Labels

తెలుగు బ్లాగుల దినోత్సవం – డిసెంబర్ రెండవ ఆదివారం

తెలుగు బ్లాగర్లకు, తెలుగు భాషాభిమానులకూ ఆహ్వానం
ఈ నెల రెండవ ఆదివారం అనగా (డిసెంబర్ 11న) తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం మరియు తేనీటి విందుని e-తెలుగు ఏర్పాటు చేసింది. తెలుగు బ్లాగర్లందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయమని ప్రార్థన. వివరాలు … తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు!
 తెలుగు బ్లాగుల దినోత్సవం – డిసెంబర్ రెండవ ఆదివారం
సమయం:
ఆదివారం, డిసెంబర్ 11, 2011 మధ్యాహ్నం 3 గంటలకు వేదిక:
హనీపాట్ ఐటీ కన్సెల్టింగ్ ప్రాంగణం,
6-2-46, అడ్వొకేట్స్ కాలనీ,
ఏసీ గార్డ్స్, లకడీ-కా-పూల్,
హైదరాబాద్ – 500 004. (పటం)
సంప్రదింపులు:
93965 33666
ఇప్పటివరకూ బ్లాగ్ముఖంగా మాత్రమే పరిచయమున్న మిత్రులను కలిసే సదవకాశమిది. మీకున్న సాంకేతిక సమస్యలను నలుగురితో చర్చించి వాటికి పరిష్కారమూ పొందవచ్చు. పాల్గొన్నవారందరికీ ఈ సమావేశం నూతనోత్సాహాలను కలగజేస్తుందని ఆశిస్తున్నాం.
వచ్చే ఏడాదికి తెలుగు బ్లాగులు “లక్ష బ్లాగులూ కోటి సందర్శకులు”గా ఎదగాలని ఆశిస్తూ… తెలుగు బ్లాగరులందరికీ ఇదే మా ఆహ్వానం! ,
  • వ్యాఖ్యానించడానికి , సలహాలకు  http://etelugu.org/telugu-blogs-day-2011 , మన మొదటి సమావేశ డిసెంబరు 14 ఆదివారం  2008 వివరాలు http://etelugu.org/node/145 
తెలుగు బ్లాగర్లందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు
మీ శ్రేయోభిలాషి
కశ్యప్
9396533666
kaburlu.wordpress.com