అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ మృతి
ఇటానగర్ : హెలికాప్టర్ ప్రమాదంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీఖండూ దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా తవాంగ్లోని లోబ్తాన్ లో జంగ్ జలపాతం వద్ద కుప్పకూలినట్లు తెలుస్తోంది. దోర్జీఖండూ సహా అయిదుగురి మృతదేహాలు లభ్యం అయినట్లు సమాచారం. కాగా దోర్జీఖండూ మృతిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు.ముఖ్యమంత్రి దోర్జీఖండూ సహా నలుగురు అధికారులు ఏప్రిల్ 30న తవాంగ్ నుంచి ఇటానగర్ వెళుతుండగా హెలికాప్టర్ అదృశ్యమైన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సహా నలుగురు అధికారులు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.హెలికాప్టర్ ప్రమాదంలో మూడు మృతదేహాలను కనుగొన్నట్లు కేంద్ర హోంమంత్రి చిదంబరం బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ హెలికాప్టర్ కూలిన ప్రాంతానికి వెళితే కానీ పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు ఓ బృందం బయలుదేరిందని చిదంబరం తెలిపారు.

No comments:
Post a Comment