఎస్ జయంతి జూలై 8న ఇడుపులపాయలో మూడ్రోజులపాటు పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామని, తర్వాత పూర్తి స్థాయి కమిటీ ప్రకటిస్తామని అన్నారు. కమిటీలో అన్ని విభాగాలుంటాయన్నారు. వైఎస్సార్ కాం గ్రెస్‌లోకి చాలా మంది ప్రముఖులు త్వరలో వచ్చి చేర తారన్నారు. పార్టీ సభ్యత్వ నమోదును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తూ, పార్టీని గ్రామస్థాయి దాకా తీసుకెళ్లాలని సూచించారు. నాగం జనార్దన్‌రెడ్డి పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని విలేకరుల ప్రశ్నకు బదులుగా చెప్పారు. బాధ్యత పెంచిన ఎన్నికల తీర్పు.. కడప, పులివెందుల ఉప ఎన్నికల తీర్పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై బాధ్యతను మరింత పెంచిందని భూమా నాగిరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూసిన ఈ ఎన్నికల్లో జగన్ ప్రత్యర్థులకు డిపాజిట్ కూడా రాకుండా చేశారని గుర్తు చేశారు. కడప ప్రజలిచ్చిన తీర్పు పార్టీ క్యాడర్‌లో నూతనోత్సాహాన్ని, విశ్వాసాన్ని పెంచిందన్నారు. ఈ కొత్త ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా ప్రత్యర్థి పార్టీలను చిత్తుగా ఓడిస్తామన్నారు. జగన్ అభిమాన సం ఘాలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు జూపూడి ప్రభాకర్‌రావు తెలిపారు. వారంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పారు. యువకులు, అనుభవజ్ఞుల కలయిక.. అటు యువత, ఇటు అనుభవజ్ఞుల కలయికతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఏర్పాటు చేశారు. తాత్కాలిక కమిటీలే అయినా సాధ్యమైనంత మేర సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకూ ఇందులో స్థానం కల్పించినట్లు పార్టీ నేతలు చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభించనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ కమిటీలో విజయమ్మ, జగన్‌లను మినహాయిస్తే ఇద్దరు ఎమ్మెల్సీలు, పలువురు మాజీ మంత్రులు, జెడ్పీ మాజీ చైర్మన్లు. మాజీ ఎమ్మెల్యేలతో పాటుగా అనేక మంది యువకులకు ప్రాతినిధ్యం కల్పించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌ను మినహాయిస్తే అన్ని జిల్లాలకూ స్థానం లభించింది. కేంద్ర పాలక మండలిలోని 22 మందితో పాటు 27 మంది జిల్లా, నగర కన్వీనర్లను నియమించారు. సభ్యత్వ నమోదుతో పాటు ఎన్నికల పరిశీలకులుగా మరో 22 మందిని నియమించారు. వీరుగాక ఏడుగురు అధికార ప్రతినిధులతో సహా రాష్ట్ర మహిళా, యువజన, విద్యార్థి విభాగాలకు అధ్యక్షులను ప్రకటించారు. ఈ మూడు విభాగాలకూ కొత్తవారినే అధ్యక్షులుగా ఎంపిక చేయడం విశేషం. మొన్నటి వరకూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా పనిచేసిన డి.ఎ.సోమయాజులు, సి.సి.రెడ్డి వంటి నిపుణులను కీలకమైన సలహాదారు పదవుల్లో నియమించారు. పార్టీ అధికార ప్రతినిధులుగా నియమితులైన అంబటి రాంబాబు, ఆర్.కె.రోజా సెల్వమణి, బాజిరెడ్డి గోవర్దన్, జూపూడి ప్రభాకర్‌రావు, వాసిరెడ్డి పద్మ, గట్టు రామచంద్రరావు, హెచ్.ఎ.రెహ్మాన్ అందరూ రాజకీయ రంగంలో విశేష అనుభవం కలిగినవారే. ఆయా జిల్లాల నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని నలుగురు మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, పెన్మత్స సాంబశివరాజు, మాకినేని పెద రత్తయ్య, ఐ.రామకృష్ణంరాజులను తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతోపాటు తమ పదవులనూ వదిలివేసిన మాజీ జెడ్పీ చైర్మన్లు కాకాని గోవర్దన్‌రెడ్డి, వెంకటరమణారెడ్డిని నెల్లూరు, నిజామాబాద్ జిల్లాలకు అడ్‌హాక్ కన్వీనర్లుగా నియమించి, ప్రాధాన్యత కల్పించారు. మరో మాజీ చైర్‌పర్సన్ తోపుదుర్తి కవితకు కేంద్ర పాలక మండలిలో స్థానం లభించింది. మొత్తమ్మీద 9 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ ఎంపీలు, ఒక మాజీ ఎమ్మెల్సీ వివిధ హోదాల్లో నియమితులయ్యారు. ఇద్దరు ఎమ్మెల్సీల్లో జూపూడి ప్రభాకర్‌రావుకు పాలనా మండలితో పాటు అధికార ప్రతినిధుల జాబితాలో చోటు లభించింది. మహిళావిభాగం అధ్యక్షురాలిగా నియమితురాలైన నిర్మలా కుమారి, యువ జన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు మద్దినేని అజయ్ ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ (తాత్కాలిక)స్వరూపమిదీ .. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు: వై.ఎస్.విజయలక్ష్మి అధ్యక్షుడు: వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ గౌరవ సలహాదారులు: డి.ఎ.సోమయాజులు, సి.సి.రెడ్డి కేంద్ర పాలక మండలి: 1. కొణతాల రామకృష్ణ, 2. పెన్మత్స సాంబశివరాజు, 3. వై.వి.సుబ్బారెడ్డి, 4. హబీబ్ అబ్దుల్ రెహమాన్, 5. బి.కరుణాకర్‌రెడ్డి, 6. బాజిరెడ్డి గోవర్దన్, 7. కె.కె.మహేందర్‌రెడ్డి, 8. జ్యోతుల నెహ్రూ, 9. జూపూడి ప్రభాకర్‌రావు, 10. ఆర్.కె.రోజా సెల్వమణి, 11. డి.ఎ.సోమయాజులు, 12. మాకినేని పెదరత్తయ్య, 13. భూమా నాగిరెడ్డి, 14. జక్కంపూడి విజయలక్ష్మి, 15. కణితి విశ్వనాథం, 16. తోపుదుర్తి కవిత, 17. బాలమణెమ్మ, 18. మూలింటి మారెప్ప, 19. జంగా కృష్ణమూర్తి, 20. మదన్‌లాల్ నాయక్, 21. గిరిరాజ్ నాగేశ్, 22. గంప వెంకటరమణ. జిల్లా అడ్‌హాక్ కన్వీనర్‌లు 1. శ్రీకాకుళం-ధర్మాన పద్మప్రియ కృష్ణదాస్, 2. విజయనగరం-పెన్మత్స సాంబశివరాజు, 3. విశాఖపట్నం- కొణతాల రామకృష్ణ,4. తూర్పు గోదావరి-కె.చిట్టబ్బాయి, 5. పశ్చిమ గోదావరి-మోషేన్ రాజు, 6. కృష్ణా-సామినేని ఉదయభాను, 7. గుంటూరు-మర్రి రాజశేఖర్, 8. ప్రకాశం-ఎన్.బాలాజీ, 9. నెల్లూరు-కాకాని గోవర్దన్‌రెడ్డి, 10. చిత్తూరు-నారాయణ స్వామి, 11. అనంతపురం-పల్లె నర్సింహం, 12. కడప-కె.సురేష్ బాబు, 13. కర్నూలు-గౌరు వెంకటరెడ్డి, 14. మహబూబ్‌నగర్-ఎడ్మ కిష్టారెడ్డి, 15. నల్లగొండ-బీరవోలు సోమిరెడ్డి, 16. ఖమ్మం-కుంజా ధర్మా, 17. వరంగల్-కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి, 18. కరీంనగర్-రాజ్ ఠాకూర్, 19. నిజామాబాద్-వెంకట రమణారెడ్డి, 20. ఆదిలాబాద్- జనక్ ప్రసాద్, 21. మెదక్-భట్టి జగపతి, 22. రంగారెడ్డి- బి.జనార్దన్‌రెడ్డి, 23. విశాఖ (సిటీ)-రవిరాజ్, 24. విజయవాడ (సిటీ)-జలీల్ ఖాన్, 25. గుంటూరు(సిటీ)- లేళ్ల అప్పిరెడ్డి, 26. రాజమండ్రి-బొమ్మన రాజ్‌కుమార్, 27. తిరుపతి-పి.ప్రతాప్‌రెడ్డి. జిల్లా ఎన్నికల పరిశీలకులు 1. శ్రీకాకుళం-రవిబాబు, 2. విజయనగరం-సి.వంశీకృష్ణ, 3. విశాఖపట్నం-ఆర్.కె.రోజా సెల్వమణి, 4. తూర్పు గోదావరి- ఇందుకూరి రామకృష్ణ రాజు, 5. పశ్చిమ గోదావరి-వాసిరెడ్డి పద్మ, 6. గుంటూరు-జ్యోతుల నెహ్రూ, 7. కృష్ణా-రావి వెంకటరమణ, 8. ప్రకాశం-జంగా కృష్ణమూర్తి, 9. చిత్తూరు-బి.గోవిందరెడ్డి, 10. అనంతపురం-భూమా నాగిరెడ్డి, 11.కడప-శిల్పా చక్రపాణిరెడ్డి, 12. కర్నూలు-దేవగుడి నారాయణరెడ్డి, 13. నల్లగొండ-పుల్లా భాస్కర్, 14. రంగారెడ్డి-కె.మధుసూదన్ రావు, 15. మెద క్-ఆది శ్రీనివాస్, 16. కరీంనగర్-కె.కె.మహేందర్‌రెడ్డి, 17. వరంగల్-బాజిరెడ్డి గోవర్దన్, 18. ఖమ్మం-జి.నాగిరెడ్డి, 19. ఆదిలాబాద్-గట్టు రామచంద్రరావు, 20. నిజామాబాద్- జి.నిరంజన్ రెడ్డి, 21. మహబూబ్‌నగర్-బండారు మోహన్‌రెడ్డి, 22. విజయవాడ(సిటీ)-గౌతం రెడ్డి రాష్ట్ర సమన్వయకర్త (సభ్యత్వం-ఎన్నికలు): పీఎన్వీ ప్రసాద్ పార్టీ అధికార ప్రతినిధులు: 1. అంబటి రాంబాబు, 2. ఆర్.కె.రోజా సెల్వమణి, 3. బాజిరెడ్డి గోవర్దన్, 4. జూపూడి ప్రభాకర్‌రావు, 5. వాసిరెడ్డి పద్మ, 6. గట్టు రామచంద్రరావు, 7. హబీబ్ అబ్దుల్ రెహమాన్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు: కె.నిర్మలా కుమారి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు: పుత్తా ప్రతాప్‌రెడ్డి విద్యార్థి విభాగం అధ్యక్షుడు: మద్దినేని అజయ్. |
No comments:
Post a Comment