Labels

భారత్, చైనా యువతతో పోటీకి సిద్ధంగా ఉండండి

President Barack Obama surprises Booker T. Washington students before their commencement ceremony at Cook Convention Center in Memphis, Tenn. (Official White House Photo by Pete Souza) 
అమెరికా విద్యార్థులకు ఒబామా సూచన
May 18th, 2011

వాషింగ్టన్, మే 17: భారత్, చైనాల యువత నుంచి గట్టిపోటీ ఉన్నందున వారికన్నా ముందుండడానికి చాలా కృషి చేయాలని అమెరికా విద్యార్థులకు అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. ‘బీజింగ్, ముంబయిలో ఉన్న యువతతో మీరు పోటీ పడుతున్నారు. అది గట్టి పోటీ. ఆ పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు. వారు కఠోర శ్రమ చేస్తున్నారు. మీరు కూడా అలా శ్రమించడానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది’ అని ఒబామా టెనె్నస్సీలోని మెంఫిస్‌లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. ‘మనం ప్రస్తుతం ఒక కొత్త ప్రపంచంలో జీవిస్తున్నాం. మీకు పెద్దగా విద్య లేకపోయినా మీరు పరిశ్రమించడానికి సిద్ధంగా ఉంటే ఎక్కడికెళ్లినా ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరుకుతుంది. అయితే ఇప్పుడు అలాంటి రోజులు పోయాయి. నమ్మండి, నమ్మకపోండి, మీరు ఉద్యోగం కోసం వెళ్తున్నారంటే, మీరు కేవలం నశ్‌విల్లె లేదా అట్లాంటా యువతతోనే పోటీ పడటం లేదు’ అని ఒబామా అన్నారు. అనూహ్యంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అవసరమైన క్లిష్టమైన ఆలోచనా విధానాన్ని అలవరచుకోవాలి. కఠిన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్లేలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ కాళ్లపై మీరు నిలబడి ఆలోచించాల్సిన అవసరం ఉంది’ అని ఒబామా విద్యార్థులకు సూచించారు.

No comments:

Post a Comment